ఇండస్ట్రీకి వచ్చి పది పనె్నండేళ్లు అవుతోంది కదా ఇంకా ఎంతకాలం నటించటం. పెళ్లి చేసుకోవచ్చు కదా? అని త్రిషని అడిగితే - నేను పెళ్లికి రెడీ అంటోంది. సినిమాలు ఎలాగూ లేవు. కాబట్టి - అడిగిన వెంటనే జవాబిచ్చింది. ఇక్కడే ఉంది అసలు తిరకాసు. కథానాయిక కదా.. అలా వెంటనే ఒప్పేసుకుంటే అందులో మజా ఏముంటుంది? పెళ్లి అంటూ చేసుకుంటే ప్రేమించిన వాడితోనే అంటోంది. ఇంతకీ ఎవరే అతగాడు? అంటే మాత్రం తూచ్.. ఇంకా దొరకలేదంటోంది. ఆ ప్రేమికుడు ఎప్పటికి దొరుకుతాడో? అతణ్ణి ఎప్పుడు ప్రేమిస్తుందో? ఆ ప్రేమ పెళ్లికి ఎప్పుడు దారి తీస్తుందో? ఏతావతా ఇదంతా నెలల ప్రణాళిక. లేదా సంవత్సరాలు పట్టొచ్చు. ఈ వ్యవహారమంతా ఎప్పటికి పూర్తయ్యేట్టు? దీన్నిబట్టి అర్థమయ్యేది ఏమిటంటే - హీరోయిన్ పాత్రలపై ఇప్పటికీ ఆశ చావలేదని. కనుక - ఇప్పట్లో త్రిష పెళ్లి లేనట్టే?!
ఇండస్ట్రీకి
english title:
c
Date:
Sunday, January 13, 2013