Quantcast
Viewing all articles
Browse latest Browse all 69482

మా కష్టం మరచిపోయాం: రాజు

Image may be NSFW.
Clik here to view.

ఇద్దరు అగ్ర కథానాయకులతో సినిమాను నిర్మించి ప్రేక్షకుల ముందుకు పంపినప్పుడు వారు ఎలా దాన్ని స్వాగతిస్తారో తెలియని అయోమయంలో మొదట తామున్నామని, చిత్రం విడుదలయ్యాక అందరూ ప్రశంసిస్తుంటే ఆ కష్టం మరిచిపోయామని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నిర్మాత దిల్‌రాజు తెలిపారు. వెంకటేష్, మహేష్‌బాబు, అంజలి, సమంత ప్రధాన పాత్రధారులుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతకాంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అన్ని కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిత్ర విశేషాలు పంచుకోవడానికి నిర్మాత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిరోజు మార్నింగ్ షో అనంతరం అందరూ తనను ప్రశంసిస్తుంటే ఆనందంగా కళ్ల నీళ్లు తిరిగాయని, దర్శకుడు రాఘవేంద్రరావు కూడా మేము మరిచిపోయిన కథను నీవు తీసుకున్నావని చెప్పడం మరిచిపోలేని విషయమని ఆయన తెలిపారు. అభిమానులు కూడా వాళ్ల హీరోలు కాకుండా కేవలం పాత్రలే కనిపించాయని చెప్పడం ఆనందాన్ని ఇస్తోందనీ, కమర్షియల్ సినిమా తీసి విజయవంతం చేయడం పెద్ద విషయం కాదు కానీ ఇలాంటి చిత్రం తీసి హిట్ కొట్టడమే చాలా కష్టమైన ఫీట్ అని, అటువంటి విషయాన్ని ఈ చిత్రంతో మళ్లీ తాము నిరూపించినందుకు సంతోషంగా ఉందని ఆయన వివరించారు. మొదటి సగం యువతకు నచ్చితే, రెండవ సగం కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతోందని, వచ్చే వారంలో ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహిస్తామని, అలాగే 14, 15, 16 తేదీల్లో మహిళలకోసం ప్రత్యేకమైన ప్రదర్శనలు ఉండేలా తాము ప్రయత్నం చేస్తున్నామని, ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన వివరించారు.

ఇద్దరు
english title: 
c

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>