Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమస్యలు పరిష్కారమయ్యేనా!

$
0
0

అనంతపురం, జనవరి 10 : నేడు ఆహార సలహా సంఘం సమావేశం నిర్వహించనున్నారు. ఇలా ప్రతిసారీ సమావేశాలు నిర్వహిస్తున్నా సాధించింది మాత్రం శూన్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి.ప్రతి సమావేశంలోనూ పలు నిర్ణయాలు తీసుకుంటున్నా వాటిపై చర్యలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రతి రెండు నెలలకు ఒకమారు ఆహార సలహా సంఘం సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా దీనిని అధికారులు పట్టించుకోవడం లేదు. వారికి తీరిక చిక్కినప్పుడు సమావేశాలు నిర్వహించి మమ అనిపిస్తున్నారని సలహా సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రతి సమావేశంలోనూ సలహా సంఘం సభ్యులు లేవనెత్తిన పలు సమస్యలపై చర్యలు తీసుకున్న దాఖలాలు శూన్యమనే చెప్పవచ్చు. ఇక ప్రతి సమావేశంలోనూ అక్రమంగా కలిగి ఉన్న తెల్ల రేషన్ కార్డులపై చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేసినా తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. పలు సమావేశాల్లో సంఘ సభ్యులు ఇన్‌కంటాక్స్ కట్టేవారు, కాంట్రాక్డులు చేసే వారు, గతంలోమద్యం టెండర్లు దాఖలు చేసిన వారి నుంచి తెల్ల రేషన్ కార్డులు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినా వారి రోదన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది తప్పించి ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రతి ప్రతి గ్యాస్ ఏజన్సీలోనూ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త గ్యాస్ కనెక్షన్ కావాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే ఏజన్సీలు అధిక ధరలు చెప్పి కొత్త గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. దీంతోపాటు గ్యాస్ కనెక్షన్ తో పాటు స్టౌ ఖచ్చితంగా కొనాలన్న నిబంధనను కొనసాగిస్తున్నారు.స్థానికంగా ఉన్న పలు ఏజన్సీల డెలివరీ బాయ్ ల ఆధ్వర్యంలోఅక్రమ సిలిండర్ ల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. గడచిన నెలలోనగరంలోనే పెద్ద ఎత్తున డెలివరీ బాయ్ నుంచి అక్రమ సిలిండర్ లను స్వాధీనం చేసుకున్న ఉదంతమే ఇందుకు ఉదాహరణ. ఇక పెట్రోలు బంకుల్లో తనిఖీలు శూన్యం, పలు పెట్రోలు బంకులు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు కూడా వినియోగదారులకు అందించడం లేదు. ఇక కల్తీ పెట్రోలు, డీజిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జీరో వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. దీనిని అరికట్టాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మాత్రం నిద్ర మత్తులోజోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాస్టిక్ సామాన్లు, సిమెంటు, ఇనుము లాంటి పలు వ్యాపారాలు జీరోదందాలోకొనసాగుతున్నాయి. ఇలా ప్రభుత్వానికి పన్నుల రూపంలోరావాల్సిన మొత్తానికి భారీ ఎత్తున గండిపడుతోంది. ఇక జిల్లావ్యాప్తంగా ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారా లేరా అన్నది అనుమానాస్పదంగా ఉంది. జిల్లాలో ఎక్కడ ఏ హోటల్, రెస్టారెంట్లలోనూ తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. ఇలా పలు మార్లు ఆహార సలహా సంఘం సమావేశాలు నిర్వహించినా వారు చేసింది మాత్రం శూన్యమనే చెప్పవచ్చు.

బిజెపి కొత్త అధ్యక్షుడు అంకాల్ రెడ్డి
అనంతపురం సిటీ, జనవరి 10: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జంగంరెడ్డి అంకాల్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం స్థానికి జిల్లా బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికలకు రాష్ట్ర పార్టీ నుండి ఎన్నికల పరిశీలకులుగా కె.రామకృష్ణ, నందకుమార్ యాదవ్, ఎంఎస్.పార్థసారథిలు వ్యవహరించారు. జిల్లాలోని బిజెపి మండల అధ్యక్షులు, ప్రతనిధులు ఓటర్లు హాజరయ్యారు. ఈ ఎన్నికలలో గతంలో ప్రధాన కార్యదర్శులుగా పనిచేస్తున్న అంకాల్‌రెడ్డి, లలిత్‌కుమార్‌లు నామినేషన్లు వేశారు. వీరిద్దరిపై రాష్ట్ర పరిశీలకులు జిల్లాలోని ఓటర్లు నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. అనంతరం లలిత్‌కుమార్ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో అంకాల్‌రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర పరిశీలకులు కె.రామకృష్ణ ప్రకటించారు. అధ్యక్షుడితోపాటు 14 మందిని రాష్ట్ర కౌన్సిలర్స్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పరిశీలకులు రామకృష్ణ, నందకుమార్ యాదవ్, పార్థసారథిలు మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండకట్టే విధంగా ప్రతనిధులు పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న అవినీతిని, అక్రమాలను ప్రజలు తిప్పికోట్టే సమయం అసన్నమైందన్నారు. ఇప్పటికిప్పుడు సర్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలను, రైల్వే చార్జీలు పెంచడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. స్వార్థ రాజకీయ పార్టీలతో అధికార పార్టీల నాయకులు, మంత్రులు సంపాదన కోసం ప్రజలపై వివిధ రూపాలలో భారం మోపడం చాలా బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తామనడం చాలా సిగ్గుచేటన్నారు. జిల్లాలో కూడా ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారడం అన్ని పార్టీల నాయకులు చేస్తున్నారని, మన పార్టీలో మాత్రం అలాంటివి ఏమి జరగలేదని, ఎందుకంటే మనం అవినీతికి దూరంగా ఉంటామని, ప్రశాంతంగా తిరగగలమని, అధికారి, ప్రతిపక్షాలు చేసే అవినీతిని తిప్పికొట్టగలమన్నారు. జిల్లాలో మండల, గ్రామాలలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి అందరు ఏకధాటిగా కృషి చేసి రాబోవు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నూతన అధ్యక్షుడికి పార్టీ శ్రేణులు సహకరించి, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని కోరారు. అనంతరం నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జంగంరెడ్డి అంకాల్‌రెడ్డికి రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రామకృష్ణ, నందకుమార్ యాదవ్, పార్థసారథి, మాజీ జిల్లా అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లలిత్‌కుమార్, అధికార ప్రతినిధి వెంకటేశ్వరరెడ్డి, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బిల్లే రవీంద్ర, మల్లారెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, పూల ప్రభాకర్, మహిళలు ఆదిలక్ష్మి, జయమ్మ, ఇతర పార్టీలు నాయకులు, జిల్లా కార్యవర్గం, మండల అధ్యక్షులు, ప్రతినిధులు మాలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేసారు.

చిరుతపులిని బంధించిన ములకల పెంట గ్రామస్థులు
గుంతకల్లు, జనవరి 10: చిరుత పులిని ప్రాణాలతో బంధించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన సంఘటన గురువారం మండలంలోని ములకల పెంట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పది రోజులుగా చిరుత పులి మండల పరిధిలో సంచరిస్తు మేకలను, గొర్రెలను వేటాడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుత పులిని ములకల పెంట గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు చాకచక్యంగా బంధించారు. ములకల పెంట గ్రామానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో గల కొండ ప్రాంతంలో గ్రామానికి చెందిన హనుమన్న, నారాయణ, వరదరాజులు, సురేష్‌లు గొర్రెల మేపుతున్నారన్నారు. గురువారం తెల్లవారు జామున 3.30 గంటలకు గొర్రెలకు కాపలాగా వున్న కుక్కలు చిరుతపులిని గుర్తించాయి. దీంతో చిరుతపులి వెంట కాపలా కుక్కలు వెంటపడి తరుమాయి. గొర్రెల కోసం ఎలుగుబంటి లాంటి జంతువు వచ్చిందని కాపరులు కుక్కల వెంట పరుగులు తీశారన్నారు. అయితే కుక్కల దాటికి చిరుత పులి సమీపంలో చెట్టు మీద వున్నట్లు గుర్తించిన హనుమన్న, వరదరాజులు, నారాయణ, సురేష్‌లు గ్రామంలో పందులను బందించే వల తీసుకుని రావాలని ఫోన్ చేసినట్లు తెలిపారు. వలతో పాటు గ్రామానికి పది మంది యువకులు వచ్చారన్నారు. దీంతో చెట్టు కింద వల పన్ని కాపలాగా బైఠాయించారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు అక్కడికి అధిక సంఖ్యలో చేరుకోవడంతో చెట్టుపై వున్న చిరుత పులి మెల్లగా కిందకు దిగి పరుగులు తీసేందుకు ప్రయత్నించింది. అప్పటికే చెట్టుచుట్టూ వున్న వలలో చిక్కుకుంది. చిరుతను బందించిన గ్రామస్థులు గ్రామానికి తీసుకుని వచ్చారు. సమాచారం అందుకున్న రూరల్ సిఐ మున్వర్ హుసేన్, కసాపురం ఎస్సై సునీతలు గ్రామానికి చేరుకుని గుత్తి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటేశ్వరులు, బీట్ ఆఫీసర్ రామచంద్రయ్యలకు చిరుతపులిని అప్పగించారు. వణ్య ప్రాణులను చంపకుండ ప్రాణాలతో బంధించిన గ్రామస్థులకు ప్రభుత్వం రూ. 10 వేల రూపాయలు ఆర్థిక సహయం అందించింది.

బ్యాంకర్లు అంకిత భావంతో పనిచేయాలి
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, జనవరి 10 : జిల్లా అధికారులు, బ్యాంకర్లు మరింత అంకిత భావంతోపనిచేసి జిల్లాలోని పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చేసి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ వి. దుర్గాదాస్ సూచించారు.గురువారం ఉదయం స్థానిక డ్వామా సమావేశ మందిరంలోజిల్లా కలెక్టరు జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 2012-13 వార్షిక రుణ ప్రణాళిక, పలు సంక్షేమ పథకాలకు బ్యాంకు రుణాల మంజూరు గురించి అధికారులతోసుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్ వి. దుర్గాదాస్ మాట్లాడుతూ .. జిల్లా గత కొన్ని సంవత్సరాలుగా కరువు పీడిత ప్రాంతంగా కొనసాగుతోందన్నారు. ఈసారి కూడా జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిందని, ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జిల్లాకు చేరిందన్నారు. అందరు అధికారులు మరింత అంకిత భావంతోపనిచేసి కరువు జిల్లా ప్రజలకు సహాయపడాలన్నారు. 2012-13 వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం రూ.2476 కోట్ల పంట రుణాలు లక్ష్యం కాగా గత సెప్టెంబరు మాసాంతానికి రూ.2177.11కోట్లు మంజూరు చేసి బ్యాంకర్లు మంచి పురోగతి సాధించారన్నారు. అలాగే వ్యవసాయ టర్మ్ రుణాల కింద రూ. 240 కోట్లకు గానూ, రూ. 228.93 కోట్లు మంజూరు అయ్యాయని, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు రూ.100.40 కోట్లకుగానూ, రూ. 71.66 కోట్లు మంజూరయ్యాయన్నారు. గత సంవత్సరం పెద్ద మొత్తంలోరుణాలు అందచేసినందులకు అభినందిస్తూ అదే స్ఫూర్తిని మునుముందు కొనసాగించాలన్నారు. నగదు బదిలీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, జిల్లాలో17 పథకాలకు బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులకు అనుసంధానం చేస్తూ వర్తింపచేయడం జరిగిందన్నారు.జిల్లాలో 14,022 మంది జననీ సురక్ష యోజన పథకం కింద లబ్దిదారులున్నారని వారిలోజనవరి నెలలోప్రసవించనున్న గర్భవతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు చొరవ చూపాలన్నారు. ప్రసవం జరిగిన 48 గంటలలోగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలోరూ.700 తప్పనిసరిగా జమ కావాలని, తద్వారా మధ్య దళారీల బెడద లేకుండా నేరుగా లబ్దిదారునికి చేరడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యూనిట్లు నెలకొల్పడం చాలా వెనుకబడి ఉందని, 1943 యూనిట్లకుగానూ, 1054 మంజూరు కాగా, కేవలం 149 మాత్రమే నెలకొల్పడం సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఎస్టీ, బిసి, మైనార్టీ,చేనేత సంక్షేమ పథకాలు ముమ్మరంగా అమలు చేయాలన్నారు. 2011 పంట నష్టం ఇన్‌పుట్ సబ్సిడీ మొదటి దశలో ఇంకా పెండింగులో ఉన్న రూ. 1.75 కోట్ల రూపాయలు శుక్రవారం 11వ తేదీలోగా పరిష్కారం కావాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జిల్లాలోకనగానపల్లి తదితర ప్రాంతాల్లో లొంగిపోయిన నక్సలైట్లకు జీవనం కోసం బ్యాంకర్లు ఆర్థిక సహాయం అందించాలన్నారు. జిల్లాకు మంజూరైన 245 మినీ డెయిరీల ఏర్పాటుకు సత్వరమే చర్యలు గైకొనాలన్నారు. మార్చి నెల సమీపిస్తున్నందున పట్టు పరిశ్రమ, గృహ నిర్మాణం, ఆన్‌సెట్ తదితర ప్రభుత్వ పథకాల నిర్ణీల లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం డి ఆర్ డి ఎ పిడి ప్రశాంతి మాట్లాడుతూ .. జిల్లాలో 2012-13 సంవత్సరానికి రూ.410.83 కోట్లు స్వయం సహాయక సంఘాలకు రుణాలివ్వాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకూ రూ.422కోట్లు అందించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలోనిలిచామని చెప్పగా జిల్లా కలెక్టరు వెంటనే స్పందించి అందుకు కృషి చేసినందుకు బ్యాంకర్లందరూ అభినందనీయులన్నారు. అలాగే మెప్మా ద్వారా రాష్ట్రంలోకడప మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో అనంతపురం జిల్లా ఉందని మెప్మా పిడి మల్లీశ్వరిదేవి తెలిపారు. మొదటి స్థానం చేరుకోవడానికి మరింతగా కృషి చేయాలని కలెక్టరు కోరారు. ఈ సమావేశంలోజాయింట్ కలెక్టరు ఎస్.సత్యనారాయణ, అదనపు జాయింట్ కలెక్టర్ బి ఎల్ చెన్నకేశవరావు, ఎల్‌డియమ్ జయశంకర్, ఆర్‌బి ఐ ఎజి ఎం కులకర్ణి, నాబార్డు ఎజి ఎం రవీంద్రప్రసాద్, ఎపిజిబి ఆర్ ఎం మహమ్మద్ ఖాన్, ఆంధ్రాబ్యాంకు డిజి ఎం దుర్గాప్రసాద్, సిండికేటు బ్యాంకు డిజి ఎం అనంతరాములు, ఎస్‌బి ఐ ఆర్ ఎం రత్నకుమారి, ఆంధ్రాబ్యాంకు చీఫ్ మేనేజరు అమరేష్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి జనార్ధనరావుతదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలీసుల ఎదుట హాజరైన పరిటాల శ్రీరామ్
ధర్మవరం రూరల్, జనవరి 10: ధర్మవరం మండలం కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి హత్యాయత్న కుట్ర కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న పరిటాల శ్రీరామ్ ధర్మవరం రూరల్ పోలీసుల ఎదుట గురువారం సాయంత్రం హాజరయ్యారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, తన కుమారుడు శ్రీరామ్‌ను వెంటతీసుకొని భారీ కాన్వాయితో పోలీసు స్టేషన్‌కు వచ్చారు. శ్రీరామ్‌కు జిల్లా కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో ధర్మవరం రూరల్ పోలీసుల స్టేషన్‌లో రూ.25 వేలతోపాటు ఇద్దరు వ్యక్తుల పూచీకతు పోలీసులకు ఇవ్వాలని, అంతేగాక పోలీసు విచారణకు నిత్యం అందుబాటులో వుండాలని ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో శ్రీరామ్ గురువారం తన తల్లితోపాటు వందలాది మంది టిడిపి నాయకులు, కార్యకర్తల కాన్వాయి మధ్య హాజరయ్యారు. స్టేషన్‌కు హాజరైన శ్రీరామ్‌తోపాటు రాఘవేంద్రుడు, సిఐ నరసింగప్ప, ఎస్‌ఐ అబ్దుల్ కరీంల సమక్షంలో స్టేషన్‌లో సంతకం చేశారు. అనంతరం సునీతతోపాటు పలువురు నాయకులను సిఐ బయటకు పంపి న్యాయవాదులు హర్షవర్దన్‌రెడ్డి, శ్రీ్ధర్‌రెడ్డి, రంగనాయకులు, సూర్యప్రకాష్, సుబ్బారావు, పరిటాల శైలజల సమక్షంలో దాదాపు గంటపాటు విచారణ చేశారు. పోలీసు విచారణలో పరిటాల శ్రీరామ్ తనకు స్వంత కారు లేదని, మొబైల్ ఫోన్ కూడా లేదని పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. పోలీసులు న్యాయవాదుల సమక్షంలో శ్రీరామ్‌ను శ్రీరామ్ బయోడేటాతోపాటు విద్యాభ్యాసం చేసిన ప్రదేశాలు, ప్రస్తుతం చేస్తున్న పనులను తొలుత ఆరా తీశారు. శ్రీరామ్ నల్గొండలో 10వ తరగతి వరకు చదివారని, అనంతరం ఇంటర్మీడియట్ వైజాగ్‌లో చేశానని, బిబిసి సింగపూర్‌లో పూర్తి చేశానని పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. 2012లో స్వదేశానికి తిరిగి వచ్చానని సింగపూర్‌లో వున్న ఫోన్ నంబర్ కాలం చెల్లిందని, ఆ నంబర్ సైతం గుర్తులేదన్నట్లు సమాచారం. ప్రధానంగా హత్యా కుట్ర విషయంపై ఆరా తీస్తే ఈ హత్య కుట్రకు తనకు ఎలాంటి సంబంధం లేదని, అంతేకాకుండా నాగూర్ హుస్సేన్ పరిచయమే లేదని తెలిపినట్లు సమాచారం. అయితే పరిటాల సునీత డ్రైవర్ రాము మాత్రం తెలుసునన్నట్లు తెలిసింది. అనంతరం పలు కోణాల్లో పోలీసులు శ్రీరామ్‌ను దాదాపు గంటసేపు విచారణ చేశారు.
కేసులకు భయపడే ప్రసక్తే లేదు...!
అక్రమంగా తనపై కేసులు బనాయించినా వాటికి భయపడే ప్రసక్తే లేదని పరిటాల శ్రీరామ్ మీడియా ముందు స్పష్టం చేశారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన శ్రీరామ్ తన తల్లి సునీతతో కలిసి స్టేషన్ ఆవరణలోనే మీడియా ముందు మాట్లాడుతూ తమ కుటుంబం సమాజ సేవకే అంకితమైందని, కొందరు వ్యక్తులు తమపై పనికట్టుకొని అక్రమంగా కేసులు బనాయించారని వీటికి భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. పరిటాల రవి ట్రస్టు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో రాజకీయాల గురించి మాట్లాడదలచుకోలేదని దాటవేశారు.

కొళాయి కనెక్షన్ల క్రమబద్దీకరణకు కసరత్తు!
హిందూపురం టౌన్, జనవరి 10: సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో డబ్బులు కట్టేందుకు వచ్చిన బాధితుల నుండి వెనువెంటనే కట్టించుకోవడం రివాజు. అయితే స్థానిక మున్సిపాలిటీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొళాయి కనెక్షన్లు వేసుకొన్న యజమానులు నీటి పన్ను చెల్లించేందుకు వచ్చినా వారిని రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకొంటున్నారు. స్థానిక మున్సిపాలిటీలో దాదాపు 11 వేల దాకా అధికార, అనధికార గృహ అవసర కొళాయి ఉన్నాయి. ఇందులో దాదాపు 8 వేల కొళాయి కనెక్షన్‌లు మాత్రమే ఆన్‌లైన్ కాగా మిగిలిన కొళాయి కనెక్షన్‌లు ఆన్‌లైన్ కాకపోవడంతో నీటి పన్ను చెల్లించేందుకు యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీలో కొళాయి కనెక్షన్ పొందేందుకు డిడితోపాటు దరఖాస్తు చేసుకొన్న తర్వాత సిబ్బంది వాటిని పరిశీలించి ఎస్టిమేషన్ చార్జీలను వసూలు చేసిన తర్వాత ప్రొసిడింగ్స్ ఇచ్చి కొళాయి కనెక్షన్ వేయాల్సి ఉంటుంది. అయితే గతంలో కొందరు యజమానులు కేవలం దరఖాస్తుతోపాటు డిడిలు ఇచ్చిన వెంటనే ఎలాంటి ఎస్టిమేషన్ చార్జీలు చెల్లించకుండానే కొళాయి కనెక్షన్‌లు వేసుకున్నారు. ఆయా కొళాయి కనెక్షన్‌లకు నీటిని సరఫరా చేస్తున్నా వారి నుండి ఒక్క రూపాయి పన్ను వసూలు కావడం లేదు. ప్రస్తుతం అలాంటి కనెక్షన్‌లు దాదాపు 3 వేల దాకా ఉన్నట్లు సమాచారం. కొళాయి కనెక్షన్ పొందిన వినియోగదారులు ప్రతినెలా నీటి పన్ను రూపేణా రూ.100 మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఉన్నతాధికారులు మున్సిపల్ పరిధిలోని కొళాయి కనెక్షన్‌లను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తీవ్రంగా స్పందించారు. కింది స్థాయి సిబ్బందిని పిలిపించి మున్సిపల్ పరిధిలోని మొత్తం కొళాయి కనెక్షన్‌లను గుర్తించి అందులో ఆన్‌లైన్ కాని, ఆన్‌లైన్ అయిన కొళాయి కనెక్షన్‌ల జాబితాలను తయారు చేసి రెండు, మూడు రోజుల్లోపు అందచేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా కొళాయి కనెక్షన్ వేసుకొని ఆన్‌లైన్ కాని యజమానులు నీటిపన్ను చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయానికి వస్తుండగా వాటిని చెల్లించుకోవాల్సిన అధికారులు సంబంధం లేని కారణాలు చెబుతూ పన్ను చెల్లించుకొనేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో పన్ను చెల్లిస్తామన్నా కట్టించుకొనే నాథుడే లేకపోయారని పెదవి విరుస్తున్నారు. ఆయా ఆన్‌లైన్‌కాని కొళాయి కనెక్షన్‌ల ద్వారా నీటి పన్ను చెల్లించుకొంటే మున్సిపాలిటీకి దాదాపు కోటి రూపాయల వరకు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. ఇకపోతే ఈ ఆన్‌లైన్ కాని కొళాయి కనెక్షన్‌ల విషయమై మున్సిపల్ ఇంజనీర్ భాస్కర్‌రావును అడగ్గా స్థానికంగా కొందరు డిడిలు ఇచ్చిన వెంటనే ఎస్టీమేషన్ చార్జీలు చెల్లించకుండా ప్రోసిడింగ్స్ లేకుండా కొళాయి కనెక్షన్‌లు వేసుకోవడం జరిగిందన్నారు. అయితే డిడిలు చెల్లించిన తేదీ నుండి ఆయా వినియోగదారులకు నీటిపన్ను విధించడం జరుగుతుందని చెప్పారు. త్వరలోనే పూర్తిస్థాయిలో కొళాయి కనెక్షన్‌లను ఆన్‌లైన్ చేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు.

శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
హిందూపురం టౌన్, జనవరి 10: గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి వహించాలని పెనుకొండ డిఎస్పీ కోలార్‌కృష్ణ పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల ఏడాది కావడంతో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలతోపాటు సాధారణ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గురువారం స్థానిక వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఆవరణలో పెనుకొండ సబ్ డివిజన్ నేర సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో హిందూపురం వన్‌టౌన్, టూటౌన్, రూరల్, పెనుకొండ, మడకశిర సిఐలు బి.శ్రీనివాసులు, ఇదుర్‌భాషా, వేణుగోపాల్, రామకృష్ణ, హరినాథ్‌లతోపాటు సబ్ డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్‌లకు చెందిన ఎస్సైలు పాల్గొన్నారు. తొలుత డిఎస్పీ ఆయా స్టేషన్‌ల పరిధిలో ఇప్పటి వరకు నమోదైన, పరిష్కరించిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా శాంతిభద్రతలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానిత వ్యక్తుల కదలికలు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం డిఎస్పీ పాత్రికేయులతో మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సబ్ డివిజన్ పరిధిలో నేరాల శాతం బాగా తగ్గిందన్నారు. పోలీసులు ప్రజలతో మమేకం కావడంవల్ల ఇలాంటి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. ఇకపోతే సబ్ డివిజన్ పరిధిలో జరిగిన దొంగతనాలకు సంబంధించి 89 శాతం రికవరీ సాధించినట్లు చెప్పారు. చోరీ కేసుల సొత్తు రికవరీ పెనుకొండ సబ్ డివిజన్ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. ఈ ఏడాది మట్కా, గ్యాంబింగ్, లైసెన్స్‌లు లేకుండా వాహనాల్లో నడపడం వంటి వాటి ద్వారా రూ.61 లక్షల వసూలు చేయడం జరిగిందన్నారు. గత ఏడాదితో పోల్చితే రోడ్డు ప్రమాదాలు, ఘర్షణ కేసులు కూడా తగ్గాయన్నారు. రోడ్డు ప్రమాదాలు జాతీయ రహదారుల్లో తగ్గుముఖం పట్టగా రాష్ట్ర రహదారుల్లో ఒకింత అధికమయినట్లు తెలిపారు. వీటిని అరికట్టడానికి ఆటోల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నట్లు డిఎస్పీ చెప్పారు. అయితే సబ్ డివిజన్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది హత్యల శాతం పెరిగిందన్నారు. గత ఏడాది 23 హత్యలు జరగ్గా ఈ ఏడాది 25 జరిగాయన్నారు. అక్రమ సంబంధాలు, ఆస్తి తగాదాల కారణంగా హత్యలు చోటు చేసుకొన్నట్లు తెలిపారు. వివిధ స్టేషన్ పరిధిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న చాలా కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. మరో 179 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని ఈ నెలాఖరు లోపు పరిష్కరించాలని సిఐలు, ఎస్సైలను ఆదేశించినట్లు తెలిపారు. మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సత్వర న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించారు.
నలుగురు ఎస్‌ఐలకు చార్జ్జి మెమోలు
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు ఎస్సైలు, ఆరుగురు కానిస్టేబుళ్లకు డిఎస్పీ చార్జీ మెమోలు జారీ చేసినట్లు సమాచారం. కేసుల నమోదు, పురోగతి సాధించడంలో ఆయా ఎస్సైలు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంగా చార్జీమెమోలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా పోలీసుస్టేషన్‌లోనే సిబ్బంది ఒకరినొకరు దూషించుకోవడం, వాగ్వివాదానికి దిగడం వంటి సంఘటనలపై ఆరుగురు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు తీసుకొన్నట్లు సమాచారం.

అనంతపురంలో రైల్వేగేట్ మూసివేయద్దు
గుంతకల్లు, జనవరి 10 : అనంతపురంలోని టిటిడి కల్యాణ మండపం, రామచంద్ర నగర్ వద్దగల గేట్ నెంబర్ 128ఎ రైల్వే గేట్‌ను మూసివేయకూడదని జిల్లా నేతలు గురువారం డిఆర్‌ఎంకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు ఎంవి రమణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ రషీద్‌ఆహ్మద్, టిడిపి నాయకులు సరిపూటి రమణ, నారాయణస్వామి, సిపిఎం నాయకులు ఆర్‌వి నాయుడు, వలి, స్థానిక సిపిఐ నాయకులు గోవిందు, అబ్ధుల్ వాహబ్, వీరభద్ర స్వామి, దేవేంద్ర, ఓపిడిఆర్ నాయకులు సురేష్, లోక్‌సత్తా పార్టీ నాయకులు నాగరాజు, ఇస్మాయిల్, బిఎస్పీ నాయకులు నాగరాజు, ఎస్‌యుసిఐ నాయకులు రాఘవేంద్ర, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు జాన్సన్‌బాబులు గురువారం గుంతకల్లు రైల్వే డివిజనల మేనేజర్ తేజేంధర్ పాల్ సింగ్‌ను కలసి వినతి పత్రాన్ని అందచేశారు. ప్రస్తుతం పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు వెళ్లే మార్గంలో వున్న గేట్‌ను ప్రమాదాల నియంత్రణ పేరుతో మూసివేయడం సరైంది కాదని, దీనివల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వారు వివరించారు.

12న వివేకానంద జయంతి
శోభాయాత్రను విజయవంతం చేద్దాం
అనంతపురం కల్చరల్, జనవరి 10: స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా నగరంలో శనివారం సాయిబాబా జాతీయ కళాశాల నుండి నిర్వహించే శోభా యాత్రలో వేలాదిగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు, జెఎన్‌టియు రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ గొప్పదనం గురించి ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని ఆయన పేర్కొన్నారు. ఈ దేశం యొక్క గొప్ప గుణగణాలతోపాటు, మనలోని లోపాలను సైతం పేర్కొని వాటిని తొలగించుకుని దేశ పునర్వైభవం కొరకు ఏ విధంగా పనిచేయాలో యువతకు బోధించిన మహాపురుషుడన్నారు. యువతలో దేశ భక్తి భావాలను మేల్కొల్పిన కారణంగా భారత ప్రభుత్వం వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. దేశ పురోభివృద్ధికి స్వామి భావాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో ఏడాదిపాటు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో నిర్వహిస్తున్న శోభా యాత్ర ఉదయం సాయిబాబా జాతీయ కళాశాల నుండి ప్రారంభించి టవర్‌క్లాక్ వద్ద ఉన్న వివేకానంద విగ్రహం వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు ప్రజా ప్రతినిధులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, ప్రజలు పాల్గొంటారన్నారు. ముఖ్యంగా యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి యస్.శ్రీనివాసులు సంవత్సరం పొడవునా నిర్వహించే కార్యక్రమాల గురించి వివరించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోను ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆలూరు రాఘవేంద్ర, విశే్వశ్వరరెడ్డి పాల్గొన్నారు.

కఠినమైన చట్టాలతో అత్యాచారాలకు అడ్డుకట్ట
గుత్తి, జనవరి 10: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి కఠినమైన చట్టాలు అమలు చేయడంతో పాటు మహిళల పట్ల సరైన గౌరవాన్ని కల్పించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే అత్యాచారాలు అరికట్టవచ్చునని వక్తలు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని నిజామీ షాదీఖానాలో జరిగిన చర్చావేదికలో పాల్గొన్న వక్తలు అభిప్రాయ పడ్డారు. గుత్తి పట్టణానికి చెందిన జెవివి ఆధ్వర్యంలో ఇంకెన్నాలీ ఈ ఆత్యాచారాలుపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గుత్తి ఆరవ ఫాస్ట్ ట్రాక్ అదనపు జడ్జీ గుర్రప్పనాయుడు, గుంతకల్లు తాడిపత్రి డిఎస్పీ సుప్రజ, అరవిందబాబు, డాక్టర్ బ్రహ్మరెడ్డి, గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ పద్మావతమ్మలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం అత్యాచారాలపై కఠినంగా చర్యలు తీసుకోకపోవడం వల్లనే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. సమాజంలో మహిళల పట్ల సరైన గౌరవాన్ని కల్పించడంతో పాటు మానవ సంబంధాలను పెంపొందించడం ద్వారా అత్యాచారాలను అరికట్టవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రైచల్, జెవివి జిల్లా అధ్యక్షులు రంగన్న, ఇస్మాయిల్, వైకాపా నాయకురాలు శిరీష తదితరులు పాల్గొన్నారు.

మాజీ కార్పొరేటర్ రామకృష్ణారెడ్డి హత్య కేసు ఛేదింపు
అనంతపురం సిటీ, జనవరి 10: జిల్లా కేంద్రంలో వారం రోజుల కిందట జరిగిన మాజీ కార్పొరేటర్ రామకృష్ణారెడ్డి హత్య కేసును మూడవ, రెండవ పట్టణ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసు అరెస్టు చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు గురువారం అనంతపురం డియస్పీ దయానందరెడ్డి విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో జనశక్తి నగర్ దూదేకుల వన్నూర్‌వలీ(27), దూదేకుల షేక్షావలి (21), కంబదూరు మండలం నూతిమడుగు గ్రామం దూదేకుల బాబు(29), ఉరవకొండ మండలం వై రాంపురం దూదేకుల ఎర్రిస్వామి (20), అనంతపురం ఆరవ రోడ్డు ఇ. ఆదినారాయణ (26)లను అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

నేడు ఆహార
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>