విశాఖపట్నం, జనవరి 12: ప్రయాణికుల అవసరాలను నగరంలో ట్రావెల్ ఏజేన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇందులో దళారుల జోక్యం పెచ్చుమీరుతోంది. ఫలితంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. నెలల తరబడి ముందుగానే రిజర్వేషన్ టికెట్లు కొనుగోలు చేసినా బెర్తులు కన్ఫర్మేషన్ కాకపోవడం వంటి సమస్యలతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీనిని అవకాశంగా చేసుకుంటున్న దళారులు ట్రావెల్ ఏజేన్సీల ద్వారా రిజర్వేషన్ టికెట్లను భారీగా అమ్మకాలు సాగిపోతున్నారు. మరికొన్నచోట్ల అనధికార ట్రావెల్ ఏజేన్సీలు పుట్టుకొస్తూ ఇష్టారాజ్యంగా రైల్వే రిజర్వేషన్ టికెట్ల అమ్మకాల్లో తమ చేతివాటం చూపుతున్నారు. ఫలితంగా రైల్వే ఆదాయాన్ని గండి పడుతుండగా, మరోపక్క ప్రయాణికులు 500 రూపాయల టికెట్‌కు రెట్టింపు చార్జీలను చెల్లించాల్సి పరిస్థితులు ఎదురవుతున్నాయి. సంక్రాంతి, దసరా, వేసవి సీజన్లలో ఇటువంటి పరిస్థితులు మరీ ఎక్కువుగా ఉంటున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకున్న వాల్తేరు డివిజన్ కమర్షియల్ విభాగం అదికారులు, తరచూ వస్తోన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీనిలోభాగంగా శనివారం నగరంలో పలుచోట్ల డివిజన్ అధికారులు ఆకస్మీక దాడులు నిర్వహించారు. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.యల్వేందర్‌యాదవ్ ఆధ్వర్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సహకారంతో ఎంవిపి శాటిలైట్ రిజర్వేషన్ కౌంటర్ పరిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపానున్న పేరున్న ట్రావెల్ ఏజేన్సీ నిర్వహాకులు కొందరు ఒకేసారి అధిక సంఖ్యలో రిజర్వేషన్ టికెట్లను పొందడాన్ని అధికారులు గుర్తించారు. ఇదే తరహాలో తత్కాల్ టికెట్ల అమ్మకాల్లో దళారులు ప్రమేయం ఉందని తేలింది. అందువల్ల ఇకపై ఇటువంటి సంఘటనలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రయాణికులు అవగాహన పెంచుకోవాల్సి ఉందని డివిజన్ అదికారులు విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ టికెట్లు, తత్కాల్ టికెట్ల కోసం అనధికార ట్రావెల్స్, ట్రావెల్ ఏజేన్సీలను ఆశ్రయించవద్దని, నేరుగా రైల్వే ప్రధాన రిజర్వేషన్ కాంప్లెక్స్‌లో కౌంటర్ల ద్వారా వీటిని పొందాల్సిందిగా సూచించారు. టికెట్లను తీయాల్సిందిగా దళారులను నమ్మి పెద్ద మొత్తంలో సొమ్ము ఇస్తే మోసపోవడం కాయమని, దీనిపై తరచూ తాము అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కౌంటర్ల సేవలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
=
కుంభమేళా భక్తుల కోసం నాలుగు టన్నుల బియ్యం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 12: అలహాబాద్‌లోని రుషీకేశ్‌లో జరగనున్న కుంభమేళాలో పాల్గొననున్న భక్తుల కోసం విశాఖ శ్రీ శారదాపీఠం నుంచి నాలుగు టన్ను బియ్యాన్ని, పప్పు దినుసులను శనివారం ఇక్కడి నుంచి పంపించారు. శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఈనెల 30వ తేదీ నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకూ ఈ మహాకుంభమేళాలో పాల్గొననున్నట్టు శారదాపీఠం శనివారం ఒక ప్రకటనలో తెలియచేసింది. కుంభమేళాకు సాధులు, సంతులు, యోగులు, పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ కుంభమేళాలో పవిత్ర నదీ జలాల్లో స్నానం చేసిన వారికి విశేష ఫలాలు లభిస్తాయని స్వరూపానందేంద్ర తెలియచేశారు.
===
ప్రయాణికుల అవసరాలను నగరంలో ట్రావెల్ ఏజేన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇందులో దళారుల
english title:
a
Date:
Sunday, January 13, 2013