విశాలాక్షినగర్, జనవరి 12: స్వామి వివేకానందుడు నేటి యువతకు ఆదర్శ ప్రాయుడని కలెక్టర్ వి.శేషాద్రి అన్నారు. శనివారం పౌర గ్రంథాలయంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ, నెహ్రూ యువ కేంద్రం, శ్రీ గాయత్రీ వెల్ఫేర్ అండ్ కల్చరల్ యూత్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో వివేకానందుని 150వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వామి వివేకానందుడు భారత దేశ కీర్తిని నలుది శలా వ్యాప్తి చేశారన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతావని ఐదువేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గలదని, ప్రపంచంలో యువత వివేకానందుని మార్గాన్ని అవలంభించడంతో మన దేశ కీర్తి మరింత పెరిగిందని అన్నారు. వివేకానందుడు ఆశయసిద్ధికి మనమంతా కృషి చేయాలని మాజీ మేయర్ డి.వి.సుబ్బారావు కోరారు. ముందుగా వివేకానందుని చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభలో నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ పి.డి. సత్యనారాయణ, క్రీడాకారిణి శ్రీలక్ష్మి, ఆర్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘చంద్రబాబుది
అధికార కాంక్ష’
విశాఖపట్నం, జనవరి 12: తెలుగుదేశం అధినేత చంద్రబాబుది అధికార కాంక్ష అని విశాఖ పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంద్రీశ్వరి అన్నారు. నగరంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తొమ్మిదేళ్ళ టిడిపి పాలనలో బాబుకు ప్రజలు, వారు పడుతున్న బాధలు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. కేవలం అధికారదాహంతోనే ‘మీకోసం వస్తున్నా’ పేరుతో పాదయాత్రలు నిర్వహిస్తున్నారని, తప్పితే ప్రజలకు ఒరిగేందేమీ లేదన్నారు. వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వస్తే ఆరు మాసాల్లో ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామంటూ వాగ్దానాలు చేయడం ప్రజలను మోసగించడమేనని, అయితే ఇది ఏ విధంగా సాధ్యపడుతుందని ప్రజలే ఈ పార్టీని ప్రశ్నించాలన్నారు.
స్వామి వివేకానందుడు నేటి యువతకు ఆదర్శ ప్రాయుడని
english title:
v
Date:
Sunday, January 13, 2013