శ్రీకాకుళం, జనవరి 12: అనాదిగా పంటలు కలిసిరావాలని కుటుంబ సభ్యులంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతు కుటుంబాలు సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. వ్యవసాయరంగం గత కొనే్నళ్లుగా సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల బతుకుబండి సాగించేందుకు సిక్కూలీగా దేశంలో వివిధ ప్రాంతాల్లో వలస వెళ్లి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. అటువంటి వారంతా సంక్రాంతి పండుగను సొంత ఊళ్లలో బంధువులు, ఆత్మీయులు, సన్నిహితుల మధ్య జరుపుకొనేందుకు తిరిగి వస్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. గత మూడు రోజులుగా గ్రామాలకు వలస కూలీలతో పాటు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్పొరేట్ కళాశాలల్లో చదువులు సాగిస్తున్న విద్యార్థులు ఇంటిముఖం పట్టారు. గ్రామాలకు చేరుకున్న వలస పక్షులను ఆప్యాయతగా పల్లెవాసులు పలకరిస్తూ సాదరంగా ఆహ్వానించడంతో గ్రామాలకు కూడా సంక్రాంతికళ వచ్చేసింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబాయి, కలకత్తా తదితర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వలస కూలీలు, ప్రైవేట్ కంపెనీల్లో బతుకుబండి సాగిస్తున్న ఉద్యోగులు, పిల్లాపాపలతో సొంతూళ్లకు చేరుకోవడంతో సందడి నెలకొంది. పండుగ సీజన్‌లో ప్రయాణీకుల సౌకర్యార్ధం ఆర్టీసి అధికారులు బస్సుల సంఖ్యను పెంచి ఆదాయాన్ని సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక రైళ్లంటూ రైల్వేశాఖ పలు రైళ్లను నడుపుతున్నప్పటికీ ముంబాయి నుంచి వచ్చే కోణార్క్, చెన్నై నుంచి హౌరామెయిల్, హైదరాబాద్ నుంచి వచ్చే విశాఖ, ఈస్టుకోస్టు, ఫలక్‌నామా తదితర రైళ్లలో జనరల్ బోగీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇదిలా ఉండగా ప్రైవేట్ వాహనదారులు కూడా ప్రయాణీకుల ఆవసరాన్ని ఆసరాగా తీసుకుని దండీగా టిక్కెట్ల రూపేనా సొమ్ములు గుంజేస్తున్నారు. అయినప్పటికీ సంక్రాంతి సంబరాల్లో ఇవేవీ లెక్కచేయకుండా సామాన్యుల నుంచి అసమాన్యుల వరకు కొత్త బట్టలు, పిండివంటలు, ఆడపడచుల ఆహ్వానాల్లో బిజీగా పల్లెవాసులంతా గడపడం కనిపిస్తోంది.
కిటికిటలాడుతున్న మార్కెట్లు
శ్రీకాకుళం(కల్చరల్): సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలోని మార్కెట్లన్నీ శుక్రవారం కళకళలాడాయి. నూతన వస్త్రాలు, పిండివంటలకు నిత్యవసర సరుకులు కొనుగోళ్లతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. ప్రధాన రహదారులన్నీ జనసంధ్రమయ్యాయి. వివిధ గ్రామాల నుండి జనం పోటెత్తడంతో ఉదయం నుంచే వస్తవ్య్రాపారులు అమ్మకాలకు సిద్ధమయ్యారు. వస్తద్రుకాణాలు జాతరను తలపించాయి. పట్టణంలో పలు మార్కెట్లు కొనుగోళ్లదారులతో కళకల్లాడాయి. పండుగకు కావాల్సిన సామాగ్రి, పండ్లు, కూరగాయలు, బట్టలు కొనుగోలు చేసేందుకు జనం తరలివచ్చారు. పాతబస్టాండు దరి పొట్టిశ్రీరాములు మార్కెట్‌లో కూరగాయలు, రేగుపళ్లు, అరటి, టెంకాయలు, చెరకుకు గిరాకీ పెరిగింది. పావుకిలో బంతిపువ్వులు 40 రూపాయలు, చామంతి 80 రూపాయలు కాగా అరటిపళ్లు డజన్ 30 నుంచి 100 రూపాయల వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఇక వస్త్రాల కొనుగోళ్లలో జి.టి.రోడ్, నెహ్రూరోడ్, చంపాగళ్లవీధి తదితర రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. పండుగకు ఒక్కరోజే ఉండడంతో రెడీమేడ్ దుస్తుల వద్ద అధికంగా జనాలు కనిపించారు. ధర ఎంతైనా కొనడమే ప్రధానంగా చేసుకున్న వినియోగదారుని అవసరాన్ని బలహీనతగా తీసుకుని వ్యాపారులు ఇష్టానుసారంగా విక్రయాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
అనాదిగా పంటలు కలిసిరావాలని కుటుంబ సభ్యులంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతు కుటుంబాలు సంక్రాంతి
english title:
s
Date:
Sunday, January 13, 2013