మొట్టమొదటిసారిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జాతీయస్థాయిలో పాఠశాలలకు పారిశుద్ధ్య అవార్డులను ప్రకటించింది. మొత్తం అవార్డులు 179 పాఠశాలలకు లభించగా, వాటిలో 39 పాఠశాలలు ఢిల్లీ నగరం లోనివే కావటం విశేషం. సిబిఎస్‌ఇ నియమ నిబంధనల ప్రకారం నూటికి నూరుశాతం పరిశుభ్రంగా వున్న పాఠశాలల్లో తొలి స్థానం సంపాదించిన రెండు పాఠశాలలు ఢిల్లీ నగర పరిధిలోనివే. గురుగావ్‌లోని సల్వాన్ పబ్లిక్ స్కూలు, ఢిల్లీలోని కల్కా పబ్లిక్ స్కూలు- ఈ రెండూ అత్యంత పరిశుభ్రమైన పాఠశాలలుగా గుర్తింపు పొందాయి. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన జాతీయ పాఠశాలల పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్‌మెంట్ సహకారంతో నిర్వహించిన ఈ పోటీలో మొత్తం 887 పాఠశాలలు పాల్గొనగా, విజేతలుగా నిలిచిన పాఠశాలలకు మానవ వనరుల అభివృద్ధి మంత్రి చేతుల మీదుగా సర్ట్ఫికెట్లు, నగదు బహుమతులు అందాయి.
మొట్టమొదటిసారిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జాతీయస్థాయిలో పాఠశాలలకు పారిశుద్ధ్య అవార్డులను ప్రకటించింది.
english title:
subratato
Date:
Tuesday, January 8, 2013