కుత్బుల్లాపూర్, జనవరి 13: గాజులరామారం చిత్తారమ్మదేవి జాతర మహోత్సవాలను ఈనెల 18 నుంచి 25వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్యగౌడ్ తెలిపారు. జాతర ఉత్సవాలను ఆలయాన్ని భక్తులు ఆకట్టుకునే విధంగా విద్యత్త్ దీపాలతో తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 20న అమ్మవారి కల్యాణంతో పాటు, జాతర ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారిని దర్శించుకుంటే అన్ని సమస్యల నుంచి గట్టేక్కిస్తుందని భక్తుల నమ్మకం జాతర ఉత్సవాలకు నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలోని నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున్న పాల్గొంటారు. వారం రోజుల పాటు, జరిగే జాతర ఉత్సవాలకు ఇమ్లిబన్, జాబ్లీస్టేషన్‌తో పాటు, జీడిమెట్ల ఆర్టీసీ డిపో అధికారులు ప్రత్యేక బస్సులు నడిపిస్తారు. భక్తులకు మంచినీటి సౌకర్యం వాటర్‌వర్క్స్ అధికారులు కల్పించడంతో శాంతిభద్రలకు విఘాతం కలుగకుండ జీడిమెట్ల పోలీసులు బందోబస్తు, ఏర్పాటు చేస్తారు. వైద్యం శిబిరం ఎర్పాటు చేస్తారు. మునిసిపల్ అధికారులు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. జాతర ఉత్సవాలలో ఎంపి దేవేందర్‌గౌడ్, మంత్రి ప్రసాద్‌కూమార్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ హజరవుతారని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు.
గాజులరామారం
english title:
r
Date:
Monday, January 14, 2013