విడాకులను సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడాకుల చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టడం దురదృష్టకరం. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన వివాహ వ్యవస్థ మన దేశంలో వుంది. అన్ని మతాలతోనూ కలిసి జీవించే వైవాహిక వ్యవస్థ పట్ల భారతీయులు మక్కువ చూపుతారు. పాశ్చాత్య నాగరికత ప్రభావంవల్ల జీవితాల్లో వేగం పెరిగి మమతానుబంధాలను విస్మరించి, ఇన్‌స్టెంట్ ప్రేమలు పెళ్లిళ్ల వెనుక పరుగులు తీస్తోంది యువతరం. సర్దుబాటు ధోరణి లేక చిన్న విషయాలకే కలహించుకుంటూ విడాకులు తీసుకుని విడిపోవటానికి నేటి జంటలు ప్రాధాన్యతనిస్తున్నాయి. అత్యంత పవిత్రమైన వైవాహిక వ్యవస్థ మనుగడకే ముప్పు ఏర్పడుతున్న ఈ తరుణంలో ఒక్కొక్క కేసునుబట్టి శీఘ్రంగా మంజూరు చేయాలా అన్నది నిర్ణయించాలి గాని, అన్ని జంటలకు దరఖాస్తుచేసిన వెంటనే విడాకులు మంజూరుచేయటం మంచిది కాదు.మేధావివర్గం ఈ బిల్లును మొత్తంగా వ్యతిరేకించాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
కఠినంగా శిక్షించాలి
రాజధాని ఢిల్లీలో జరిగిన అత్యాచార సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం యావత్ దేశాన్ని ఎంతో కలచివేసినా... ఇంకా కామాంధుల పైశాచికత్వానికి తెరపడకపోవడం దురదృష్టకరం. రాష్ట్ర హోంశాఖ మంత్రి నియోజకవర్గ పరిధిలో మరో అబల అత్యాచారానికి గురై హత్యచేయబడటం ఘోరం. రోజూ ఎక్కడో... ఎక్కడెక్కడో ఎందరో అమ్మాయిలు ఈ అత్యాచార మహమ్మారికి బలౌతున్నారు. న్యాయస్థానాలు అత్యాచారం చేసిన వారినెవరినైనా ‘మరణ దండన’ అంటూ బహిరంగంగా అందరి సమక్షం లో ‘ఉరి’తీస్తే... ఆ భయానికైనా అమ్మాయిల జోలికి వెళ్ళరేమో! ఆలోచించండి!
- ఈ.వేమన, శ్రీకాకుళం
ఇంకెన్నాళ్ళీ నిరీక్షణ?
ఎయిడెడ్ డిగ్రీ కలేజీల సిబ్బంది చిరకాల వాంఛ నెరవేర్చడానికిగాను కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్, ఎ.పి.హైదరాబాద్ వారు ఔ్యళఒ.్గళ.్య.1251/ జూౄశ. ని3/2008, 19.1.2009 తేదీతో సంబంధిత రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారిని తమ పరిధిలోని ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తూ, రాబోవు 5 సంవత్సరాలలో ఉద్యోగ విరమణ చేయబోవు అధ్యాపకేతర సిబ్బందికి చెల్లించదగు ఇ.ఎల్. ఎన్‌క్యాష్‌మెంట్ వివరాలను కోరడం, అన్ని కళాశాలలవారు పంపి నాలుగేళ్ళు పూర్తికావస్తుంది. దాదాపు రెండు సంవత్సరాలు ఆ ఫైల్‌కు మోక్షం కలగకపోవడంతో, ముఖ్యమంత్రి శ్రీ కిరణ్‌కుమార్‌రెడ్డిగారికి వినతిప్రతాలు సమర్పించాం. ఆయన చొరవతో కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వారిని తమ సిఫారసులను ప్రభుత్వానికి వెంటనే పంపమని ళ్యౄ యో.3198/్ళఉ.నిని1/20093, జూఆ.10. 10.2011 యచి హజదళూ ఉజూఖష్ఘఆజ్యశ (్ళఉ.నినిని1) ళఔఆ. ధ్వారా కోరడం జరిగింది. వీరు ఆలస్యంగానైనా 2012 ద్వితీయార్థంలో ప్రభుత్వానికి తమ సిఫారసులు పంపినట్లుగా తెలియవచ్చింది. ఆ ఫైలు పరిస్థితేంటో తెలియడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికార్లు ఫైలుకు త్వరగా మోక్షం కల్పించాలి. ఇప్పటికే ఏళ్ళు గడిచిపోయ ఇబ్బం దులు పడుతున్న ఎయడెడ్ డిగ్రీ కళాశాలల సిబ్బందికి తగిన న్యాయం చేయాలి.
- ఆశం సుధాకర్‌రావ్, గూడలి
రోగాలను నివారించాలి
ఈ ఏడాది లక్ష కోట్లకి చేరుకున్న ఫార్మా పరిశ్రమ ఏడేళ్ళలో రూ.5 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా? ఔషధాలను ఎలా ఎక్కువ అమ్మాలి? అంటే రోగాలు ఎలా పెరగాలీ అనేవిధంగా ప్రభుత్వ ఆలోచనా విధానం సాగుతోంది. నివారణ కొరకు చూడాల్సిందిపోయి ప్రజల ధన, ప్రాణాలతో వ్యాపారం చేయాలనే ఆలోచన అర్ధరహితం. రోగాలను నివారించే ప్రయత్నం చేయాలి తప్ప ఆదాయ వనరుగా చూడకూడదు.
- యన్.వీరభద్రరావు, గొల్లపాలెం
విడాకులను సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడాకుల చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టడం దురదృష్టకరం.
english title:
v
Date:
Monday, January 21, 2013