Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు

$
0
0

విజయనగరం(కంటోనె్మంట్) జనవరి 10 : ఈవ్‌టీజింగుకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ఈవ్‌టీజింగ్‌ను నిరోదించేందుకు ముఖ్య కూడళ్లలోను, బస్టాపుల్లోను, కళాశాల ఆవరణలోను మఫ్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలపై కేసులు నమోదు చెయ్యడంద్వారా ఈవ్‌టీజింగ్‌ను నిరోదించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ కార్తికేయ తెలియజేసారు. ఈవ్‌టీజింగ్ గురించి సమాచారాన్ని తక్షణమే టోల్ ఫ్రీ నెం. 1090 (క్రైం స్టాపర్)కు గాని, 100కు గాని ఫోన్ చేయాలని ఈవ్‌టీజింగ్ వలన కలిగే నష్టాల గురించి జిల్లాలో ఉన్న కాలేజీయాజమాన్యలతో కలసి తెలియజేసారు.
31న సహకార ఎన్నికలు
భోగాపురం, జనవరి 10 : ఈనెల 31న మండల పొలిపిల్లి భోగాపుంరర సహకార సంఘా ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా దాన్కి సంబంధిత అధికార్లు నియామకం జరిగింది. భోగాపురం సొసైటీకి ఎన్నికలు అధికారిగా డెంకాడ పంచాయితీ అధికారి సాయినాధ కుమార్, పోలిపిల్లి సొసైటీకి నెల్లిమర్ల ఎంపిడిఓ సుధాకర్‌ని నియమించారు. అయితే ఈ ఎన్నికలలో భాగంగా ఓటుహక్కు కలిగిన రైతులు భోగాపుంర సొసైటీలో 869, పోలిపిల్లి సోసైటీలో 2237 మంది రైతలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఎన్నికల ప్రక్రియలో ఇది మొదటి ఎన్నికల ఘట్టం కావటం వల్ల వివిధ పార్టీల నాయకులు ఈఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రంగంలోనికి దిగుతున్నారు.

‘ఆర్టీసీ పరిరక్షణకు, కార్మికుల సంక్షేమానికి కృషి’
విజయనగరం (్ఫర్టు), జనవరి 10: ఆర్టీసీ పరిరక్షణ కోసం, కార్మికుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పద్మాకర్ తెలిపారు. గురువారం ఇక్కడ ఆర్.అండ్.బి.గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పద్మాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులకు ఎస్‌ఆర్‌బిఎస్ ద్వారా పింఛన్, సర్వీస్‌లో ఉండి చనిపోయిన ఉద్యోగులకు ఎస్‌బిటి ద్వారా ఎక్కువ మొత్తంలో క్యాష్‌బెనిఫిట్ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎస్‌ఆర్‌బిఎస్ ద్వారా ప్రస్తుతం రెండువేల రూపాయల పెన్షన్ వస్తుందని, ఎస్‌బిటి ద్వారా చనిపోయిన కుటుంబసభ్యులకు లక్షా 50వేల రూపాయల మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్‌గా ఇచ్చిన హామీ మేరకు ఎస్‌ఆర్‌బిఎస్ ద్వారా రిటైరైనవారికి అయిదువేల రూపాయలు, ఎస్‌బిటి ద్వారా అయిదులక్షల రూపాయల వరకు క్యాస్‌బెనిఫిట్‌ను ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాల వల్లే సంస్థ ఆర్థికంగా నష్టపోయిందని తెలిపారు. యూనియన్ నాయకులు బిఆర్‌కెరాజు, పలిశెట్టి దామోదరరావు, జోనల్ అధ్యక్షుడు పెదమజ్జి సత్యనారాయణ, రీజనల్ కార్యదర్శి పి.్భనుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
‘నంది నాటకోత్సవాలు ఘనంగా నిర్వహించాలి’
విజయనగరం(టౌన్), జనవరి 10 : నందినాటకోత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మోహనరావు తెలిపారు. నాటకోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లును చేయాలని సంబంధిత కమిమీలు వాటిని పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. గురువారం ఆయన సమావేమందిరంలో రంగస్థల వేదిక కమిటీ, ఆడిటోరియం కమిటీల సభుయలతో సమావేశం నిర్వహించారు. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా నాటక కళా సంస్థలు, సాంస్కృతిక, సాహితీ సంస్థలు కృషి చేయాలని తెలిపారు. అతిథులు సౌకర్యవంతంగా వీక్షించేలా ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చునేలా ఆడిటోరియం కమిటీ సభ్యులు చూడాలన్నారు. వేదికల వద్ద తాగునీరు పారిశుద్ధ్యాన్ని చూడాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. ప్రచారానికి అవసరమైన బ్యానర్లు, ఆటోలు సిద్ధం చేశామన్నారు. అందరూ ఆహ్వానితులేనని తెలిపారు. రంగస్థల వేదిక ఇన్‌చార్జి ఎపిఎంఐఫీ పిడి అశోక్, ఆడిటోరియం కమిటీ ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ గోవిందస్వామి, పాల్గొన్నారు.

పెంచిన ఛార్జీలు తగ్గించాలని రైల్‌రోకో
పార్వతీపురం, జనవరి 10: పెంచిన రైలు ఛార్జీలు తగ్గించాలని కోరుతూ గురువారం పార్వతీపురం రైల్వేస్టేషన్‌లో రైలు రోకో కార్యక్రమాన్ని సిపియం నాయకులు నిర్వహించారు. రాయగడ నుండి విశాఖ పట్నం వెళ్లే రైలును ఉదయం 11.15గంటల నుండి దాదాపు 20నిమిషాల పాటు పార్వతీపురం స్టేషన్‌లో నిలుపుదల చేశారు. సిపియం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి, పాకల సన్యాసిరావు, గొర్లి సన్యాసిరావు, ఎస్. ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఐ.ఎ.ఎస్‌లు
లేకుండానే పాలన!
ఆంధ్రభూమిబ్యూరో
విజయనగరం, జనవరి 10: కీలకమైన ఐ.ఎ.ఎస్ అధికారులు లేకుండానే జిల్లాలో కార్యకలాపాలు సాగుతున్నాయి. కలెక్టర్, సంయుక్త కలెక్టర్, అదనపు సంయుక్త కలెక్టర్లు లేకుండా తొలిసారిగా జిల్లా రెవెన్యూ అధికారి ఒక్కరే పాలనా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళారు. జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించి జాతీయ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో కలెక్టర్ వీరబ్రహ్మయ్య జిల్లా తరపున పాల్గొంటున్నారు. ఇక జిల్లా సంయుక్త కలెక్టర్ పి.ఎ.శోభ ఇప్పటికే సెలవులో ఉన్నారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఎం.రామారావుకు ఐ.ఎ.ఎస్ హోదా లభించింది. దీంతో ఆయన్ను వేరే జిల్లాకు ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం జిల్లా రెవెన్యూ అధికారి హేమసుందర వెంకటరావు పాలనా బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఐ.ఎ.ఎస్ అధికారి పర్యవేక్షణ లేకుండా జిల్లాలో కార్యక్రమాలు సాగడం ఇదే తొలిసారిగా యంత్రాంగం పేర్కొంటోంది. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకునే విషయంలో జాప్యం జరగుతున్నదనవచ్చు..

కొనసాగుతున్న
వికలాంగుల నిరసన
విజయనగరం (్ఫర్టు), జనవరి 10: వికలాంగుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు హెచ్చరించారు. గురువారం ఇక్కడ కలెక్టరేట్ ఎదుట వికలాంగులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ గత 9రోజుల నుంచి వికలాంగులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వంగాని, అధికార యంత్రాంగం కాని కనీసం పట్టించుకోవడంలేదన్నారు. వికలాంగులంటే అధికారులకు చులకనగా కనిపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇస్తున్న 500 రూపాయల పింఛన్ ఏమాత్రం చాలడంలేదన్నారు. దీనిని 1000 రూపాయలకు పెంచాలన్నారు. జిల్లాలో వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయాలన్నారు. వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం ఉత్తరాంధ్ర కన్వీనర్ జాగరపుశ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు మీసాల తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు రెవెన్యూ సిబ్బందిపై
చర్యలకు రంగం సిద్ధం?
మెరకముడిదాం, జనవరి 10: ఆరో విడత భూపంపిణీకి సంబంధించి ఇద్దరు సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల మెరకముడిదాంలో మంత్రి బొత్స సత్యనారయణ ఆరోవిడత భూపంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 80 మంది లభ్దిదారులుకు 137 ఎకరాల భూపంపిణీకి జిల్లా అధకారులు సమాయత్తమయ్యారు. ఈ మేరకు మండల రెవెన్యూ అధికారలను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వీరు పట్టాలను సిద్దం చేసారు. మంత్రి సమావేశంలో 10 పట్టాలను పంపిణీ చేసి విగిలిన వాటిని అధికారులును పంపిణీ చేయమని ఆదేశించి వెల్లిపోయారు. ఆ తరువాత జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుల ద్వారా మంత్రికి ఫిర్యాదు చేసారు. మంత్రి కలెక్టర్‌ను విచారణ జరపాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

‘గ్రామాల్లో పశువైద్యులు అందుబాటులో ఉండాలి’
విజయనగరం (్ఫర్టు), జనవరి 10: పశువైద్యానికి సంబంధించి ఎటువంటి మందుల కొరత లేదని పశువైద్యసంవర్థకశాఖ జాయింట్‌డైరెక్టర్ డాక్టర్ జె.ఎస్.ఎస్.ఎం.శ్రీ్ధర్‌కుమార్ అన్నారు. గురువారం ఇక్కడ కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశువైద్యానికి మందు కొరత లేనందున మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో రైతాంగానికి అందుబాటులో ఉండాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి మూడులక్షల మందులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 400 పశువైద్యశిబిరాలను నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇంతవరకు 250 శిబిరాలను నిర్వహించామన్నారు. మిగతా శిబిరాలను మార్చినెలాఖరులోగా నిర్వహించాలన్నారు. జిల్లాలో 165 మినీడెయిరీలను, 12 మిడియం డెయిరీలను ఏర్పాటుర చేయాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా 200 పశుక్రాంతి యూనిట్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామస్థాయిలో రైతాంగానికి అందుబాటులో ఉంటూ పాడిపరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధికంగా రైతాంగం పాడిపరిశ్రమపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు పశుసంవర్థకశాఖ అసిస్టెంట్‌డైరెక్టర్లు డాక్టర్ చందక నర్సింహులు, డాక్టర్ మురళీధర్, వెటర్నరీ పొలీ క్లినిక్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టన్ నర్సింహాలు పాల్గొన్నారు.

రైల్వే మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
విజయనగరం (కంటోనె్మంట్), జనవరి 10: పెంచిన రైలు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద రైల్వేశాఖ మంత్రి బన్సల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే రైల్వే చార్జీలను పెంచడం దారుణమన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు చౌకైనది రైల్వే ప్రయాణమని అన్నారు. పేదలకు అందుబాటులో ఉండే రైలు ఛార్జీలను పెంచడం అమానుషమైన చర్యని మండిపడ్డారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 18 సార్లు పెట్రో, డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డివిరిచిందని, రైలు చార్జీలను పెంచి ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు. ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి దారులకు రాయితీలు ఇచ్చే బదులు సామాన్య ప్రజలకు అవసరమైన వాటిపై బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తే బాగుంటుందన్నారు. గ్యాస్ సిలెండర్ ధరను 100 రూపాయలు పెంచి 9 సిలెండర్లను ఇచ్చేందుకు కేంద్రం సిద్ధపడ్డం సరైన చర్య కాదన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మలిచర్ల దుర్గారావు, రామచంద్రరావు, జగన్మోహన్, రమణమ్మ, ఆనంద్ తదిరులు పాల్గొన్నారు.

బ్లడ్ కాంపోనెంట్
యూనిట్ ప్రారంభం
విజయనగరం (కంటోనె్మంట్), జనవరి 10: వివిధ రకాల విష జ్వరాల కారకమైన వైరల్ వ్యాధి నిర్థారణ పరీక్షలకు సంబంధించిన బ్లడ్ కాంపోనెంట్ యూనిట్ కేంద్రాన్ని జిల్లా కేంద్రాసుపత్రిలో విజయనగరం పార్లమెంట్ సభ్యురాలు భొత్స ఝాన్లి లక్ష్మి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎం.పి ఝాన్సిలక్ష్మి మాట్లాడుతూ 50 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన ఈ వ్యాధి నిర్థారణ కేంద్రం జిల్లా వాసులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కొన్ని రకాల వైరల్ జ్వరాల నిర్థారణ పరీక్షల కోసం రోగులు విశాఖకు వెళ్ళాల్సి వచ్చేదని ఈ కేంద్రం ఏర్పాటుతో రోగులు ఇబ్బందులు తప్పాయని అభిప్రాయపడ్డారు. ఈ కేంద్రంతోపాటు త్వరలో హెచ్.ఐ.వి ఎయిడ్స్‌కు సంబంధించిన అధునాతన కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడామని చెప్పారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ సహకారంతో ఈ ఆసుపత్రిని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇక్కడ్నుంచి రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్ళే అవసరం కల్గకుండా అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఈ ఆసుపత్రిలో డయాలిసిస్, స్కానింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజారోగ్య రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లా కేంద్రాసుపత్రి అధునాతన రీతిలో రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ కార్యక్రమలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీతారామారాజు, ఆసుపత్రిల సమన్వయ డాక్టర్ బి.విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రి రక్తనిధి కేంద్రం అధికారి డాక్టర్ సత్యశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
‘ఎన్నికల హామీలను అమలు చేస్తాం’
విజయనగరం (్ఫర్టు), జనవరి 10: ఆర్టీసీ కార్మికులకు గతనెలలో జరిగిన గుర్తింపుసంఘం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. గురువారం సాయంత్రం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ అధ్యక్షుడు బొత్స గౌరు అధ్యక్షతన విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా పద్మాకర్ మాట్లాడుతూ రెండేళ్ల గుర్తింపుకాల పరిధిలో హామీలను అమలు చేసి కార్మికుల గుండెల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంటామన్నారు. ఎన్‌ఎంయు గుర్తింపుకాలంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఆ యూనియన్ నాయకుల అవసరాల కోసం కార్మికులను తాకట్టుపెట్టి కార్మికులపై తీవ్రమైన పనిభారం పెంచారన్నారు. 2001లో ఎంప్లాయిస్ యూనియన్ గుర్తింపుకాలంలో ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతభత్యాలు పెంచినప్పటికీ, 2005, 2009 సంవత్సరాల ఎన్‌ఎంయు గుర్తింపుకాలంలో జరిగిన వేతనాల ఒప్పందంలో ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే 19శాతం జీతాలు తక్కువగా పెంచి తీరని అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ఈ నష్టాన్ని భర్తీ చేస్తూ ఈ ఏడాదిలో ఆర్టీసీ కార్మికులకు జరగాల్సిన పేస్కేల్‌లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంచేందుకు కృషి చేస్తామని పద్మాకర్ హామీ ఇచ్చారు. ఆర్టీసీ రెగ్యులర్ ఖాళీ పోస్టులోనే భర్తీ అయి 240 రోజుల సర్వీసు పూర్తయిన కాంట్రాక్ట్ కండక్టర్లు, డ్రైవర్లు రాష్టవ్య్రాప్తంగా 17వేల మంది ఉన్నారని, వీరందరిని చట్ట ప్రకారం వెంటనే భర్తీ చేయకపోతే ఈనెల 24వ తేదీన రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లా కార్మికశాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, జోనల్ అధ్యక్షుడు పెదమజ్జి సత్యనారాయణ, రీజనల్ కార్యదర్శి పి.్భనుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ కోత.. వినియోగదారులు బెంబేలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, జనవరి 10: ఒకపక్క ఛార్జీలు మోత మోగిస్తున్నా, సరఫరా విషయంలో కూడా విద్యుత్ అధికారులు వినియోగదార్లను వదలట్లేదు. సర్ ఛార్జీల పేరిట బిల్లుకు రెట్టింపు చెల్లిస్తున్న వినియోగదారులు ఇప్పుడు కరెంటును వాడకుండానే గుండెలు చేత్తో పట్టుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు వినియోగదార్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వేళా పాళా లేకుండా ఇఎల్‌ఆర్ (ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్) పేరిట పంపిణీ సంస్థలు కోతలను అమలు చేస్తున్నాయని వినియోగదార్లు వాపోతున్నారు. జిల్లా కేంద్రాల్లో రోజుకు గంట, మున్సిపాలిటీల పరిధిలో రెండు గంటలు, మండల కేంద్రాల్లో నాలుగు గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది గంటల పాటు అధికారికంగానే విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. ఇక ఇఎల్‌ఆర్ పేరిట సాగుతున్న సరఫరా నిలిపివేతకు సమయపాలన లేనేలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇఎల్‌ఆర్ కోతలు వినియోగదార్లను వేధిస్తున్నాయి. రాత్రి వేళల్లో కోతలు లేవని చెప్తున్న అధికారులు ఇఎల్‌ఆర్ పేరిట అర్ధరాత్రి సమయంలో సరఫరాను నిలిపివేస్తున్నారు.
జిల్లాలో గృహ, వాణిజ్య అవసరాలకు రోజుకు 3900 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పెద్దగా విద్యుత్ వినియోగం జరగట్లేదు. అయితే జిల్లాకు రోజుకు 3500 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. సుమారు 400 మిలియన్ యూనిట్ల వ్యత్యాసం మాత్రమే ఉన్నప్పటికీ సరఫరాలో మాత్రం కోతలు తప్పట్లేదు. ఇఎల్‌ఆర్ పేరిట కోతలపై విద్యుత్ పంపిణీ సంస్థల ఉన్నతాధికారుల సమాధానం వేరే విధంగా ఉంది. విద్యుత్ సరఫరా విషయంలో అంతా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే జరుగుతుందని పేర్కొంటున్నారు. పీక్ సమయంలో ఇఎల్‌ఆర్ పేరిట సరఫరాను నియంత్రించడం సాధారణమైన చర్యగా పేర్కొంటున్నారు. మొత్తం మీద అటు బిల్లులు, ఇటు కోతలతో వినియోగదార్లకు మాత్రం తిప్పలు తప్పట్లేదు.

* జిల్లా ఎస్పీ కార్తికేయ
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>