Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రిమ్స్‌లో ఎంసిఐ తనిఖీలు

$
0
0

కడప, జనవరి 17 : జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ఎంసిఐ బృందం గురువారం తనిఖీలకు శ్రీకారం చుట్టారు. రిమ్స్ వైద్య కళాశాలలో ఇప్పటి వరకు వరకు ఎంబిబిఎస్ గ్రాడ్యుయేషన్ వరకే కొనసాగిస్తున్నారు. దీంతో పిజి కోర్సుల అనుమతి నిమిత్తం జిల్లాకు చెందిన మంత్రి డిఎల్. రవీంద్రారెడ్డి చొరవతో ఎంసిఐ బృందం సందర్శన నిమిత్తం రిమ్స్‌కు వచ్చారు. చేరారు. ఈ నేపథ్యంలో డిఎంహెచ్‌ఓ, వైద్య విధాన పరిషత్ జిల్లా ప్రధాన అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వివిధ నిపుణులను రిమ్స్ ఆస్పత్రికి డిప్యూటేషన్‌పై నియామకం చేశారు. అలాగే మంత్రి డిఎల్. రవీంద్రారెడ్డి జోక్యంతో రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుతాస్పత్రుల్లో పని చేస్తున్న వివిధ రకాల స్పెషలిస్టులను సైతం రిమ్స్‌కు రప్పించారు. ఈ సందర్భంగా మొదటగా రిమ్స్ ఆడిటోరియం నుండి ప్రారంభమై రిమ్స్ కళాశాలలోని సెంట్రల్ లైబ్రరీ, అనాటమి, ఫిజియాలజీ పలు విభాగాలు తనిఖీ చేశారు. అలాగే ఐపి విభాగంలోని గైనిక్ వార్డును, స్టెరిలైజర్, కిచెన్, డయాలసిస్ పలు వార్డులను సందర్శించారు. ఈ పరిశీలనకు రాజస్థాన్‌కు చెందిన మత్తు వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ సి. దులరా, కర్నాటక, హుబ్లికి చెందిన శర్మ వైద్య నిపుణులు డాక్టర్ రవి రాథోడ్, అస్సాం రాష్ట్రానికి చెందిన అనటామి ప్రొఫెసర్ కె. ఎల్. తల్క్ధుర్, లక్నో పట్టణానికి చెందిన ఫిజియాలజీ ప్రొఫెసర్ ఎన్‌ఎస్. వర్మ, పాండిచేరికి చెందిన జనరల్ సర్జన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సిమన్ దేశాయ్, కేరళ రాష్ట్రానికి చెందిన జనరల్ మెడిషన్ విభాగ ప్రొఫెసర్ ఉదయ భాస్కర్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ నీలిమసింగ్‌లు వచ్చారు. సంబంధిత శాఖలకు సంబంధించిన రోగులు కూడా జిల్లా వ్యాప్తంగా తరలివచ్చారు. అలాగే వైద్యులు అందిస్తున్న సేవలను రోగులు సౌకర్యాలు, చికిత్స వివరాలు తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మరో ఏడు రోజుల పాటు ఎంసిఐ బృందం రిమ్స్‌లో మకాం వేసి వైద్య కళాశాలను, ఆస్పత్రిని తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకొని పూర్తి స్థాయిలో రిమ్స్ విభాగాలపై విశే్లషించి శాఖా పరంగా తనిఖీలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. ఏది ఏమైనా 2013-14 విద్యా సంవత్సరంలో పిజి కోర్సు ప్రవేశపెట్టడానికి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. వీరితో పాటు రిమ్స్ డైరెక్టర్ సిద్దప్ప గౌరవ్, ప్రిన్సిపల్ బాలకృష్ణ, ఆర్‌ఎంఓ వెంకట రత్నం, సూపరింటెండెంట్ రామచరణ్, ఫోరెన్సిక్ డాక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనకు వైఎస్ కూడా కారకుడే
సమైక్య ఉద్యమ తీవ్రత పెంచాలి
* మాజీ ఎమ్మెల్యే వరద
ప్రొద్దుటూరు, జనవరి 17: తెలంగాణ రాష్ట్ర విభజనకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా ఒక కారకుడని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో సిఎల్‌పి నేతగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది సీనియర్ నాయకులు, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కొరకు ప్రయత్నిస్తామని తెలుపగా అందుకు ఆయన అంగీకరించారన్నారు. తరువాత 2004-09 సంవత్సరాలలో జరిగిన రాజకీయ పరిణామల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విభజనపై వైఎస్ స్పందించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనే ఆలోచనతో పూర్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సీమాంధ్ర నేతలు ఉద్యమ తీవ్రతను పెంచకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే వరద పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు నిమ్మకు నీరేత్తినట్లు ప్రవర్తిస్తున్నారన్నారు. ఈ విధానాల ద్వారా నష్టపోయే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో గ్రామ స్థాయి నుండి సర్పంచ్, ఎంపిటిసి, జడ్పీటిసి, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మంత్రి, ఎంపిలతో సహా ప్రాంత వాసులంతా తెలంగాణ రాష్ట్ర విభజన కోసం 11 సంవత్సరాలుగా ఏదొక రూపాన నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. సీమాంధ్ర ప్రాంతంమంతా సమైఖ్యంగా ఉండాలనే నినాదాన్ని పూర్తిగా వదిలి వేశారన్నారు. మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసుప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డిలు హైకమాండ్‌తో చర్చించిన తరువాత సీమాంధ్ర కంటే తెలంగాణలో ఉద్యమం తీవ్రంగా ఉందనేన ఆలోచనతో రాష్ట్ర విభజన తప్పక పోవచ్చు అనే సంకేతాలను ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర నాయకులు కనువిప్పుకలిగి సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలన్నారు. ఈ ప్రాంతంలో కూడా ప్రతి కార్యకర్త పార్టీల కతీతంగా రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపిలందరు కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేసే వరకు రాష్టవ్రిభజన ఆగదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే మన ప్రాంతంలో పూర్తి నష్టపోయే పరిస్థ్థిలు ఉన్నాయన్నారు. సీమాంధ్ర వారు మన సంపదనంతా హైదరాబాద్‌లో పెట్టుబడిగా పెట్టి అభివృద్ధి చేయడం జరిగిందని, రాష్ట్ర విభజన తరువాత 40లక్షల మంది ఆంధ్ర, రాయలసీమ వాసులు తమ ఉనికిని కోల్పోవడంతో పాటు ఇబ్బందులు తప్పవన్నారు. విద్యా, సాగు, తాగునీటితోపాటు అన్ని రకాలుగా హైదరాబాద్ పట్టణంలో అభివృద్ధి చెందిందని, రాష్ట్ర విభజన జరిగితే మన ప్రాంతం 50 సంవత్సరాల తిరోగమనానికి వెళ్తుందన్నారు. అందరు కలిసి కట్టుగా రాజకీయాలకు అతీతంగా డిసెంబర్ 9 మాదిరిగా ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 10గంటలకు స్థానిక పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్లో సమైక్యాంధ్ర మద్దతుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు.

క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
* ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి
రాజంపేట రూరల్, జనవరి 17:క్రీడాకారులు గెలుపు, ఓటములతో తమలోని లోటు పాట్లను తెలుసుకుని క్రీడానైపుణ్యాన్ని పెంపొందించు కోవాలని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం జాతీయ స్థాయి సెపక్‌తక్రా క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. మహనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పుట్టిన ఈ జిల్లాలో జాతీయ స్థాయి క్రీడాపోటీలను నిర్వహించడం జిల్లాకే గర్వకారణమన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులకు ఎలాంటి లోటుపాట్లు వచ్చినా వెంటనే తమకు తెలపాలన్నారు. సబ్ కలెక్టర్ ప్రీతిమీనా మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడాపోటీలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. క్రీడాకారులు ఏలాంటి అసౌకర్యాలకు గురవకుండా ముందస్తుగానే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ అన్యోన్య, ఆర్‌జెడి గోపీనాథ్, ఆర్‌ఐపిఇ భానుమూర్తిరాజు, పిడి షామీర్‌బాషా, ఎపి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ విజయరావ్, సెపక్‌తక్రా జాతీయ అధ్యక్షులు ప్రేమ్‌చంద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొండూరు శరత్‌కుమార్‌రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సి.యల్లారెడ్డి, ప్రిన్సిపాళ్లు సాంబశివారెడ్డి, ప్రసాద్‌రావు తహశీల్దార్ చెండ్రాయుడు, సిఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కృషి
* రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖాన్
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 17 : జిల్లాలో గుర్తించిన పర్యాటక కేంద్రాల అభివృద్ధికి మరో నెల రోజుల్లో అన్ని చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి చందనాఖాన్ పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జిల్లాలోని పర్యాటక కేంద్రాలను సందర్శించి గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో గండికోట, గండిక్షేత్రం, మైలవరం, బద్వేలు గోపవరం, రాజంపేట, ఒంటిమిట్ట, తాళ్లపాక తదితర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. సంబంధిత ప్రాంతాల్లో వచ్చే నెల 15 లోపు పర్యాటకులకు కావాల్సిన వసతులన్నీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పర్యాటక అభివృద్ధికి నిధుల కొరత లేదన్నారు. అలాగే జిల్లాలో కవులకు, రాజులకు, జమిందారులు, జాగీర్‌దారులు, నవాబులకు పుట్టినిల్లు అని అన్నారు. పర్యాటకులకు సౌకర్యాలు మెరుగుపరచడానికి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన హరితా రిసార్స్ మొదలుకుని అన్ని పర్యాటక కేంద్రాల్లో టురిజం శాఖ నేతృత్వంలో వసతులు, భోజన సౌకర్యాలతో పాటు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. అలాగే ఎంతో ఘన చరిత్ర కలిగిన తాళ్లపాక అన్నమాచారి స్వస్థలంలో, గండికోట చారిత్రాత్మక కట్టడాలపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు తెలిపారు. ఇకపోతే కడప నగరం నుంచి గండికోటకు వచ్చే సందర్శకుల కోసం 3 నుంచి ప్రత్యేక ప్యాకేజీ టూర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తాళ్లపాక నుంచి ఒంటిమిట్టకు ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దివంగత నేత డాక్టర్ వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఎంతో ఉన్నత ఆశయాలతో ట్రిబుల్ ఐటి అభివృద్ధికి కృషి చేసిన విధంగానే టూరిజం శాఖ నేతృత్వంలో ఇడుపులపాయ హరితా రెస్టారెంట్‌ను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో పర్యాటక కేంద్రాలకు, వివిధ ప్రాంతాలకు ఎంతో ఘన చరిత్ర ఉందని పర్యాటక శాఖ, టూరిజం శాఖల నేతృత్వంలో ఆశించిన అభివృద్ధి చేసి పర్యాటకులకు సౌకర్యాలు మెరుగుపరిచి ప్రభుత్వ ఆదాయానికి వనరులు పెంపొందించి సామాన్యులకు సైతం పర్యాటక కేంద్రాలను అందుబాటులో తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పర్యాటక శాఖ జిల్లా అధికారి, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ గోపాల్ పర్యాటక రంగ కేంద్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని కితాబు ఇచ్చారు.
సమైక్యాంధ్ర కోసం పోరాటం
* ఎమ్మెల్యే వీరశివారెడ్డి
కమలాపురం, జనవరి 17 : సమైక్యాంధ్ర కోసం పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు కలిసి పోరాటాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే వీరశివారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం రాజధాని నుంచి ఫోన్ ద్వారా విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ కలసి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి తీర్మాణించినట్లు తెలిపారు. ఇందుకోసం ఈనెల 21న ఢిల్లీకి తరలివెళ్లనున్నట్లు తెలిపారు. 75 సంవత్సరాల క్రితం జరిగిన శ్రీబాగ్ ఒడంబడిక వల్ల ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. అప్పట్లో కర్నూలు రాజధానిని పోగొట్లుకోగా అప్పటి నుంచి హైదరాబాదు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అలాంటిది ఇప్పుడు చూస్తూచూస్తూ నగరాన్ని పొగొట్టుకోలేమన్నారు. తెలంగాణా జిల్లాల్లోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ప్రజలు రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. కేవలం కెసిఆర్ తన స్వలాభం కోసమే ప్రత్యేక తెలంగాణా అంటున్నారని అక్కడి ప్రజలు నిజంగా తెలంగాణా కోరుకోవడం లేదన్నారు. ఈనెల 28న కేంద్ర హోం శాఖ మంత్రి షిండే ఒకవేళ ప్రత్యేక తెలంగాణా ప్రకటించినట్టయితే సీమాంద్రకు చెందిన ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేసేందుకు కూడా మెనుకాడబోమని హెచ్చరించారు.

ప్రజాతీర్పును శిరసావహిస్తాం
* మాజీ ఎమ్మెల్యే వరద
ప్రొద్దుటూరు, జనవరి 17 : 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎన్నో తీవ్రమైన పోరాటాలు, ఉద్యమాలను చేసినప్పటికీ చట్ట పరిధిని అతిక్రమించకుండా పోలీసుల ఫిర్యాదు వరకే పరిమితం అయ్యామని అలాంటి మాజీవిత చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిదని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఘాటుగా విమర్శించారు. గురువారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్షల కోట్ల రూపాయలు అక్రమార్జన చేసి జైల్లో ఉండేందుకు ఆ పార్టీ నాయకులంతా సిగ్గుపడాలన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సైతం అతి తక్కువ కాలంలో లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాధించావని ప్రశ్నించడం జరిగిందన్నారు. లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాధించి పార్టీ పెట్టి కోటి సంతకాలు, అనేక కార్యక్రమాలను చేయడం జరుగుతోందన్నారు. జైలు నుంచి బయటికి వచ్చే నమ్మకం ఉందా అని వైఎస్‌ఆర్ పార్టీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. జగన్ మోహన్‌రెడ్డి జైలు నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేనేలేదన్నారు. వైఎస్‌ఆర్ పార్టీలో ఉండబడిన వారంతా అత్యధిక స్థాయిలో అవినీతికి పాల్పడిన వ్యక్తులేనని ఆయన విమర్శించారు. వైఎస్‌ఆర్ పార్టీలో చేర్చుకునే ముందు ఆ మనిషి వ్యక్తిత్వం నిజాయితీ పరుడా, ఒక సామాన్య కార్యకర్త నుండి కోట్ల రూపాయల డబ్బును ఎలా సంపాధించాడో ఆలోచించాల్సిన విజ్ఞత కూడా లేదన్నారు. అనవసరంగా తన మీద, తన కుమారుని మీద ధర్నాలు, రాస్తారోకోలు సమావేశం నిర్వహించడం వల్ల తమ యొక్క పరపతి పెరుగుతుందన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని, ప్రజా తీర్పుకు శీరసావహిస్తానన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత మూడురోజులుగా నిరంతరం ఎక్కడా జరగని స్థాయిలో ఒక ప్రొద్దుటూరు పట్టణంలోనే సంఘటనలు జరిగినవి, జరిగినట్లు పదేపదే ధర్నాలు, నిరసన కార్యక్రమాలను చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇటువంటి సంఘటనలు గతంలో అనేకం జరిగినా చట్టం తన పని తాను చేసుకపోతుందనే విశ్వాసంతో ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండగలిగామన్నారు. గతంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కామిశెట్టి సుబ్బారావును నానాదుర్భషలాడి ఆయనను కొట్టినప్పటికీ ధర్నాలు చేపట్టలేదన్నారు. రామేశ్వరంలో తమ బంధువులపై ఇదే దొరణి ప్రవర్తించినప్పుడు తాము కేసులను మాత్రమే పెట్టడం జరిగిందని, ఆ కేసులు ఇప్పటికి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు చేయాలని ఎక్కడా లేదన్నారు. ఐదురోజుల తరువాత ఫిర్యాదు ఇచ్చి ఎలాంటి రక్తపు గాయాలు, కనీసపు గోరుతగిలిన మచ్చలు కూడా లేకపోయినా జరిగిన దానికి అనవసర రాద్దాంతం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రస్తుతం ధర్నాలో ఉన్న వ్యక్తులంతా ఒక సామాన్య కార్యకర్త నుండి కోట్ల రూపాయలు ఎలా సంపాధించారో ప్రజలకు బహిరంగ పర్చాలని, త్వరలోనే వారి నిజరూపాలను బయటికి వెల్లడిస్తానన్నారు. ప్రస్తుతం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో ప్రజాప్రతినిధలుగా నాయకులుగా ఉండబడిన వారంతా తన శిష్యులేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శంకరాపురం ప్రసాద్‌రెడ్డి, శివాలయం చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, మాకం సత్యం, షబ్బీర్ బాషా, చిల్లిగారిసత్యం, తదితరులు పాల్గొన్నారు.

వైకాపా నేతలను హింసిస్తే ఊరుకోం
* భూమా నాగిరెడ్డి
ప్రొద్దుటూరు, జనవరి 17 : రాజకీయాలలో ప్రొద్దుటూరు పట్టణంలో గత నాలుగైదురోజుల కిందట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవి సుధాకర్‌రెడ్డిపై జరిగిన సంఘటన ఎన్నడూ చూడలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపి భూమానాగిరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే తనయుడు తీరుపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ధర్నాలో పాల్గొన్న భూమా మాట్లాడుతూ రాజకీయాలలో ఇలాంటివి ఎన్నడూ చూడలేదని, జరిగిన సంఘటన చాలా బాధవేస్తోందన్నా రు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తనయుడు కొండారెడ్డి సినిమాల్లో చూసి ఇక్కడ ప్రవర్తించడం సినిమా విధానం మాదిరిగా అనుకున్నాడేమోనని ప్రశ్నించారు. సమాజంలో చెల్లుబాటు అయ్యే వ్యక్తులు ఇలాంటి పనులు చేయరని, చిల్లర మనుషులకే ఇలాంటివి వర్తిస్తాయన్నారు. రాష్ట్రం లో ఏమి జరిగినా ఆవన్నీ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధాన్ని అంటగట్టడం నీచమైన పద్ధతి అన్నారు. తమ అధికార దాహం కోసం ప్రజల్లో అభిమానాన్ని చూరగొంటున్న వైఎస్‌ఆర్ పార్టీ వారిని చిత్రహింసలు చేస్తే చూస్తూ ఉరుకునేది లేదన్నారు. ప్రజలే స్పంది ంచి బుద్ధి చెప్పేరోజులు కాంగ్రెస్ పార్టీకి దగ్గర పడ్డాయన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ప్రొద్దుటూరు పట్టణం వ్యాపార రంగంలో ప్రసిద్ధి చెందినదని, మాటమీదనే కోట్ల రూపాయలు వ్యాపారాలు ఇక్కడ జరుగుతుంటాయన్నారు. వరద తనయుడు కొండారెడ్డి సంప్రదాయం వ్యాపారస్థుల మీద నెట్టి వేయడం మంచి పద్ధతి కాదన్నారు. 25సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రజలకు ఇచ్చే బహుమానం ఇదేనా అని ఆయన ఎద్దేవా చేశారు. చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదని, ఆయన చరిత్ర ఘనమైన చరిత్రగా ప్రజలు ఆలోచిస్తారన్నారు. న్యాయవాది సుధాకర్‌రెడ్డిపై జరిగిన సంఘటనకు భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఇలాంటివి ఎక్కడా చూడలేదని, తన కుటుంబం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలంటే ఏ వృద్ధులకో అన్నదానమో, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవాకార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవాల కానీ తనకు అండగా నిలిచి డబ్బులు అడిగినందుకు హింసించి ఒక నేరచరిత్రను సృష్టించి రాజకీయాల్లోకి రావాలనుకోవడం తాను ఎక్కడా చూడలేదన్నారు. రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వరద కుటుంబం నుండి ఏ ఒక్కరికి హాని కలిగినా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి కాపాడుతానని, కొండారెడ్డిపై రౌడీషీట్ నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ఇవి సుధాకర్‌రెడ్డి సతీమణి మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఇరగం మల్లీశ్వరి మాట్లాడుతూ 25సంవత్సరాలుగా తన భర్త మాజీ ఎమ్మెల్యే వరద అనుచరుడిగా ఉండి 58లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి తిరిగి ఇమ్మనందుకు మంచి బహుమతిని ఇవ్వడం జరిగిందన్నారు. ఆయనకు అన్ని సంవత్సరాల సేవ చేసినా తనకుటుంబానికి ప్రశాంతంగా బతికే అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రజలు గమనించి పరిస్థితులను గుర్తించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మైదుకూరు, ప్రొద్దుటూరు, నియోజకవర్గంలోని వైఎస్‌ఆర్‌సిపి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

మహిళల సాధికారతకు తోడ్పడాలి
* ఇన్‌చార్జి కలెక్టర్ కె. నిర్మల
కడప (రూరల్), జనవరి 17 : వ్యవసాయ, గృహ విజ్ఞాన రంగాల్లో గ్రామీణ మహిళలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి వారి సాధికారతకు తోడ్పాడాలని ఇన్‌చార్జి కలెక్టర్ కె. నిర్మల సంబంధిత శాస్తవ్రేత్తలకు సూచించారు. గురువారం వైఎస్సార్ ఆడిటోరియంలో ఆచార్య ఎన్‌జి రంగా యూనివర్శిటీ గృహ విజ్ఞాన విభాగం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో గ్రామీణ మహిళల సాధికారత - సాంకేతిక పరిజ్ఞానం అన్న అంశంపై కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల మహిళలతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం సంప్రదాయక వ్యవసాయ దేశమని, అధిక శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. అయితే ప్రస్తుతం వాతావరణ మార్పులు, పెట్టుబడి తదితర సమస్యల వల్ల వ్యవసాయ రంగం ఇబ్బందుల్లో ఉందన్నారు. అయినా వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను తగ్గించలేమన్నారు. పంటలు పండకుంటే ఆహార ధాన్యాల కొరత తీవ్రమవుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయాన్ని లాభ దాయకంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయంలో శ్రమ శక్తిని తగ్గించేందుకు యాంత్రికరణ విధానాలను ఉపయోగించుకోవాలన్నారు. వ్యవసాయం ఒకటే కాకుండా పశుపోషణ, గృహ విజ్ఞాన రంగాల ద్వారా మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. గృహ విజ్ఞాన రంగం ద్వారా విలువలు పెంచే విధంగా ఉత్పత్తులను తయారు చేసుకోవాలన్నారు. శాస్తవ్రేత్తలు ఈ మేళుకువలను మహిళలకు నేర్పించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఆదాయం పెంచుకునేలా ఉత్పత్తుల తయారిలో కృషి విజ్ఞాన కేంద్రం, గృహ విజ్ఞాన విభాగాలు శిక్షణను ఇస్తున్నాయని వీటిని ఉపయోగించుకోవాలని కోరారు. ఆచార్య ఎన్.జి. రంగ విశ్వవిద్యాలయం గృహ విజ్ఞాన విభాగం డీన్ డాక్టర్ ఎ. శారదదేవి మాట్లాడుతూ దేశంలో పురుషుల కంటే మహిళలు తక్కువగా ఉన్నారన్నారు. గ్రామీణ మహిళల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల బలహీనతను కలిగి ఉన్నారన్నారు. చిరుధాన్యాల ద్వారా పోషకాలు పొంది బలహీనతను అధికమించవచ్చన్నారు. గృహ విజ్ఞాన విభాగం ద్వారా చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జోనాథన్ మాట్లాడుతూ వ్యవసాయంలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుందన్నారు.ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం బోర్డు మెంబర్ శారద జయలక్ష్మి, ప్రాంతీయ పరిశోధన స్థానం తిరుపతి అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ గిరిధర్ కృష్ణ, నాబార్డు ఎజిఎం క్రిష్ణమూర్తి, న్యూట్రిషన్ విభాగం ప్రొఫెసర్ హేమలత, కృషి విజ్ఞాన కేంద్రం ఫ్రోగ్రాం కో- ఆర్డినేటర్ డాక్టర్ పద్మోదయ, గృహ విజ్ఞాన శాస్తవ్రేత్త స్వర్ణలతాదేవి వ్యవసాయం, గృహ విజ్ఞాన రంగాల్లో ఉత్పత్తుల తయారీపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా గృహ విజ్ఞాన విభాగం హైదరాబాద్, కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మహిళలు తయారు చేసిన పోషకాహార ఉత్పత్తులు, సహజ రంగులు, చీరల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ప్రత్యేక సీమ కోసం ఉద్యమిస్తాం
* రైతు సేవా సమితి నేత సింగారెడ్డి
కడప (అర్బన్),జనవరి 17 : సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సమైక్యవాదులంతా ఉద్యమించాలని జిల్లా రైతు సేవా సమితి అధ్యక్షులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక వైఎస్సార్ ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాయలసీమ ప్రాంతం తీవ్ర నష్టపోతుందన్నారు. విభజన జరిగితే నీటి వాటాలో సీమకు అన్యాయం జరుగుతుందన్నారు. ఏర్పాలు వాదంతో తెలంగాణ నాయకులు ముక్త కంఠంతో ఘోషిస్తుండగా, రాయలసీమ ప్రాంత నాయకులు సమైక్యాంధ్ర కోసం స్పందించకపోవడం దారుణమన్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువత, విద్యార్థులు సంఘటితంగా పోరాడాలన్నారు. ఈ సమావేశంలో విద్యార్థి జె ఎసి నాయకులు రవిశంకర్‌రెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్ దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 15 వరకు కెసికి నీరివ్వండి
* అధికారులకు రెడ్యం వినతి
ఖాజీపేట, జనవరి 17 : కెసి కాలువ ఆయకట్టు కింద ఉన్న పైర్లను కాపాడుకునేందుకు వీలుగా ఫిబ్రవరి 15 వరకు నీరు ఇవ్వాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అధికారులను కోరా రు. గురువారం ఖాజీపేటలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ కెసి కాలు వ కింద వరి, పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ లాంటి పైర్ల ను దక్కించుకునేందుకు 15 వరకు నీరు వచ్చేలా అధికారులతో మాట్లాడాలని ఐదు మండలాల ప్రజలు తన దృ ష్టికి తెచ్చారన్నారు. అలగనూరు బ్యా లెన్స్ రిజర్వయర్‌లో 1 టిఎంసి, వెలుగోడు జలాశయంలో 8.5 టిఎంసిల నీరు ఉన్నందున ఫిబ్రవరి 15 వరకు నీరు ఇచ్చి రైతాంగాన్ని అదుకోవాలన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రాజె క్టు సిఇ మధుసూదన్ రావు, ఎస్‌ఇ సు ధాకర్, ఇఇ నారాయణతో చర్చించిన ట్లు తెలిపారు. దీంతో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి పైర్లను కాపాడేందుకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు. ఇకపోతే శ్రీశైలం, వెలుగోడు, అలగనూరు జలాశయాల్లో నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం, సిఎం అసమర్థత కారణంగా కెసి ఆయకట్టుకు ఖరీఫ్, రబీ పంటలకు నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఉన్న పైర్లను కాపాడే విషయంలో కెసి ఇంజనీర్లు మాట తప్పితే రైతాంగాన్ని సమీకరించి ఆందోళలను చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, పుల్లయ్యనాయుడు, ఖదీరుల్లా, శ్రీరాముల యాదవ్, భీముడు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
సోమిరెడ్డి ఎంపిక పట్ల హర్షం
నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని పోలిట్ బ్యూరో సభ్యునిగా ఎంపిక చేయడంపై రెడ్యం హర్షం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి తనకు అత్యంత ఆప్తుడని కష్టపడి పని చేసేవారని టిడిపి గుర్తిస్తుందని చెప్పడానికి ఆయన ఎంపికనే ఉదాహరణ అన్నారు. సోమిరెడ్డిని ఎంపిక చేయడంపై టిడిపి అధినేత నారాచంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

‘సహకార’ అక్రమాలపై
మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డిపై కేసు
* ఎస్పీకి ఫిర్యాదు.. వన్‌టౌన్‌లో కేసు నమోదు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 17 : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎన్నికల నమోదులో కడప మాజీ మేయర్, వైకాపా నేత రవీంద్రనాథ్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడని తెలుగుదేశం పార్టీ నేతలు, పెద్ద చెప్పలి గ్రామస్థులు గురువారం సాయంత్రం ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హాను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ఎస్పీ సమగ్ర విచారణ చేయాలంటూ కడప వన్‌టౌన్ పోలీసులను ఆదేశించారు. దీంతో పెద్దచెప్పలి గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవీంద్రనాథ్‌రెడ్డిపై 420, 473, 471, 468 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇకపోతే సహకార ఓట్ల నమోదులో రవీంద్రనాథ్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడని వెంటనే అరెస్టు చేయాలని టిడిపి ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి కమలాపురం నుంచి భారీ ఎత్తున టిడిపి నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్తత నెలకొంది. రవీంద్రనాథ్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటామని సిఐ షౌకత్ ఆలీ హామీ ఇవ్వడంతో నాయకులు, గ్రామస్థులు వెనుదిరిగారు. రవీంద్రనాథ్‌రెడ్డిపై ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. టిడిపి నేతల ఆందోళనతో పోలీసులు సత్వర చర్యలు తీసుకుని రవీంద్రారెడ్డిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
క్రికెట్ బుకీ అరెస్టు?
కొనే్నళ్లుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీలపై పోలీసులు నిఘా వేసి గురువారం ప్రొద్దుటూరులో బుకీని అదుపులోకి తీసుకుని ఆరు లక్షల రూపాయలతో పాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రొద్దుటూరు పోలీసులు బుకీ ఎవరనేది నిర్ధారించలేదు. బుకీతో పాటు మరికొంతమంది ఉండగా వారు పారిపోయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఎస్పీ మనీష్‌కుమార్ సిన్సా ఆరా తీయగా మిగిలి వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సంబంధిత పోలీసులు తెలిపినట్లు తెలిసింది.

జిల్లా కేంద్రంలోని
english title: 
c

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>