శాకాహార జంతువుల్లో- అతి పెద్ద జంతువులు- ఏనుగు, ఖడ్గమృగం, జిరాఫీలు. మనకి నిత్య జీవితంలో జిరాఫీ, ఖడ్గమృగం తగలవ్- గానీ, ‘ఏనుగమ్మ’ మాత్రం- మనకీ, పిల్లలికీ కూడా ఆహ్లాద హేతువు- ఎన్నిసార్లు చూసినా- ఆనందాన్నిచ్చే మహాకాయం యిదే.
ఎప్పటి ఏనుగు? ఐతిహాసిక కాలంనుంచీ వున్నదీ ఏనుగు. చరిత్రలో సరేసరి. అలెగ్జాండర్‌ని- పురుషోత్తముడు- ఏనుగు మీద ఎక్కి, ఎదిరించి పోరాటం సాగించాడు, పేర్గాంచిన ప్రతీ దేవాలయానికీ ఒకటి- కొన్ని పెద్ద దేవస్థానాలకి- ఉదాహరణకి- టి.టి.డి. లాంటి వాటికి ఒకటికన్నా ఎక్కువ- ఏనుగులు వుంటాయి కూడా. ఏనుగంటే ఏనుగా? ఔను! ఏనుగే...
అన్నీ బాగున్నాయ్ కానీ- పేచీ అంతా రుూ మత్త్భాలకి మదం ఎక్కినప్పుడే వస్తుంది. ‘నగము’అంటే- ఏనుగు, కొండ అని రెండు అర్థాలు వున్నాయంటారు. అందుకేనేమో- కోపం వచ్చి- ‘మస్తు’లో వున్న ఏనుగుని అడ్డుకోవాలంటే- వో సైన్యం లాంటిది రావాల్సిందే. ఐతే ‘మావటి’ అని ఒకడుంటాడు. ఈ మావటీ మాట మాత్రం వింటుంది ఏనుగు. దానికి వినికిడి, తెలివితేటలూ కూడా చాలా ఎక్కువ.
దేశం మొత్తంమీద ఏదోచోట, ‘‘ఏనుగులు- గ్రామాల మీద పడి జనాల్ని మట్టేస్తున్నాయి’’- అన్న వార్తలొస్తున్నాయి. ‘హైవే’మీద ‘రాస్తారోకో’- అంటూ, ఓ నాలుగు- ‘కాళ్లొచ్చిన నల్లగుండు’ల్లాగ- దారికడ్డంగా ఇలా నిలబడితే- బుల్‌డోజర్లయినా- తోక ముడవాల్సిందే. ‘‘పొలాల మీద పడతాయండీ బాబూ- యివి’’ అని రైతుల గోల.
ఏనుగుల మీద చెప్పుకుంటూ మనం యిప్పుడు శ్రీకాకుళం జిల్లాకి వచ్చేశామండీ! దొంగ నాటుసారా కాచే ‘‘చిక్కోలు’’ జిల్లా గిరిజనులు- బెల్లం ఊట నుంచి - సారాకాయడంలో - ఎక్స్‌పర్ట్స్. వీళ్ల ‘్భట్టీ’ల- ‘అడ్డా’ల మీద ఎక్సైజుశాఖ అధికారులు- ఒక పద్ధతి ప్రకారం - ఒకసారీ- అధికారికంగా మరోసారీ- ‘ఫ్రెండ్లీ’గా యింకోసారీ- యిలా అలా రకరకాలుగా ‘దాడులు’చేస్తూంటారు. ఈ ‘రైడ్స్’యొక్క వైనం- దొంగసారా రాయుళ్లకి ముందే తెలుస్తుంది. కానీ- యిటీవల రుూ ప్రాంతంలో- ‘‘కొత్తగా నాన్ యూనిఫారం ‘‘యిన్‌పెట్టర్లు వొచ్చేత్తన్నారండీ బావ్!’’ అంటూ దీనంగా మొహంపెట్టి చెప్పాడో సారానాయుడు.
‘‘మడుసులైతే మన మాట అరదం అవుతాదండి- కానీ దున్నపోతుముండా ఏనుగులకేటి సెప్తావొండీ?’’అంటున్నారు సారా వంట చేస్తున్న- ఘరానా శాల్తీలు.
‘‘ఎవరయ్యా? అంత చేటు రాక్షసులు? లంకనుండి గానీ వచ్చేత్తన్నారేంటి?’’అంటే- కాదు బావ్! సుట్టుపట్లనున్న అడవుల్లోనుంచే- దరిజాగా వచ్చి, మొత్తం సారా జుర్రేత్తన్నాయండీ. పోనీ, తాగేసి, దొబ్బేస్తాయా? అంటే అదీ నేదు. అడ్డం రానివోటినీ- వచ్చినోటినీ కూడా కుమ్మేత్తన్నాయండీ!’’అంటూ ఠారెత్తిపోతున్నారు- చిక్కోలు గిరిజన బృందం.
2007నుంచి- రుూ ప్రాంతంలో ఏనుగుల వినోదానికి పదమూడు మంది జనం బలైపోయారు. రాష్ట్ర ప్రభుత్వం - ‘‘పోనీలే దొంగసారా భట్టీల్ని నాశనం చేస్తున్నాయి కదా,’’అని వూరుకోలేదు. ‘ఆపరేషన్ గజ’ అంటూ, ఓ సాయుధ దండుని తయారుచేసింది గానీ- రుూ ఆపరేషన్‌కి ఏనుగుల ‘కోపరేషన్’ మాత్రం చిక్కలేదు.
జుంబోలకి ‘ఒడుంబా’అంటే పిచ్చి. అవి ‘సారా కొట్టడం’ మరిగాయ్. వాటి తొండం చివరనున్న నాసికా పుటాలు చాలా పవర్‌ఫుల్. రెండు కిలోమీటర్ల దూరంనుంచే అవి- ‘‘వాసన...వాసన’’ - అంటూ సారా భట్టీల మీదికి- సైనికోత్సాహంతో వచ్చి పడతాయ్. భూమి లోపల త్రవ్వి పాతిన సరుకును కూడా- పైకెత్తుకుని- మొత్తం నాటుసారాని- ఫూటుగా జుర్రేస్తాయ్.
ఒరిస్సా అడవుల్లోనుంచి ఓ ఏనుగుల ‘తండా’కొంతకాలం క్రితం దారితప్పింది. దారి తప్పిందా? లేదు.. లేదు... ‘ఒడుంబా’ వాసనకి బానిసలైపోయాయ్- రుూ ‘‘చతుష్పాద నడగొండలు’’. అరటిపళ్లు, జీడిపప్పులు- లాంటివి - ‘మంచింగ్’ (నంజుడుగా) వీటికి! శిఖాకుళం, విజయనగరం జిల్లాల్లో గ్రామాలకి గ్రామాలే- రుూ ‘ఏనుగు మందుభాయ్’లతో అల్లాడిపోతున్నాయ్.
సాధారణంగా- ఏనుగులు ‘దారి’మర్చిపోవు. ఎంతటి కీకారణ్యంలోనుంచి వచ్చినా- తిరిగి, తమ ‘బస’కి చేరుకోగలవు. గానీ, మందుకొట్టేస్తేనే చిక్కు. ఊళ్లమీద పడతాయ్.
ఒరిస్సాలోని ‘లఖేరీ’ అడవులలోనుంచి- ఓ పదకొండు ఏనుగుల మంద- దారితప్పింది. ఆరేళ్లయింది- వీటి బెడద మొదలయి.
‘‘ఏనుగులొస్తున్నాయ్. జాగ్రత్త!’’అంటూ జనాలు కకావికలైపోతారు. ఈ పదకొండు గజరాజుల్లో నాలుగు మరణించాయ్. రెండు కేవలం ‘ఉడుంబా’దెబ్బకే జబ్బుచేసి, బలిఐనాయ్- కాగా, వో గజం- విద్యుత్‌ఘాతంతో గోపాలపురంవద్ద పోయింది. పాపం! ఇక మిగిలిన నాలుగున్నాయ్- అవి అన్నీ ‘ఏనుగమ్మలే’! గానీ, ఒక్కో జంతువూ నలభై లీటర్ల నాటుసారా లాగించేస్తాయ్. అలవాటయిపోయింది- వాటి ఆరోగ్యం చెడిపోయింది. మొదట్లో నీళ్లు త్రాగి పోయే రుూ మత్తశుండాలాలు పక్కా ‘సారాభాయ్’లు ఐపోయాయ్. ఏనుగుల దాడి దృష్ట్యా- ఎనుగులను సారా దెబ్బనుంచి కాపాడడంకోసం అయినా- రుూ దొంగసారా భట్టీలకి కళ్లెం వేయాలంటూ- సాంఘిక ఉద్యమాలు కూడా లేస్తున్నాయ్- కానీ - ఈ ఏనుగుల మందు మోజు- అన్నిచోట్లా వుందిట...
మైసూర్ దసరా ఉత్సవాలలో- ముప్ఫైనుంచీ నలభై లీటర్ల లిక్కర్ చొప్పున ఒక్కో ఏనుగు లాగించేస్తాయని- అక్కడి ఏనుగుల ఆఫీసర్ చెప్పాడు. పడమటి కనుమల ప్రాంతంలో ఏనుగులు- పరమ తాగుబోతులు. కానీ, యిక్కడ ‘‘అంతగా- తాగుబోతులు కావుండి. కాకపోతే- తాగితే ఏనుగులు కావుండీ- రాక్షసులే’’నన్నాడు పాలకొండలో ఓ గిరిజనుడు.
‘డజ్ హీ మీన్ ‘గజాసురాస్?’...
శాకాహార జంతువుల్లో- అతి పెద్ద జంతువులు-
english title:
e
Date:
Monday, January 21, 2013