విశాఖపట్నం, జనవరి 12: సంక్రాంతి సీజన్ ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు కలొసిచ్చింది. అవసరమైనన్ని రైళ్ళు అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ శాతం మంది ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారు. అధిక చార్జీలైనా ఇళ్ళకు చేరుకోవాలని ఆతృతతో ఉద్యోగులు, విద్యార్థులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో గత నాలుగు రోజులుగా ఎన్ని బస్సులు వేసినా సరిపడని పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో విశాఖ-సికింద్రాబాద్ మధ్య 75 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. దీనివల్ల 20 లక్షలకు పైగా రోజుకీ ఆదాయాన్ని సంపాదిస్తుంది. రోజువారీ ఆదాయం దాదాపు రూ. 75 లక్షలు మేర వస్తుండగా, గత నాలుగు రోజులుగా ఇది కాస్త కోటి రూపాయలకు చేరుకుంటుంది. శనివారం ఇది కోటి రూపాయలకు చేరుకుందని సంబంధితాధికారి ఒకరు తెలిపారు. ఇవి కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖ నుంచి 250 బస్సులు నడుస్తున్నాయి. ఇవి కాకుండా ఎక్స్‌ప్రెస్‌లు, పాసింజర్ బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని వీటిని మరిన్ని పెంచేందుకు వీలుగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నెల 20వ తేదీ వరకు విశాఖ-సికింద్రాబాద్, విజయవాడ, ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి.
అదనపు మోత
తిరుగు ప్రయాణికులకు ఆర్టీసీ అదనంగా చార్జీలను మోపుతుంది. ఇళ్ళకు చేరుకుని తిరిగి వెళ్ళే వారందరి నుంచి కనీసం 50 శాతం మేర అదనపు చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. సాధారణంగా వంద రూపాయలు చార్జీలుంటే తిరుగు ప్రయాణికులు దీనికి అదనంగా మరో 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే వంద రూపాయలకు బదులుగా రూ. 150లు చార్జీలను చెల్లించాల్సిందే.
=
సంక్రాంతి సీజన్ ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు కలొసిచ్చింది. అవసరమైనన్ని రైళ్ళు అందుబాటులో
english title:
k
Date:
Sunday, January 13, 2013