Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

భద్రతా కారణాల దృష్ట్యా అక్బరును తీసుకురాలేం

$
0
0

నిజామాబాద్, జనవరి 19: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై చట్టపరంగా చర్యలు చేపట్టే విషయంలో ఆదిలాబాద్, సంగారెడ్డి పోలీసులు చూపుతున్న చొరవ నిజామాబాద్ జిల్లా పోలీసుల్లో కనిపించడం లేదు. నగర టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి పి.టి వారెంట్‌పై అక్బర్‌ను కస్టడీలోకి తీసుకుని ఈ నెల 19వ తేదీలోపు కోర్టులో ప్రవేశపెట్టేందుకు మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నాలుగు రోజుల క్రితమే అనుమతించింది. ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అక్బరుద్దీన్‌ను శనివారం ఇక్కడి కోర్టులో హాజరుపరుస్తారని అంతా భావించారు. భద్రతా ఏర్పాట్లు చక్కబెట్టాల్సి ఉన్నందున అక్బరుద్దీన్‌ను ప్రవేశపెట్టేందుకు తమకు 10 రోజుల గడువు కావాలని కోరుతూ కోర్టులో శనివారం టైమ్ గ్రాంట్ పిటిషన్‌ను దాఖలు చేసినట్టు తెలిసింది. అదనపు డిజిపి గోపాల్‌రెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నందున ఆ ఏర్పాట్లలోనే తలమునకలై ఉన్నామని పిటిషన్‌లో పేర్కొన్నట్టు సమాచారం. ఈ నెల 24వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ మెజిస్ట్రేట్ అమరావతి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎంఐఎం నేతకు పోలీసు కస్టడీ
ఆదిలాబాద్: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కేసులో రిమాండ్ ఖైదీగా వున్న ఎ-2 నిందితుడు, నిర్మల్ ఎంఐఎం నేత అజీంబీన్ యాహీయాను ఆదివారం పోలీసులు విచారణ నిమిత్తం తమ కస్టడీకి తీసుకోనున్నారు. 5 రోజుల కస్టడీ కోసం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన నిర్మల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ శనివారం ఒక రోజు కస్టడీకి అనుమతిస్తూ తీర్పునిచ్చింది.

ఖాద్రీపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు
ఆంధ్రభూమి బ్యూరో
కరీంనగర్, జనవరి 19 : మహాత్మగాంధీని కించపరిచేలా వ్యాఖ్యానించారన్న ఆరోపణలపై మజ్లీస్ ఎమ్మెల్యే అహ్మద్‌పాషా ఖాద్రీపై చర్యకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఖాద్రీ పై బిజెపి కోర్టును ఆశ్రయించడంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కరీంనగర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఖాద్రీపై సెక్షన్ 121 (ఎ), 124 (ఎ), 153 (బి), 500ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 17న కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలోని ఖాజీపుర పాఠశాలలో ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఖాద్రీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసిపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తుందని ఆరోపించారు. నిజాం కట్టిన అసెంబ్లీలో గాంధి విగ్రహం ఎందుకు పెట్టారంటూ దూషించినట్లు కరీంనగర్ బిజెపి నగర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఓఎంసి కేసులో మరింత
సమాచారం రాబడుతున్నాం!
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, జనవరి 19: ఓఎంసి కేసులో మరింత సమాచారం, సమగ్ర సమీక్ష కోసమే జిల్లాకు చెందిన మైనింగ్ అధికారులు, ఇతర సిబ్బందితో మాట్లాడినట్లు సిబిఐ లక్ష్మీనారాయణ చెప్పారు. శనివారం అనంతపురం నగరంలోని పోలీసు అతిథి గృహంలో మైనింగ్ శాఖ ఎడి, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఓఎంసి కేసులో జిల్లాకు చెందిన మైనింగ్ శాఖ అధికారులతో కొన్ని సమస్యలపై చర్చించడానికి, మరింత సమాచారం కోసం వారిని పిలిపించి మాట్లాడినట్లు తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు మిగిలిన అన్ని కేసుల్లో నిబంధనలకు అనుగుణంగా విచారణ కొనసాగుతోందని అన్నారు. రాజగోపాల్‌కు బెయిల్ కాపీ వచ్చిన తరువాత ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ కేసులకు సంబంధించి విదేశాలకు లేఖలు రాశామన్నారు. జిల్లాకు చెందిన మైనింగ్ శాఖ ఎడి, ఇతర సిబ్బందితో సమావేశమైన లక్ష్మీనారాయణ ఓఎంసికి సంబంధించి పలు రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. ఓఎంసికి చెందిన ఇనుప ఖనిజం తరలింపునకు సంబంధించిన అనుమతి పత్రాలు, రికార్డులను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది.
మహాబలిపురం బీచ్‌లో
ముగ్గురు గల్లంతు
నారాయణపేటటౌన్, జనవరి 19 : విహార యాత్రలో జరిగిన విషాదంలో ఇద్దరు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడు గల్లంతయ్యారు. తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం బీచ్‌లో చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా నాలుగు రోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట పట్టణంలోని లిటిల్ స్టార్స్ హైస్కూల్ యాజమాన్యం విద్యార్థులను విహార యాత్రకు తీసుకెళ్లింది. పట్టణానికి చెందిన టెన్త్ విద్యార్థి అఖిల్‌కుమార్, ఊట్కూర్ మండలానికి చెందిన కిషోర్‌కుమార్‌లు శనివారం సాయంత్రం మహాబలేశ్వరం బీచ్‌కు వెళ్లారు. కొట్టుకుపోతున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించిన టీచర్ సురేష్ సైతం గల్లంతయ్యారు. విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల రోదనలతో పాఠశాల పరిసరాలు మిన్నంటాయి.

* టైమ్ గ్రాంట్ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు * 24వ తేదీ వరకు అనుమతించిన కోర్టు
english title: 
b

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>