విశాఖపట్నం, జనవరి 12: విశాఖ నగరంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శనివారం రాత్రి సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర చైర్మన్ ఆరేటి మహేష్ ఆధ్వర్యంలో ‘సమైక్య భోగి మంటలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది ప్రజల్లో కొత్త వెలుగులు ఇవ్వాలని, వేర్పాటువాదం సమైక్య భోగి మంటల్లో కలిసిపోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాష్ట్రం విభజన కాకుండా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సమైక్యంగా ఉండే విధంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి తెలుగువారి జీవితాల్లో సుఖ, సంతోషాలను భోగభాగ్యాలను, అష్టైశ్వర్యాలను నింపాలని ఆయన కాంక్షించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు వెళ్ళాలని, ఇది ఎప్పటికీ విడిపోకుండా సమెక్యంగానే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు సుమంత్, జాయింట్ కన్వీనర్ అవినాష్, పొటికల్ జెఎసి కన్వీనర్ జెటి రామారావు, బొబ్బాది అప్పారావు, చెక్కా రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
విశాఖ నగరంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శనివారం రాత్రి సమైక్యాంధ్ర విద్యార్థి
english title:
h
Date:
Sunday, January 13, 2013