(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
దాసన్నకు కోపం వచ్చింది! ఎప్పుడూ ఎవరి ఊసెత్తని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ టీం సొంత నిర్ణయాలపై ఆగ్రహించారు. గ్రూపులు కట్టి జగన్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని చంచల్‌గూడ జైలులో ఉన్న పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కోటి సంతకాల కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహించే విధానంపై పార్టీ అధిష్ఠానానికి అసంతృప్తితో ఉన్న దాసన్న వివరించారు. సంక్రాంతి తర్వాత ఏడు లక్షల సంతకాలు అందిస్తామని చెప్పారు. అంతకుముందే సిక్కోల్‌లో వైకాపా యువనేతల మధ్య కుదుర్చుకున్న బి.్ఫరాల ఒడంబడిక తంతును తనదైనశైలిలో పార్టీ గౌరవ అధ్యక్షురాలకు రాతపూర్వకంగా తెలియజేసినట్లు తెలిసింది. దీనంతటికీ - సంక్రాంతి సంబరాల్లో సడేమియాలా... శ్రీకాకుళం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల బి.్ఫరాల ఒడంబడిక చేసుకున్న రహస్యాన్ని బట్టబయలు చేయడమే! అందుకే - దాసన్నకు ఆగ్రహం వచ్చింది. తక్షణ కర్తవ్యంగా తన బలం - బలగంతో సమావేశం నిర్వహించారు. కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేసారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే....జిల్లా రాజకీయాలకు ఒడంబడిక ఒప్పందాలు ఒరిజినల్‌గా ఉన్నవే. 125 సంవత్సరాల కాంగ్రెస్...25 సంవత్సరాల టిడిపిల మధ్య బి.్ఫరాల ఒడంబడిక చరిత్ర చెప్పే నిజం. 1999 సంవత్సరంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన కణితి విశ్వనాధం (కళింగ), చల్లా రవికుమార్ (వెలమ) ఎం.పి., ఎమ్మెల్యే బి.్ఫరాల ఒడంబడికతో బరిలోకి దిగినట్టే మళ్లీ 2014 ఎన్నికల్లో ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు పాత ఒడంబడికల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నుంచి బరిలోకి దిగేందుకు ఇప్పటి నుంచే కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. దీనిని పసిగట్టిన వైకాపా జిల్లా కన్వీనర్ పద్మప్రియ, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌లు వీటికి బ్రేకులేసేందుకు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా - సొంత శిబిరాన్ని పటిష్టపరిచేవిధంగా ఎత్తుకు పైఎత్తు వేసారు. ఇందులోభాగంగానే రెండు రోజులుగా నరసన్నపేట నియోజకవర్గం కేంద్రంగా తన బలగంతో రహస్య సమావేశాలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఒడంబడికతో ముందుకు సాగుతున్న వీరిద్దరూ ‘కణితి’ మార్కుతో శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయాలు నెరుపుతున్నారన్న అనుమానాలే దాసన్నకు ఆగ్రహం తప్పించింది. దీనికితోడు జగన్ కోసం కోటి సంతకాల సేకరణలో కూడా జగడం ఆరంభమైంది. సంతకాలతో కూడిన పత్రాలు హైకమాండ్‌కు అంతా కలిసి సమర్పించాల్సి ఉండగా, వర్గాల వారీగా అందించాలని పోటీ పడడం వైఎస్సార్ అభిమానులు సంతకాలు ఎందుకు పెట్టామా? అన్న మనోవేదనకు గురవుతున్నారు. జిల్లా అంతటా ఐదు లక్షల సంతకాలు ఇప్పటి వరకూ సేకరించినట్లు కన్వీనర్ ప్రకటించగా, మరో రెండు రోజుల్లో రెండు లక్షల సంతకాలు టార్గెట్ పూర్తికావాలంటూ దాసన్న హుకుం జారీ చేసారు. అయితే, హనుమంతు కిరణ్‌కుమార్, వరదు కళ్యాణి, దుప్పల రవీంద్ర గ్రూపు ఇప్పటికే 50 వేల వరకూ జిల్లా కేంద్రంలో సంతకాలు సేకరణ చేసి వారిమాత్రమే హైకమాండ్‌కు అందజేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే, పాలకొండ నుంచి పాలవలస రాజశేఖరం అండ్ కో., పలాస నుంచి కణితి విశ్వనాధం గ్రూపు వేర్వేరుగా సేకరించిన సంతకాల పత్రాలను అధిష్టానానికి అందించేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఏకతాటిపై పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి జగన్‌కు జనంలో ఇమేజ్‌ను ఓటుబ్యాంకు రూపంలో సంపాదించాల్సిన పార్టీ పెద్దలు ప్రతీ చిన్నపాటి నిర్ణయానికి కీచులాడుకోవడంతో సిక్కోల్‌లో క్షేత్రస్థాయి పార్టీ అభిమానులు ఇరకాటంలో పడుతున్నారు.
జగడం ఇలా మొదలైంది...
సిక్కోల్ నడిబొడ్డు..అది సూర్యమహాల్ జంక్షన్ పెట్రోల్ బంక్...అందులో ఒక ప్రైవేటు గది. పూటుగా మద్యం సేవించి బి.్ఫరం ఒడంబడిక రహస్యాలను బట్టబయలు చేసారు. దీనిని భరించలేని మరో యువనేత తాను అసెంబ్లీపై ఆశలు పెంచుకుంటే కొత్త ఎత్తుగడలు ఏమిటని అక్కడే నిలదీయడంతో వివాదం ముదిరి పాకానా పడింది. ఈ సంగతులను ఓ నాయకుడు దాసన్న చెవిలో వేయగా కణితి వ్యతిరేక వర్గీయులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి పలాస మాజీ మున్సిపల్ చైర్మన్ వజ్జ బాబురావు, మాజీ జెడ్పీ చైర్మన్లు దువ్వాడ శ్రీనివాస్, మార్పు ధర్మారావు, దవళ రమేష్, మాజీ ఎమ్మెల్యే మినతిగోమాంగో, బొడ్డేపల్లి మాధురి, ఎన్ని ధనుంజయులను మాత్రమే ఆహ్వానించి కార్యాచరణపై చర్చించడం గ్రూపు రాజకీయాలు సంక్రాంతి సమయంలో కాకపట్టాయి. ముందున్న సహకార ఎన్నికలు, అనంతరం వచ్చే మున్సిపల్, స్థానిక ఎన్నికలలో తమ అభ్యర్ధులు విజయాల కోసం పార్టీని బలోపేతం చేయకుండా కేవలం కార్యక్రమాల నిర్వహణకే గ్రూపులు కట్టడంపై ఆ పార్టీ అభిమానులలో జగన్ కుటుంబం పట్ల సానుభూతి సన్నగిల్లుతోంది.
ఎప్పుడూ ఎవరి ఊసెత్తని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ టీం సొంత
english title:
d
Date:
Sunday, January 13, 2013