హైదరాబాద్, జనవరి 21: రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు సుస్థిర పాలనను అందించిన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును విమర్శించే ఎంపి లగడపాటి రాజగోపాల్‌కు లేదని గ్రేటర్ కౌన్సిల్ టిడిపి ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్లు రాజ్‌వౌళిగౌడ్, సామప్రభాకర్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డిలు వ్యాఖ్యానించారు. సోమవారం చంద్రబాబుపై లగడపాటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గ్రేటర్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ తన స్వప్రయోజనాల కోసం మరోసారి బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, గ్రేటర్‌లో ఉన్న 44 మంది కార్పొరేటర్లంతా ఏకమై, తమ కార్యకర్తలతో లగడపాటిని నగరంలో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి వరకు దాదాపు 1700 కి.మీల పాదయాత్ర పూర్తి చేసిన బాబుకు కనువిప్పు కల్గిస్తామని లగడపాటి వ్యాఖ్యానించటం ఆయన స్థాయికి తగదని వారు పేర్కొన్నారు. లగడపాటికి దమ్ముంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, హైదరాబాద్ అంశంపై తమ పార్టీ అధినేత సోనియాగాంధీ, జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలను వారి స్పష్టమైన వైఖరిని అడగాలే తప్పా, చంద్రబాబును విమర్శించటం సబబు కాదన్నారు. కాంగ్రెస్ అధిష్టానం మెప్పు పొందేందుకు స్థాయిని మించి కామెంట్లు చేయరాదని రాజగోపాల్‌కు హితవు పలికారు. గతంలో కూడా సమైఖ్యాంధ్ర నినాదంతో దీక్ష చేపట్టి, మరుసటి రోజు నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో కన్పించి హల్‌చల్ సృష్టించిన సంఘటనను గుర్తుచేస్తూ ఇలాంటి చీఫ్ ట్రిక్కులు మానుకోవాలని ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లు సూచించారు.
* అనుచిత వ్యాఖ్యలు చేస్తే గ్రేటర్‌లో తిరగనివ్వం
english title:
b
Date:
Tuesday, January 22, 2013