ఉప్పల్, జనవరి 13: కాలనీల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బన్నాల ప్రవీణ్‌రాజ్‌ముదిరాజ్ అన్నారు. ఉప్పల్ పట్టణంలోని నార్త్ ఉప్పల్ కాలనీల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం బ్యాంక్ కాలనీలో జరిగిన కమ్యూనిటీ హాల్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భ ంగా అధ్యక్షుడిగా ఎన్నికైన బన్నాల ప్రవీణ్‌రాజ్‌ముదిరాజ్ మాట్లా డుతూ అందరి కృషితో కాలనీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 25 కాలనీలతో ఏర్పాటు చేసిన ఫెడరేషన్‌తో 75 మంది జనరల్ కౌన్సిల్‌గా ఏర్పాటు చేసి తద్వారా నియమించిన నూతన కమిటీ అధ్యక్షుడిగా బన్నాల ప్రవీణ్‌రాజ్‌ముదిరాజ్, అసోసియేట్ అధ్యక్షుడిగా కె.బాబూరావు, ఉపాధ్యక్షులుగా ప్రొఫెసర్ రాములు, యాకూబ్‌రెడ్డి, గోపాలకృష్ణ, మహమ్మద్ గఫూర్, ప్రధానకార్యదర్శిగా జి.వేణుగోపాల్‌రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిగా సుమన్‌శర్మ, సంయుక్తకార్యదర్శిలుగా పల్లె రమేశ్‌గౌడ్, గూడూరు రమేశ్, జడ్‌ఆర్ ఫరూఖ్ ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి హైకోర్టు న్యాయవాది కె.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రశాంతినగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామలింగారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. కాలనీలలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి, శ్మశానవాటిక, ఇతర వౌళిక సౌకర్యాలను కల్పించడానికి శాయశక్తులా కృషి చేసి ఆదర్శ సంక్షేమ సంఘంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
కాలనీల్లో
english title:
r
Date:
Monday, January 14, 2013