చాంద్రాయణగుట్ట, జనవరి 9: నేషనల్ మెరిట్ కమ్ మిన్స్ స్కాలర్‌షిప్ పొందుటకు విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను దరఖాస్తులో నమోదు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎస్.ఎ.ఎమ్.రిజ్వీ అన్నారు. పాఠశాల విద్యార్థులు ప్రీ మెట్రిక్, నేషనల్ మెరిట్ కమ్ మిన్స్ ఉపకార వేతనాలు పొందుటకు ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలని అందులో తప్పనిసరిగా ప్రభుత్వపరంగా పొందిన ఆధార్ కార్డ్ నంబర్ లేదా ఐఐడి నంబరు పొందుపరచాలన్నారు. ప్రతి విద్యార్థి బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను కూడా కలిగి వుండాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద ప్రతి విద్యార్థి ఆధార్ నంబరు, యుఐడి, ఐఐడి జిరాక్స్‌కాపీని రికార్డుకోసం భద్రపరచాలన్నారు. జిల్లాల్లో నేషనల్ మెరిట్ కమ్ మిన్స్ ఉపకార వేతనాల కొరకు 674మంది విద్యార్థులుండగా 455 మంది విద్యార్థులకు ఆధార్ లభించిందని మిగతా విద్యార్థులకు కూడా త్వరలో ఆధార్ నంబరు సేకరించి పంపాలన్నారు. ప్రీ మెట్రిక్ ఎస్‌సి విద్యార్థులు 3,903మంది ఉన్నారని, ప్రతి విద్యార్థి ఈ ఆన్‌లైన్ ద్వారా ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం వివరాలు ఆధార్ నంబర్‌తో సహా నమోదు చేయాలన్నారు. ప్రతి విద్యార్థి మీ సేవ ద్వారా కుల, ఆదాయ ధృవ పత్రాలను పొందాలన్నారు. ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా నంబరు, మీ సేవ ద్వారా కుల ఆదాయ ధృవ పత్రాలు ఈ మూడు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ చెప్పారు. 9, 10 తరగతులు చదివే ఎస్‌సి విద్యార్థులకు రాజీవ్ విద్యాదీవెన పథకం కింద నెలకు150 రూపాయల చొప్పున సంవత్సరానికి రు 1500 ఇస్తామన్నారు. దాంతోపాటు ఇతర ఖర్చులకు 750 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 2,250 చెల్లిస్తామని తెలిపారు. ఈ పథకం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఈ వివరాలు కూడా ఈపాస్ ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయాలన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా విద్యా శాఖాధికారి సుబ్బారెడ్డి, ఆర్‌విఎంపివో సుశీందర్‌రావుతోపాటు ఉప విద్యా శాఖాధికారులు, ఉప పర్యవేక్షణాధికారులుతదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు
నేషనల్ మెరిట్ కమ్ మిన్స్ స్కాలర్‌షిప్ పొందుటకు విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను దరఖాస్తులో
english title:
u
Date:
Thursday, January 10, 2013