విశాఖపట్నం, జనవరి 19: హైందువులంతా హైందవ ధర్మాన్ని కాపాడాలని శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి అన్నారు. విశాఖపట్నంలోని పోతినమలయ్యపాలెం శృంగేరీ శంకరమఠానికి చెందిన అంజనాద్రి గిరిపై శనివారం పలు ఆలయ సముదాయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఆది శంకరాచార్యుల ఆలయ నిర్మాణానికి, వేదపాఠశాల, కల్యాణ మండపాల నిర్మాణ పనులకు వేర్వేరుగా శంకుస్థాపనలు చేశారు. అనంతరం భక్తులనుద్దేశించి మహాస్వామి అనుగ్రహభాషణ చేశారు. భారతమాతను గౌరవించాలని, పరోపకారం చేయాలి తప్పితే ఎవరికీ అపకారం చేయరాదన్నారు. సనాతన ధర్మాన్ని, భారతీయ సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశంలో ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖ నగరం అన్నింటికీ ప్రశాంతమైన, ఆధ్యాత్మిక ప్రదేశంగా పేర్కొన్నారు.
భక్తులనుద్దేశంచి అనుగ్రహభాషణం చేస్తున్న భారతీ తీర్థ మహాస్వామి
* శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి
english title:
h
Date:
Sunday, January 20, 2013