శ్రీకాకుళం, జనవరి 12: యువతలో ఉన్న వినూత్నమైన శక్తిని మేల్కొనేలా చేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వివేకానందుని బోధనలు నేటి తరం యువతరానికి ఆదర్శనీయమని కొనియాడారు. స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా బాపూజీ కళామందిర్‌లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివేకానంద అసలు పేరు రవీంద్రనాద్‌దత్తు అని, తండ్రి విశ్వనాధ్, తల్లి భునేశ్వరని తెలిపారు. వివేకానంద తత్సశాస్త్రంలోని పాండిత్యాన్ని గ్రహించుకున్నారన్నారు. రామకృష్ణపరమహంస శిష్యునిగా చేరి ఆధ్యాత్మికతను నేర్చుకున్నారని చెప్పారు. తరువాత సన్యాసత్వం పొంది స్వామి వివేకానందగా పేరొందినట్టు తెలిపారు. 1983లో చికాగోలో జరిగిన సభలో భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతటా చాటిచెప్పిన వ్యక్తి స్వామివివేకానంద అని పేర్కొన్నారు. స్వామివివేకానంద చేసిన బోధనలు ఆచరించి దేశాన్ని నిర్మించుకోవాలని కోరారు. విశిష్ట అతిథి కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయమంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని, సంస్కృతిని ప్రపంచమంతటా స్వామివివేకానంద చాటిచెప్పారన్నారు. బతికి ఉండగా సమాజంలో తాను చేసిన మంచి పనులను మరణానంతరం తనను సమాజం మరిచిపోదు అనడానికి వివేకానందుడే నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో 33 కోట్ల మంది యువతీయువకులు ఉన్నారన్నారు. రాబోయే కాలంలో వివేకానంద స్పూర్తితో దేశం వినూత్నమైన శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ స్వామివివేకానంద ఇచ్చిన సందేశాన్ని ఎవరూ మరిచిపోరాదన్నారు. తొలుత వివేకానంద విగ్రహ కమిటీ, మున్సిపల్ అధికారుల సంయుక్త కార్యక్రమంలో స్థానిక సూర్యమహల్ కూడలి వద్ద వివేకానందుని విగ్రహాన్ని విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఆవిష్కరించగా రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కోండ్రు మురళీ మోహనరావు, కలెక్టర్ సౌరభ్‌గౌర్‌లు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా విగ్రహ కమిటీ నేత ప్రధాన ఆదినారాయణ మంత్రులు, యువకులతో వివేకానంద అడుగుజాడల్లో నడిచి దేశానికి సేవచేయాలన్న సంకల్పాన్ని ప్రమాణం చేయించారు. వివేకానంద సూక్తులు యువతకు ఆదర్శం కావాలని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ఆకాంక్షించారు.
* బలమే జీవనం...బలహీనతయే మరణం
బలమే జీవనం...బలహీనతయే మరణం అంటూ ఎన్‌సిసి కమాండెంట్ రామారావు, శ్రీనివాసరావులు ఆధ్వర్యంలో బోర్డులు పట్టుకొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశ సంస్కృతిని మరువరాదని, దారుణమైన హత్యలూ, ఆశ్చర్యకరమైన ఆత్మహత్యలు నేడు భారతమాతను చిత్రవధ చేస్తున్నాయని, భారతీయులు ముఖ్యంగా యువత వివేకానందుని అనుసరిస్తే సై సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని ర్యాలీలో నినదించారు.
యువతలో ఉన్న వినూత్నమైన శక్తిని మేల్కొనేలా చేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని
english title:
u
Date:
Sunday, January 13, 2013