Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జపాన్‌తో వ్యూహాత్మక సహకారం అవసరం

$
0
0

అజేయశక్తిగా రూపొందే దిశగా దూసు కు వెళుతున్న చైనా...తూర్పు, దక్షిణ చైనా సముద్రాల్లో చమురు, ఖనిజాల నిల్వ లు అధికంగా ఉండే ప్రాంతంలో ఎనభైశాతం వరకు ప్రాదేశిక జలాలుగా తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నది. ఇందుకోసం తాను అతిముఖ్యమైన జాతీయ ప్రయోజనాలుగా భావిస్తున్న వాటి సాధన కోసం, నౌకాబలాన్ని చూపి భయపెడుతూ, మరోపక్క దౌత్యనీతిని ప్రయోగిస్తూ చుట్టు పక్కల దేశాలను తీవ్రస్థాయి ఒత్తిడికి లోను చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈప్రాంతంలోని దేశాలు.. చైనా చర్యలను వమ్ము చేయాలన్న దృక్పథంతో, ప్రతిచర్యలు తీసుకోవడానికి ఉద్యు క్తం కావడానికి యత్నించడం సహజ పరిణామం. అందులో భాగంగానే వియత్నాం, జపాన్ వంటి దేశాల చూపు భారత్ వైపు మళ్ళుతోంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో అవి భారత్‌ను తమ వ్యూహాత్మక భాగస్వామిగా చేసుకోవాలని ఉబలాటపడుతున్నాయి. హిందూమహాసముద్ర ప్రాంతం లో భౌగోళికంగా భారత్ ఆధిపత్యం వహించే స్థానంలో ఉంది. చైనాతో సహా ఆసియా పసిఫిక్ దేశాలకు చెందిన ఇంధన రవాణా నౌకలు ప్రయాణించడానికి ఇదే మార్గమైన నేపథ్యంలో, వాటి భద్రతకు భారత్ హామీ ఇవ్వగలదు. ఫలితంగా ఆయా దేశాలు వాణిజ్య సరకులు, ఇంధన దిగుమతులకు తప్పనిసరిగా భారత్‌పై ఆధారపడక తప్పదు. ఇదే సమయంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారత ప్రయోజనాల విషయం కూడా వాటికి బాగా తెలుసు. ఎందుకంటే యాభైశాతం వరకు భారత్ వాణిజ్యం ఈ ప్రాంతంగుండానే జరుగుతోంది మరి. ఇదే సమయంలో పెరుగుతున్న భారత నౌకాదళ శక్తిపై కూడా వారికి స్పష్టమైన అవగాహన లేకపోలేదు. ఈ కారణంగా హిందూమహా సముద్రం, ఆసి యా పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి సుస్థిరతలు నెలకొనడానికి భారత్ దోహదకారి కాగలదని అవి భావిస్తున్నాయి.
చారిత్రకంగా పరిశీలిస్తే భారత్-జపాన్ దేశాల మధ్య మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం అవి మరింత గాఢంగా విస్తరించా యి. ప్రస్తుతం భారత్-చైనాల మధ్య వార్షిక వాణిజ్యం విలువ 74 బిలియన్ డాలర్లు! మరి మనదేశం జపాన్‌తో జరిపే వాణిజ్యం కేవలం చైనాతో జరిపే వర్తకంలో 15శాతం మాత్రమే! గత ఇరవైఏళ్ళ కాలంలో జపాన్...చైనాలో వందల బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఇవన్నీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) కింద పెట్టినవే! కానీ ఇదే సమయంలో అణు విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన యంత్రాలను మనదేశానికి అందించడానికి జపాన్ ససేమిరా అంటోంది. కానీ వేగంగా మారుతున్న తాజా పరిణామాల నేపధ్యంలో భారత్-జపాన్‌లు వ్యూహాత్మక భాగస్వాములు అయ్యే దిశగా అడుగులు ముందు కు వేయగలవని ఆశించచవచ్చు. గత దశాబ్దంలో రెండు దేశాలకు చెందిన నాయకుల పరస్పర పర్యటనలు చోటు చేసుకున్నాయి. నేడు చైనా స్థూల జాతీయోత్పత్తి (జిడిపి), జపాన్ జిడిపి కంటే ఐదు ట్రిలియన్ డాలర్లు అధికం! ఇక చైనా నావికాదళం, దక్షిణ, తూర్పు చైనా సముద్ర ప్రాంతంపై తన ఉక్కు పిడికిలిని క్రమంగా బిగిస్తూ వస్తోంది. ప్రస్తు తం జపాన్ ఆధీనంలో ఉన్న ఎనిమిది శంకా కు దీవులు తమవేనంటూ చైనా కొత్త వాదన లేవదీయడంతో, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే జపాన్ నూతన ప్రధాని షింజో అబె.. వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం భారత్‌వైపు చూస్తున్నారు.
అబెకు చాలా ఆసక్తికలిగించే నేపథ్యముంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్‌పై, అబె నేతృత్వం వహిస్తున్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఘన విజయాన్ని సాధించడంతో..ఆయన దేశ ప్రధానిగా 2012, డిసెంబర్ 12న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు అబె అంతకు ముందు 2006-07 మధ్యకాలంలో కూడా దేశ ప్రధానిగా పనిచేసిన అనుభవం ఉన్నది. తాను అతి తక్కువ కాలమే పదవిలో కొనసాగినా, భారత్‌తో స్నేహ సంబంధాలను కొనసాగించడానికే ప్రాధాన్యతనిచ్చారు. ము ఖ్యంగా, అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్‌లు కలిసి ‘చతుష్పాక్షిక’ గ్రూపుగా ఏర్పడాలని ఆయన ప్రగాఢంగా వాంఛించారు. ముఖ్యంగా చైనా దూకుడును అడ్డుకోవాలంటే ఇది చాలా అవసరమని ఆయన భావించారు. ప్రస్తుతం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత..ఆయన తీసుకోబోయే ముఖ్య నిర్ణయాలు..మొదటిది రక్షణ బడ్జెట్‌ను పెంచడం (ప్రస్తుతం అది స్థూల జాతీయోత్పత్తిలో కేవలం ఒక్కశాతం మాత్రమే ఉంది). ఇదే సమయంలో అమెరికా, భారత్‌లతో స్నేహ సంబంధాలను కొనసాగించడం. ఇప్పటి వర కు జపాన్ రక్షణ వ్యవస్థను కేవలం స్వీయ రక్షణకు మాత్రమే పరిమితం చేశారు. దీన్నిపూర్తి స్థాయి సైనిక శక్తిగా మార్చాలంటే, రాజ్యాంగాన్ని సవరించక తప్పదు. మరి రాజ్యాంగ సవరణ చేస్తారా? చేయరా? అనే అంశంపై జపాన్‌లో పూర్తిస్థాయిలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చైనాను నియంత్రించాలంటే జపాన్, తన రక్షణ దళాలను పూర్తి స్థాయి సైనిక శక్తిగా మార్చక తప్పదు. ఇదిలావుండగా తనకు తానే స్వీయ పరిమితులు విధించుకున్న జపాన్..్భరత్‌తో తన సంబంధాలను మెరుగు పరచుకోవడానికి ఏం చేస్తుందనేది వేచిచూడాల్సిందే! ఇప్పటికే జపాన్, ఢిల్లీ-ముంబయి క్యారిడార్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీనికి మొత్తం నాలుగు బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. అంతే కాకుండా భూమిలో అరుదుగా లభించే లోహాలను వెలికి తీయడంలో భారత్‌కు సహకరించడానికి కూడా అంగీకరించింది. అయితే ఈ లోహాలను తిరిగి మనదేశం జపాన్‌కు ఎగుమతి చేయాల్సి ఉంటుం ది. 2012 ఆగస్టు 1న భారత్-జపాన్‌ల మధ్య సమగ్ర భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని ప్రస్తుతం ఉన్న 12 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి మరింత ఉచ్ఛస్థాయికి చేరుకోవడానికి ఈ ఒప్పందం దోహదం చేయగలదు.
రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా దృఢతరం చేసేది ఎఫ్‌డిఐ. జపాన్ ఒక ట్రిలియన్ డాలర్ల రిజర్వ్‌ను కలిగివుంది. ప్రస్తుతం మనదేశంలో జపాన్ ప్రత్యక్ష పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని మరింతగా పెంచేందుకు జపాన్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. భారత్‌లో రోడ్లు, నౌకాశ్రయాలు, నౌకానిర్మాణం, యార్డుల మరమ్మతులు, రైల్వేలు వంటి వౌలిక సదుపాయాల రంగంలో జపాన్ కొన్ని వందల మిలియన్ డాలర్ల మేర వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టినట్టయితే, అది కునారిల్లుతున్న భారత వౌలిక రంగం జవజీవా లను సంతరించుకుంటుంది. అంతే కాదు రెండు దేశాలు అంతరిక్ష పరిశోధనల్లో కూడా పాలు పంచుకోవచ్చు. మానవ సహిత ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపే కార్యక్రమాలకు తెరలేపవచ్చు. భారత్ ఇప్పటికే 2015 నాటికి మానవ సహిత వ్యోమనౌకను అంతరిక్షంలోకి ప్రయోగించాలని, 2020 నాటికి మానవులను చంద్రుడిపైకి పంపాలని యోచిస్తున్నది.
ఇక సైనిక సహాయం కొంచెం సంక్లిష్టతతో కూడినదే. ఒకవేళ ఈ రంగంలో తనవద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు అందజేయాలని జపాన్ భావించినా..అందులో చాలా పరికరాలు దిగుమతి చేసుకున్నవే కావడం ఒక పెద్దలోపం. అయితే రెండు రం గాల్లో భారత్‌కు జపాన్ ఎగుమతులు చేయవచ్చు. దేశీయంగా అభివృద్ధి పరచిన జలాంతర్గాములు, సముద్ర విమానాలు. తాజాగా జపాన్ వీటిని మరింత ఆధునికంగా తీర్చిదిద్దింది. అటువంటి ఆధునికమైన జలాంతర్గాముల్లో 2950-టన్నుల సొరయు తరగతికి చెందిన జలాంతర్గామి. దీన్ని 2009లో జపాన్ నావికాదళంలో ప్రవేశపెట్టారు. వీటిల్లో జపాన్ అత్యాధునిక సెన్సార్లను, ఆయుధాలను అమర్చింది. గాలితో పనిలేకుండా స్వతంత్రంగా పనిచేసే చోదక వ్యవస్థ వీటిల్లో ఏర్పాటు చేసింది. దీనివల్ల ఈ జలాంతర్గాములు పూర్తిగా 15-20 రోజుల పాటు పూర్తిగా నీటిలోనే ఉండగలవు. దీనికి తోడు ఏటా ఒక జలాంతర్గామిని జపాన్ ఉత్పత్తి చేస్తోంది. నిజంగా ఇది అత్యధిక ఉత్పాదక సామర్ధ్యం. మామూలు జలాంతర్గాములు ప్రతి రెండు మూడు రోజులకోమారు నీటి ఉపరితలం పైకి వచ్చి వాటి చోదక వ్యవస్థను ఆమ్ల బ్యాటరీల సహాయంతో చార్జింగ్ చేసుకుంటాయ. మజగాన్ డాక్ లిమిటెడ్ (ముంబయి), ప్రాజెక్టు-75 కింద నిర్మిస్తున్న స్కార్పీన్ జలాంతర్గామిని అందజేయడంలో ఇప్పటికే ఐదేళ్ల ఆలస్యం జరిగింది. ఈ నేపథ్యంలో జలాంతర్గాముల తయారీలో జపాన్ విధానానే్న భారత్ అనుసరించడం ఎంతో ఉత్తమం. ఒకవేళ భారత్‌తో వ్యూహత్మక సహకారాన్ని అభివృద్ధి చేసుకోవాలని జపాన్ భావించినట్లయితే..సొర్యు- తరగతి జలాంతర్గాములను, సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపుతో సహా భారత్‌కు అందజేయవచ్చు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ తన స్వంతంగా సముద్రంపై పోరాట విమానాలను తయారు చేసుకుటోంది. వీటిల్లో తాజా రకం ‘షిన్‌మేవా యుఎస్-2’ విమానాలు. ఇవి అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగసి పడుతున్నా, సముద్రంపై వాలగలవు. అంతే కాకుండా 4500 కిలోమీటర్ల గరిష్ట దూరం వరకు, ముప్పై మందిని, ఒక టన్ను సామగ్రిని మోసుకొని పోగల సామర్ధ్యం వీటి స్వంతం. ఇటువంటి విమానాలు సముద్రంలో అనే్వషణకు, రక్షణ చర్యలు చేపట్టడానికి ఎంతో ఉపయోగకరం. మన దేశానికి చెందిన అతి విస్తారమైన ఆర్థిక మండలానికి, 1197 ద్వీపాలకు సైనికపరంగా వ్యూహాత్మకమైన మద్దతు ఈవిమానాల ద్వారా లభిస్తుంది. అంతేకాదు పైరసీలను సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి, సు నామీ వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయ కార్యక్రమాలకు ఇవెంతగానో ఉపయోగకరం.
మరి ఇన్ని సహాయాలు అందిస్తున్న జపాన్‌కు మన దేశం వల్ల ఒనగూడే ప్రయోజనమేంటి? బలీయమైన నేవీ, ఐసిజి కలిగిన భారత్ భౌగోళికంగా, వ్యూహాత్మకంగా కీలకమైన స్థానంలో ఉంది. జపాన్ వాణిజ్య నౌకలు, చమురు, వంటి వాటికి హిందూ మహాసముద్రంలో భారత్ గట్టి భద్రతనివ్వగలదు. అదీకాకుండా భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగివుంది. జపాన్ మనదేశంతో ఏర్పరచుకునే సంబంధాలను కేవలం చైనా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకున్నవి కాదు. రెండు దేశాల మధ్య వర్తక, వాణిజ్యాల పరంగా సహాయ సహకారాలు పెంపొందటానికి మాత్రమే! అదీ కాకుండా చారిత్రకంగా రెండు దేశాలు మంచి మిత్రులు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వృద్ధి
చేసుకోవడానికి ఇదే తగిన సమయం!

అజేయశక్తిగా రూపొందే దిశగా దూసు కు వెళుతున్న చైనా..
english title: 
j
author: 
- అరుణ్ కుమార్ సింగ్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>