Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రైల్వే చార్జీల పెంపుపై నిరసన వెల్లువ

$
0
0

కడప, జనవరి 10 : ఇప్పటికే విద్యుత్, గ్యాస్, డీజల్, పెట్రోల్, నిత్యావసర వస్తువులపై ధరల పెంపుతో అల్లాడుతున్న ప్రజానీకానికి తాజాగా రైలు చార్జీలు పెంచడంతో ఇక సామాన్యులు రైలు కూత మరవనవున్నారు. ఒక వేళ రైల్లో ప్రయాణిస్తే చార్జీల వాత తప్పదు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టక మునుపే చార్జీల మోతపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం చార్జీల పెంపు కిలో మీటరుకు ప్రయాణించే తరగతిని బట్టి 2 పైసల నుంచి 10 పైసల వరకు భారం పడనుంది. అలాగే సీజనల్ టిక్కెట్ల రేట్లు కూడా పెంచడంతో విద్యార్థులు, ఉద్యోగగులు రైళ్లలో ప్రయాణించలేమని వాపోతున్నారు. కడప కేంద్రంగా తిరుపతి, చెన్నై, గుంతకల్లు, ముంబయి, షిరిడీ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులపై ఏటా రూ. 2 కోట్ల పైబడే భారం పడనుంది. అలాగే ఫ్యాసింజర్ రైళ్లు, ఇంటర్‌సిటీ రైళ్లకు రూపాయి నుంచి 5 రూపాయల వరకు వడ్డించింది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే స్లీపర్ కోచ్‌లోనే రూ. 35 రూపాయల నుంచి రూ. 50 రూపాయల వరకు ప్రయాణికుపై మోత పడుతుంది. ఇక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఎసిల్లో రూ. 50 నుంచి రూ. 70 పైబడే భారం పడనుంది. మొత్తం మీద రైలు ఛార్జిల పెంపుతో రైళ్లు ఎక్కలేమంటూ ప్రయాణికులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

రైతులను ఆదుకోవడంలో
ప్రభుత్వం ముందంజ
* ఎమ్మెల్యే వీరశివారెడ్డి
చింతకొమ్మదినె్న, జనవరి 10 : రైతులను ఆదుకోవడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ముందంజలో ఉందని అందులో భాగంగానే ఎన్నో సంస్కరణలను చేపట్టారని కమలాపురం ఎమ్మెల్యే జి. వీరశివారెడ్డి పేర్కొన్నారు. గురువారం చింతకొమ్మదినె్న మండలం కమ్మవారి పంచాయతీ గోర్లపల్లె గ్రామంలో 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి అహ్మదుల్లా, ఎమ్మెల్యే వీరశివారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు, రైతు కూలీలకు కోసం అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే విద్యుత్‌లో లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా తన నియోజక వర్గంలో అడిగిన తక్షణం నిధులను కేటాయించారన్నారు. గోర్లపల్లె విద్యుత్ ఉప కేంద్రానికి కోటీ, 20 లక్షలు మంజూరు చేయడంతో 6నెలల లోపల విద్యుత్ ఉప కేంద్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. దీంతో సుమారు 15 గ్రామాలకు లో ఓల్టేజీ సమస్య తీరనుందని తెలిపారు. అదే విధంగా వ్యవసాయ కూలీలకు 120 రోజులు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని కల్పించడమే కాకుండా 121 రూపాయి కూలీ నిర్ణయించాడన్నారు. అలాగే పేదలకు కిలో రూపాయి బియ్యం పథకం ప్రవేశపెట్టాడని గర్భిణులకు అమృత హస్తం పేరిట ఉచితంగా భోజన వసతి కల్పించారన్నారు. నిరుద్యోగులకు రాజీవ్ యువకిరణాల పథకం కింద లక్ష ఉద్యోగాలు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు కె. సంతోషరావు, ఆపరేషన్ డిఇ సురేష్, కృష్ణారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రామకోటిరెడ్డి, మండల తహశీల్దార్ రవిశంకర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు కళాయాదవ్, ఎంపిటిసిలు వెంకట్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

44 మండలాల్లో కరవు
* మరోసారి సర్వే చేయనున్న అధికారులు
* 51200 హెక్టార్లలో పంట నష్టం
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 10 : గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలోని 51 మండలాల్లో పంటలు సాగు చేయగా, 44 మండలాల్లో పంట నష్టం కలిగిందని జిల్లా అధికారులు ప్రభుత్వానికి సిఫారస్సు చేసిన దరిమిలా అన్ని మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించింది. అయితే రాజంపేట, రైల్వేకోడూరు, ఓబుళవారిపల్లె, కలసపాడు, అట్లూరు, బద్వేలు, గోపవరం మండలాల్లో ఎక్కువ పంటల నష్టం వాటిళ్లలేదని జిల్లా అధికారులు, ప్రభుత్వం తీర్మానించింది. తొలుత జిల్లా ఉన్నతాధికారులు 28 మండలాలను, తరువాత మిగిలిన మండలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ మండలాల్లో 51200 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని, నష్టపోయిన పంటలకు హెక్టార్‌కు 6 వేల రూపాయల చొప్పున రూ. 32 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అయితే ఈమధ్య జరిగిన డిఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎం.మహీధర్‌రెడ్డి, జిల్లా మంత్రులు డీఎల్. రవీంద్రారెడ్డి, ఎస్‌ఎండి. అహ్మదుల్లా, సి. రామచంద్రయ్య సైతం వర్షాభావంతో పంటల నష్టంతో పాటు కరెంట్ కోత ప్రభావం వల్ల జిల్లా మొత్తాన్ని కరవు ప్రాంతంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల మేరకు 7 మండలాల్లో వర్షాపాతం అధికంగా నమోదు అయినందున అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించేందుకు వీలు పడలేదు. ఇందులో భాగంగా కలెక్టర్ వి. అనిల్‌కుమార్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జోనాథన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సంబంధిత అధికారులను వ్యవసాయ పొలాలకు పంపి క్షేత్ర స్థాయిలో సర్వే చేయించారు. వారి సర్వే ప్రకారం 44 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారు. అయితే విప్పత్తు నిర్వాహణ విభాగం కమిషనర్ వారు వర్షపాతం, పంట సాగు, పంట దిగుబడి ఒకే సీజన్‌లో వరుసగా 21 రోజుల వర్షాపాతం నమోదు కాకపోవడంపై సర్వే చేయించారు. ఈ మేరకు జిల్లాలోని 7 మండలాలు కరవు మండలాలుగా గుర్తించలేకపోయారు. ప్రస్తుతం మరో వారం రోజుల్లో రైతులు, సర్వే నెంబర్ల వారీగా పంట నష్టం వివరాలు నమోదు చేసి పంట నష్టంపై తిరిగి మదింపువేసి నష్టపోయిన పంటల వివరాలను పంపాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిల్లా వ్యవసాయ శాఖ నేతృత్వంలో ఉద్యానవనం, పట్టుపరిశ్రమ తదితర శాఖ అధికార సిబ్బంది కరవు బాధిత జాబితాలను ఆన్‌లైన్‌లో భద్ర పరచాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే డిసెంబర్ 31 లోపే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న మండలాలు, గ్రామాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించడంతో పాటు వివిధ బ్యాంకుల్లో పంట సాగు చేసిన రైతుల పేరిట అకౌంట్లు కూడా తెరిపించారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ, మండల, నియోజక వర్గ, జిల్లా స్థాయిలోని వ్యవసాయాధికారులు మరోమారు రైతుల జాబితాలను పంట నష్టాల వివరాలను పరిశీలించడానికి సమాయత్తమవుతున్నారు.

చేతకాకపోతే తప్పుకోవాలి
* సర్కార్‌కు సిపిఐ జిల్లా కార్యదర్శి సూచన
కడప (రూరల్), జనవరి 10 : ఇబ్బడి ముబ్బడిగా ప్రజలపై భారాలు పడకుండా పాలించడం చేతకాకపోతే కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతల నుండి తప్పుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య సూచించారు. గురువారం స్థానిక ఏడు రోడ్ల కూడలిలో సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేసిన ప్రజా బ్యాలెట్, సంతకాల సేకరణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు ఎన్నికల ముందు ఎలాంటి భారాలు మొపమని గద్దె ఎక్కిన అనంతరం ఎన్నికల వాగ్ధానాలకు తిలోదకాలు ఇచ్చి ఎడాపెడా చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతోందని విమర్శించారు. మరోవైపు విద్యుత్ ఉత్పత్తికి వనరులను సక్రమంగా వినియోగించుకుని ప్రజలకు కావాల్సినంత విద్యుత్‌ను కారు చౌకగా అందించవచ్చన్నారు. అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అనే్వషించాల్సిన సర్కార్ పెట్టుబడి దారుల బూట్లు నాకుతోందని ధ్వజమెత్తారు. ఒక్క విద్యుత్ చార్జీల పెంపు ప్రభావం రవాణా, నిత్యావసర వస్తువుల ధరలు, ఉత్పాదక రంగాలపై పడి ప్రజల జీవనం కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు, డీజల్, గ్యాస్, కిరోసిన్, నేడు రైల్వే చార్జీల భారం అధికమైందన్నారు. వీటిపై ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. వీరికి వ్యక్తిగత ఆదాయంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదన్నారు. ఇది ఇలాగే కొనసాగితే టిడిపికి పట్టిన గతే పడుతుందని జోస్యం చెప్పారు. అంతేగాకుండా కిరణ్ సర్కార్‌ను ప్రజా కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఈనెల 22న చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఆందోళనలో జరిగే సంఘటనలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి. చంద్ర, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి. రామసుబ్బారెడ్డి, ఎఐటియుసి నాయకులు రాము, నాగేశ్వరమ్మ, ప్రభాకర్, వాసు, బిసి యూనైటెడ్ ఫ్రెంట్ ఎ. మల్లికార్జున, రమణ, సిండే, మాల మహానాడు నరసింహులు, సామాజిక కార్యకర్త ఐలయ్య, సిపిఐ బోగాది శెట్టి, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

పల్స్ పోలియోను విజయవంతం చేయండి
* కలెక్టర్ అనిల్‌కుమార్
కడప జనవరి 10 : జిల్లాలో ఈనెల 20వ తేదీన జరిగే మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కలెక్టర్ వి అనిల్‌కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో పల్స్ పోలియో కార్యక్రమంపై డాక్టర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ అనిల్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా పోలియో కేసు లేదని అదే స్ఫూర్తితో అందరూ బాధ్యతయుతంగా పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. మొదటి విడతగా ఈనెల 20న, రెండవ విడత ఫిబ్రవరి 24న పోలియో కార్యక్రమాలు ఉంటాయన్నారు. అలాగే 74 మొబైల్ వాహనాల ద్వారా ప్రతి పిహెచ్‌సి ప్రాంతాలలో పర్యటించి పోలియో నిర్వహిస్తారన్నారు. కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, రాజంపేట పట్టణాల పరిధిలో వలసలు వచ్చి గుండారాలు చేసుకుంటారని అక్కడకు వెళ్లి పోలియో చుక్కలు వేయాలని సూచించారు. ముందస్తుగా డాక్టర్లు వారి పరిధిలోని గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లో పోలియో చుక్కలు కేంద్రాలను ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయాలన్నారు. ఈ సమావేశంలో రీజినల్ డైరెక్టర్ మాట్లాడుతూ 2 విడతల పల్స్ పోలియో కార్యక్రమంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందస్తుగా ప్రణాళికలలు సిద్ధం చేసుకోవాలన్నారు. కొత్తగా కొన్ని పిహెచ్‌ల డాక్టర్లు వచ్చారని వారందరు బాధ్యతయుతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ ప్రతినిధి డాక్టర్ నాగరాజు, సర్వేపిల్స్ మెడికల్ ప్రతినిధి సుధీర్‌నాయక్, పిహెచ్‌సిల డాక్టర్లు పాల్గొన్నారు.
మహిళలకు ప్రత్యేక చట్టం కావాలి
* ఎమ్మెల్యే కమలమ్మ
పోరుమామిళ్ళ, జనవరి 10: మహిళల ఆత్మరక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాలని బద్వేల్ ఎమ్మెల్యే కమలమ్మ పేర్కొన్నారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఐసిడియస్, అంగన్‌వాడీ, వెలుగు, గ్రూపు సంఘాల మహిళలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిధిగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆత్మరక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పడాలని మహిళలు తాము కాపాడుకునేందుకు కరాటే, తదితర విద్యల్లో శిక్షణ పొందాలని అప్పుడే తమ ఆత్మరక్షణ కాపాడుకున్నవారతారన్నారు. ఢిల్లీలో జరిగిన మహిళపై అత్యాచారం దారుణమని, ఇటువంటి చర్యలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేసి మహిళలు స్వేచ్ఛగా ఉండేందుకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. అక్కడ నుంచి మహిళలు ర్యాలీని ఎమ్మెల్యే కమలమ్మ ప్రారంభించగా. ఆర్టీసీ బస్టాండ్ వద్ద మానవహారం నిలబడి నినాదాలు చేశారు.

పన్నుల వసూళ్లలో లక్ష్యాలు అధిగమించాలి
* ఇన్‌చార్జి డిపిఓ అపూర్వ సుందరి
రాజంపేట, జనవరి 10 : పంచాయతీల పన్నుల వసూళ్లు చేయడంలో సిబ్బంది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని జిల్లా పంచాయతీ అధికారి అపూర్వ సుందరి ఆదేశించారు. గురువారం స్థానిక మండల సభాభవనంలో డివిజన్‌లోని పంచాయతీ అధికారులతో డిఎల్‌పిఓ దివాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి వౌలిక వసతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అపూర్వ సుందరి మాట్లాడుతూ ఆస్తిపన్ను, ఇంటిపన్ను వసూలు చేయడంలో సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. డివిజన్‌లోని మేజర్ పంచాయతీలైన రైల్వేకోడూరు, పోరుమామిళ్ల, నాగిరెడ్డిపల్లె, తాళ్ళపాకలలో 20శాతం పన్నులు వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలకు జమ చేశారన్నారు. ఆ నివేదికలను రాజంపేట డిఎల్‌పిఓ కార్యాలయానికి అందజేయాలన్నారు. ఫిబ్రవరి నెల నుండి రోజూ ఎంతమేర పన్నులు వసూలు చేశారో నివేదికలతో ఉండాలన్నారు. పన్నులు వసూలు చేయడంలో సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సహాయ సహకారాలు కూడా తీసుకోవాలన్నారు. గ్రామాల్లో దండోరా వేయించి గ్రామచావిడి, రచ్చబండలను వేదికగా చేసుకొని ప్రజల్లో పన్నుల వసూళ్లపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ పన్నులు చెల్లించని బకాయిదారులపై డిమాండ్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ పంచాయతీల్లో సుమారు రూ.1.5 కోట్లు పన్నులు వసూలు చేయాలని లక్ష్యం కాగా ఇప్పటికి 30శాతం వసూళ్ళు మాత్రమే చేశారన్నారు. జిల్లా రాబడికి మొదటి స్థానం రెవిన్యూకు, 2వ స్థానం పంచాయతీ శాఖకు దక్కిందన్నారు. జిల్లా కలెక్టర్ పంచాయతీ శాఖపై పన్నుల వసూలు చేయడంలో సిబ్బంది అప్రమత్తం చేయాలని ఆదేశించి ఉన్నట్టు చెప్పారు. మార్చి నెలాఖారులోపు నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించేందుకు ప్రతి ఒకరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఇఓ పిఆర్‌డిలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యా వసతి గృహాల ఆకస్మిక తనిఖీ
ముద్దనూరు, జనవరి 10: మండల కేంద్రంలోని విద్యాలయాలను వసతి గృహాలను ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. మొదటిగా వివేకవర్ధిని జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ఆయన ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలను గురించి తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. అలాగే బాలుర పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల వౌలిక వసతుల కల్పనపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. బాలుర వసతి గృహం -1లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించికొత్త మెనుప్రకారం భోజనాలు వసతి కల్పిస్తున్నారా లేదా అని వార్డెన్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే పలువురు ఉపాధ్యాయులు, బాల బాలికల పాఠశాలల ప్రహారీగోడలు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కొన్ని పాఠశాలలో స్వీపర్లు, నైట్ వాచ్‌మెన్లు లేరని విలువైన కంప్యూటర్ సామాగ్రి ఉండడంతో సమస్యతలెత్తెప్రమాదం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు జివో-1 అమలు చేస్తూ హెల్త్ కార్డుల అవకాశం కల్పించాలని ఉపాధ్యాయులు ఆయనను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు పాఠశాల వౌలిక వసతుల కల్పన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సురేష్, రామాంజినేయులు, లెక్చరర్ పుల్లారెడ్డి, ఉపాధ్యాయులు నారాయణరెడ్డి, వసతి గృహాల వార్డెన్‌లుతదితరులు పాల్గొన్నారు.
మొదలైన ‘సహకార’ ప్రచారం
సంబేపల్లె, జనవరి 10 : దేవపట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి జరిగే ఎన్నికలకు గురువారం నుంచి ప్రచారం ప్రారంభించారు. పోటీలో ఉన్న మల్లు నర్సారెడ్డి ప్రచారాన్ని రౌతుకుంట గ్రామం పోతువాండ్లపల్లెలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి రైతు ఓటర్లు తమకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. నర్సారెడ్డి డిసిసిబి చైర్మెన్ పదవి రేసులో ఉండడంతో ముందుగానే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మల్లు విష్థువర్థన్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, అక్కుల్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
* మరో నలుగురు విద్యార్థినులకు తీవ్ర గాయాలు
చింతకొమ్మదినె్న, జనవరి 10 : కడప - రాయచోటి రహదారి ఊటుకూరు ఆర్టీవో కార్యాలయం ఎదురుగా గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప నబీ కోటకు చెందిన విద్యార్థి సయ్యద్ తలహా (14) మృతి చెందాడు. మరో నలుగురు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. చింతకొమ్మదినె్న పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నుండి చింతకొమ్మదినె్న మండలం కొలుములపల్లె వద్ద ఉన్న ఆల్‌మనార్ హైస్కూల్‌కు విద్యార్థులు ఆటోలో పోతుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి నిలబడి ఉన్న లారీని ఆటో ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న విద్యార్థి సయ్యద్ తలహా, విద్యార్థినీలు పొదియా, సుమయా, ఆఫీన్, అమీరున్నీసాలకు గాయాలయ్యా యి. ఇది గమనించిన వాహన చోదకులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రిమ్స్‌కు 108 వాహనంలో తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందినట్లు తెలిపారు. విద్యార్థి మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరసింహారెడ్డి తెలిపారు.

122 బస్తాల అక్రమ బియ్యం పట్టివేత
మైలవరం, జనవరి 10: మైలవరంలో అక్రమంగా చౌకదుకాణం బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం దాడి చేసి పట్టుకున్నారు. గ్రామస్థులకు ఆర్డీఓకు ఇచ్చిన సమాచారం మేరకు ఆర్డీఓ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ తిరుపతయ్య, మండల తహశీల్దార్ చౌడప్ప కలిసి నాగశేషయ్య (చిన్నన్న) ఇంటిలో పట్టుకున్నారు. ఈ బియ్యానికి ఎలాంటి రషీదులు, లైసెన్స్‌లు లేకపోవడంతో వీటిపై అనుమానంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇవి చౌకదుకాణం బియ్యం అవునా కాదా అని కడపకు పరిశోధన నిమిత్తం పంపడం జరిగిందన్నారు. చౌకదుకాణ బియ్యం అని తేలితే వారిపైకఠిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ బియ్యంలో అన్ని రకాలు కలిసి అమ్ముతున్నారని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.

ఇప్పటికే విద్యుత్,
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>