విశాలాక్షినగర్, జనవరి 12 : మనం ఆచరిస్తున్న పండుగలు, పర్వదినాలకు ఆధారం సౌరకుటుంబమే. సూర్యుడు నెలకొక నక్షత్ర రాశిలో సంచరిస్తాడు. సూర్యుడు ధనూరాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని ఉత్తరాయణంగా పరిగణిస్తారు. దానినే మకర సంక్రమణం అని కూడా అంటారు. ఇదే మహా పర్వదినం. తెలుగు వారికి సంక్రాంతి పెద్ద పండుగ. భోగి, సంక్రాంతి, కనుక, ముక్కనుమ జరుపుకోవడం మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. కుటుంబంలో భోగభాగ్యాలు కలగాలని భోగిమంటలు వేస్తారు. చిన్నారులకు దిష్టి తీస్తూ భోగిపళ్ళు పోయడం ఆచారం. రేగుపళ్ళు, రాగికాసులు, బంతిపూల రెక్కలు అక్షింతలుగా చిన్నారుల తలల మీదుగా పోస్తారు. కుటుంబ సభ్యులంతా స్నానాలాచరించి భోగి మంట వద్ద చలి కాచుకుంటారు. ఇక తర్వాతి రోజు వచ్చే మకర సంక్రమణం రోజున ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు ఏర్పాటు చేస్తారు. దేవతలకు పగలుగా చెప్పే ఉత్తరాయణానికి అతి విశిష్టత ఉంద. సంక్రాంతి నాడు ఆచరించే స్నాన, జపాదులు విశేష ఫలానిస్తాయి. రైతులు పండించే పంటలు ఇంటికి చేరుతాయి. ధాన్యం, బియ్యం రాశులతో పల్లెలు కళకళలాడతాయి. సంక్రాంతి నాటు స్నానం చేసి నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. విష్ణు సహస్రనామ పఠనం చేసి, మహలక్ష్మిని పూజిస్తారు. సూర్య నమస్కారం చేస్తారు. కొత్త బియ్యంతో పొంగలి, పులగం తయారు చేసుకుని నైవేద్యం పెడతారు. ఈ రోజు గుమ్మడి దప్పళం తినడం శుభప్రదం. బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు చుట్టుపక్కల వారికి పంచి పెడతారు. మకర సంక్రాంతి పితృ పూజలకు అనుకూలం కాబట్టి నువ్వులతో పితరులకు తర్పణం విడవాలి. ఈ కాలంలో దానాల వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ధాన్యం, కంచు, బంగారం, నువ్వులు, నెయ్యి, వస్త్రాలు, ఫలాలు, మజ్జిగ, పసుపు, కుంకుమలను దానం చేయడం మంచిది. మరునాడు వచ్చే కనుమ పండుగ నాడు పశువులను, కొట్టాలను శుభ్రం చేసుకుంటారు. పశువులకు పొంగలి పెడతారు. ఆ పొంగలిని పొల్లాల్లో జల్లి పంటలు బాగా పండాలని పూజిస్తారు. ఎడ్ల పందాలు, కోడి పందాలు గ్రామాల్లో జోరుగా సాగుతాయి. పల్లెలు, పట్టణాలు, పేద గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఈ పర్వదినాలను ఘనంగా జరుపుకుంటారు.
==
మనం ఆచరిస్తున్న పండుగలు, పర్వదినాలకు ఆధారం సౌరకుటుంబమే. సూర్యుడు నెలకొక నక్షత్ర రాశిలో
english title:
n
Date:
Sunday, January 13, 2013