సింహాచలం, జనవరి 9: అన్యమతాల ఆగడాలను అరికట్టాలంటే మత మార్పిళ్ళపై చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి డిమాండ్ చేశారు. గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కొత్తవలస నుండి మహావిశాఖ నగర పరిధిలోని సింహాచలం వరకు వేలాది మందితో బుధవారం జరిగిన పాదయాత్రలో స్వామిజీ పాల్గొన్నారు. ఇది హిందువుల విజయోత్సవ పాదయాత్రగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా సింహాచలం గోవులశాల వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమాన్ని స్వామిజీ ప్రారంభించారు. అరకు, పాడేరు, డుంబ్రగుడ ప్రాంతాలలో పాటు కొత్తవలస పరిసరాల నుండి వచ్చిన వేలాది మందికి స్వామిజీ స్వయంగా అన్నప్రసాదం అందజేశారు. భారతదేశంపై, హిందూ జాతిపై అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కఠినమైన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మంపై కుట్ర పూరితమైన వ్యాఖ్యలు చేసిన ఎవరినైనా శిక్షించాల్సిందేనన్నారు. అన్య మతస్తులు మత మార్పిళ్ళకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో అమాయక గిరిజనులను మభ్యపెట్టి మతాలు మారుస్తున్నారని స్వామిజీ ఆరోపించారు. మహిళలను మాతృమూర్తులుగా భావించే భారతావనిలో స్ర్తిలపై అత్యాచారాలు జరగడం ఆందోళన కలిగించే అంశమన్నారు. స్ర్తికి అన్ని విధాల రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్వామిజీ అన్నారు. గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి జగదీశ్‌బాబు మాట్లాడుతూ ప్రతి ఏటా కొత్తవలస నుండి సింహాచలం పాదయాత్రగా వచ్చి సింహాద్రినాథుని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
అన్యమతాల ఆగడాలను అరికట్టాలంటే మత మార్పిళ్ళపై చట్టం తీసుకురావాల్సిన
english title:
m
Date:
Thursday, January 10, 2013