ఖైరతాబాద్, జనవరి 9: విద్యుత్ చార్జీల పెంపుదలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఖైరతాబాద్‌లోని విద్యుత్ ప్రధాన కార్యాలయం విద్యుత్‌సౌధా ముట్టడి నిర్వహించింది. ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టు రాంచందర్, విజయేందర్, పుత్తాప్రతాప్‌రెడ్డి, విజయారెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు విద్యుత్ సౌధా వద్దకు ర్యాలీగా వచ్చారు. పెద్దఎత్తున అక్కడి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్న కార్యకర్తలను అదుపుచేయడం పోలీసులకు కష్టసాధ్యమైంది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ఇబ్బందులకు గురిచేస్తుండగా విద్యుత్ చార్జీల భారం మరింత ఇబ్బంది కల్గించబోతోందని, వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలన్నారు.
విద్యుత్ చార్జీల పెంపుదలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ వైఎస్సార్
english title:
v
Date:
Thursday, January 10, 2013