విజయవాడ, జనవరి 19: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తూర్పు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో (విజయవాడ - గుంటూరు మధ్య) ఏర్పాటైన శాతవాహన నగరంలో జరుగుతున్న హిందూ చైతన్య శిబిరంలో భాగంగా రెండో రోజైన శనివారం సాయంత్రం విజయవాడ, గుంటూరు నగర వీధుల్లో దాదాపు గంటన్నర సేపు వేలాది మంది గణవేషధారి స్వయం సేవకుల అద్భుతమైన రూట్‌మార్చ్ కనువిందుగా సాగింది. నగరాల ప్రధాన వీధుల్లో ఏకబిగిన గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఆర్‌ఎస్‌ఎస్ నిర్వాహకులు ఏక కాలంలో వేర్వేరు రెండు రూట్లలో ఈ మార్చ్ నిర్వహించారు. అయితే ఈ రెండు రూట్లులో కొనసాగే రూట్ మార్చ్‌లు మాత్రం విజయవాడలోని ఏలూరు రోడ్డు సీతాపురంలో ఒకే ఒక చోట కలిసి మళ్లీ విడిపోయేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసారు. ఈ కూడలిలో ఏర్పాటు చేయబడిన ఎతె్తైన వేదికపై నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ సంచాలకులు మానవీయ మోహన్ భాగవత్ స్వయం సేవకులందరికీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్త శిరస్సు వంచి నమస్కారం చేశారు. ఒక రూట్ మార్చ్ మొగల్రాజపురంలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ నుంచి సీతారాంపురం జంక్షన్ నుంచి పుష్పా హోటల్ సెంటర్ మీదుగా స్టేడియంకు చేరుకుంది. భారతీయ జనతాపార్టీ జాతీయ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి పుష్పాహోటల్ సెంటర్‌లోని వేదికపై నుంచి స్వయం సేవకులకు స్వాగతం పలికి తిరిగి స్వరాజ్య మైదానంకు చేరుకున్నారు. రెండో రూట్ మార్చ్ స్టేడియం నుంచి సీతారాంపురం జంక్షన్ మీదుగా స్వరాజ్యమైదానానికి చేరుకుంది. తెల్లచొక్కా, ఖాకీ నిక్కరు, తలపై నల్లని టోపి, చేతిలో కర్ర ధరించిన స్వయం సేవకులు ఎంతో క్రమశిక్షణతో నగరాల వీధుల్లో కదంతొక్కారు. భారత్‌మాతాకీ జై మాతరం... మాతరం... వందేమాతరం అనే నినాదాలు మార్మోగాయి. విజయవాడలోని రెండు రూట్ మార్చ్‌లలో అగ్రభాగాన డాక్టర్ కేశవరావు బలీరాం హెగ్డెవార్, మాధవ సదాశివ గోళవర్కర్ భారతమాత నిలువెత్తు చిత్ర పటాలతో కూడిన అందంగా అలంకరించబడిన వాహనాలు నిలిచాయి. దారి పొడవునా ఆర్‌ఎస్‌ఎస్ అభిమానులు తమతమ గృహాలపై నిలబడి స్వయం సేవకులపై పూలు జల్లుతూ ఆత్మీయ స్వాగతం పలికారు. ఇక ఈ రూట్ మార్చ్‌లను ఆసాంతం తనివితీరా తిలకించేందుకు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు తరలివచ్చారు. ఇక గుంటూరు నగరం విషయానికొస్తే పిచ్చుకలగుంట నుండి బిఆర్ స్టేడియం వరకు సుమారు 4 కిలోమీటర్ల దూరం వరకు ఎంతో క్రమశిక్షణతో ర్యాలీ సాగింది. సుమారు పది వేల మంది పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ బయ్యాజీ, అఖిల భారత ఆర్‌ఎస్‌ఎస్ మీడియా ఇన్‌చార్జి రామ్‌మాధవ్, భాగయ్య, ఓలేటి సత్యం, యుగంధర్, రవి, మూర్తి, నారాయణ పాల్గొన్నారు.
...................
విజయవాడలో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లో పాల్గొన్న స్వయం సేవకుల కవాతును పరిశీలిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మానవీయ మోహన్ భాగవత్ తదితరులు
................
సమాజ సేవకుల
సమాహారమే ‘సంఘ్’
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 19: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక మతానికి సంబంధించిన సంస్థ కాదని... ఈ సమాజం కోసం నిస్వార్థంగా సేవ చేసే స్వచ్ఛంద సేవా సంస్థ మాత్రమేనని బిజెపి జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో స్వయం సేవకుల రూట్ మార్చ్‌లో పాల్గొన్న ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నేడు సమాజంలో రుగ్మతలు పెరగటం అటుంచి రాజకీయాలు జుగుప్సాకరంగా మారాయన్నారు. వీటిపై వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేయాల్సి ఉందన్నారు.ఇక్కడ జరుగుతున్న హిందూ చైతన్య శిబిరంలో వేలాది మంది స్వచ్ఛందంగా తమ సొంత ఖర్చులతో వచ్చి పాల్గొంటున్నారన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తూర్పు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో (విజయవాడ - గుంటూరు మధ్య)
english title:
b
Date:
Sunday, January 20, 2013