హైదరాబాద్, జనవరి 21: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత ప్రాతిపదికన చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రోరైలును శివార్లకు కూడా విస్తరించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెల్సింది. ఇప్పటికే నగరంలో నిత్యం రద్దీగా ఉండే వివిధ ప్రాంతాల మీదుగా శివార్లలోని శిల్పారామం, ఎల్బీనగర్, నాగోల్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ దాదాపు 70కి.మీ.ల పొడువున మూడు కారిడార్లుగా ఏర్పాటవుతున్న మెట్రోరైలు పనులు గత కొద్దిరోజులుగా ఊపందుకున్న సంగతి తెల్సిందే. ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) ప్రాతిపదికన ఏర్పాటవుతున్న మొట్టమొదటి ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును శివార్లలోని ఔటర్‌రింగ్‌రోడ్లకు అనుసంధానం చేస్తూ, అలాగే శివార్లలోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వరకు విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెల్సింది. అయితే ప్రస్తుతం నగరంలో జరుగుతున్న హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించి ఎనిమిదేళ్లక్రితం రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం రూ. 14వేల 132 కోట్ల అంచనాలతో ఎల్ అండ్ టి కన్సార్టియాకు అప్పగించిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై విన్పిస్తున్న ఊహాగనాల ప్రకారం భవిష్యత్తులో ఒకవేళ హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేసి, దానికి మెట్రోబాద్‌గా నామకరణం చేస్తారన్న వాదనలు విన్పిస్తున్నందున, అప్పటి అవసరాలకు అనుగుణంగా ఆధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే అంశంపై ఇప్పటికే సర్కారు దృష్టి సారించిందని చెప్పవచ్చు. అయితే శివార్లలో మున్ముందు పెరగనున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే అధ్యయనం చేసి ప్రతిపాదనలు తయారు చేసి, అంచనాలను రూపొందించాలని సర్కారు భావిస్తున్నట్లు తెల్సింది. అంతేగాక, శివార్లలోని నాగోల్, శిల్పారామంల వరకు ఏర్పాటు కానున్న మెట్రోరైలును అక్కడి నుంచి శివార్లకు అనుసంధానం చేసేందుకు కొంత దూరం మాత్రమే కారిడార్లను నిర్మించాల్సి ఉంటుందని, ప్రస్తుత మూడు కారిడార్ల నిర్మాణానికి అయ్యే వ్యయం కన్నా శివార్లకు అనుసంధానం చేయనున్న మెట్రోరైలు అంచనాల విలువ తక్కువగా ఉండవచ్చునని తెల్సింది. అయితే శివార్లలో ఏఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ప్రస్తుతం ఎక్కువ ఉంది? మున్ముందు ఏ ప్రాంతాలకు ఈ సమస్య తీవ్రమవుతుందన్న విషయంపై ఫీజిబిలిటీ అధ్యయనం నిర్వహించేందుకు సర్కారు ఆదేశించినట్టు తెల్సింది.
మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు
english title:
t
Date:
Tuesday, January 22, 2013