హైదరాబాద్, జనవరి 9: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి రాములు తెలిపారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, హౌజింగ్ తదితర అంశాలపై బుధవారం నిర్వహించిన డయల్ యువర్ అధికారి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాలాల్ మండలంలోని కమలాపూర్ గ్రామం నుండి చంద్రవౌళి అనే వ్యక్తి ఫోన్‌చేసి మ్యుటేషన్‌కై దరఖాస్తు చేయగా ఇప్పటివరకూ సంబంధిత తహసీల్దార్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. అదేవిధంగా శామీర్‌పేట మండలంలోని ఆద్రాస్‌పల్లి గ్రామం నుండి ఓ వ్యక్తి ఫోన్‌చేసి ఇసుక ఫిల్టర్లు అక్రమంగా పనిచేస్తున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అదే మండలంలోని లక్ష్మాపూర్ గ్రామం నుండి ఓ వ్యక్తి ఫోన్‌చేసి పట్టాదారు పాసు పుస్తకాలపై గత రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేయగా ఇప్పటివరకూ రాలేదని ఫిర్యాదు చేశారు. వీటన్నింటిపై స్పందించిన డిఆర్‌ఓ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తామని తహసీల్దార్లతో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. పైన పేర్కొన్న సమస్యల్లో కొన్నింటికి సంబంధిత తహసీల్దార్లు కొంతమేరకు చర్యలు తీసుకున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని వారం రోజుల్లోగా పూర్తిస్థాయి పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలియజేశారు. సక్రమంగా పనిచేయని చౌకధరల దుకాణాలపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల అధికారి నర్సింహ్మారెడ్డి తెలిపారు. పరిగి మండల కేంద్రం నుండి సమద్ అనే వ్యక్తి ఫోన్‌చేసి తమ మండలంలోని చౌకధరల దుకాణాల డీలర్లు సరుకులు సక్రమంగా పంపిణీ చేయకుండా వినియోగదార్లను సతాయిస్తున్నారని చేసిన ఫిర్యాదుకు స్పందిస్తూ డిఎస్‌ఓ నిబంధనల మేరకు పనిచేయని డీలర్లను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పూడూరు మండలం నుండి ఓ వ్యక్తి ఫోన్‌చేసి ఇందిరా అవాస్ యోజన క్రింద కేటాయించిన ఇళ్లు అర్హులకు రాలేదని ఫిర్యాదు చేయగా అందుకు జిల్లా గృహ నిర్మాణ పిడి మోహన్ స్పందిస్తూ ఇందుకు సంబంధించి నిర్దిష్ట ఆధారాలతో లిఖిత పూర్వకంగా సమర్పిస్తే విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి మొత్తం 32 ఫిర్యాదులు అందగా వాటిలో రెవెన్యూ, పౌర సరఫరాలు, హౌజింగ్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి పారుదల శాఖ, సాంఘిక సంక్షేమ, బిసి, యస్సీ తదితర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భూపరిరక్షణ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ప్రభాకర్‌రెడ్డి, లా అధికారి వేణుగోపాల్, పరిపాలనాధికారి విక్టర్ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి
english title:
r
Date:
Thursday, January 10, 2013