విజయనగరం (కంటోనె్మంట్), జనవరి 21: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు చేపట్టిన నేటి కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టే పికెటింగ్‌ను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద సోమవారం పికెటింగ్ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపుతో పారిశ్రామిక రంగం కుంటుపడి, ఉపాథి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. గృహ, వ్యాపార బిల్లులు ఒకటికి రెండు రెట్లు పెరిగిపోవడంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మూడేళ్లలో 18 వేల కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంచిన ప్రభుత్వం ఏప్రిల్ ఒకట్నుంచి మరో 12 వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని వేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదన చేస్తోందని, ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కె.సన్యాసిరావు, బెహ్రా శంకర్రావు, రెడ్డి శంకర్రావు, జగన్మోహన్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
‘మద్యం బెల్టు దుకాణాలను
తొలగించండి’
విజయనగరం (టౌన్), జనవరి 21: తమ గ్రామంలో అక్రమంగా నడుపుతున్న మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులను పలుమార్లు కోరినప్పటకి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ నెల్లిమర్ల మండలం టెక్కలి గ్రామానికి చెందిన మహిళలు సోమవారం కలెక్టరేట్‌లో ఆందోళన జరిపారు. మహిళలంతా మూకుమ్మడిగా డిఆర్వోకి వినతిని ఇచ్చారు. అనంతరం మహిళ సంఘాల నాయకులు కె.రూప, ఆదిలక్ష్మిలు మాట్లాడుతూ గ్రామంలో మద్యం దుకాణాల వల్ల భర్తల సంపాదనంతా మద్యానికి ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలను నాశనం చేస్తున్న మద్యాన్ని గ్రామంలో లేకుండా చేసేందుకు తామంతా తీర్మానించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు బెల్టు షాపులను ఎత్తివేయాలని అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
అందరి దృష్టి గాజులరేగ సొసైటీ పైనే!
విజయనగరం (్ఫర్టు), జనవరి 21: జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాథాన్యత సంతరించుకున్న గాజులరేగ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంపై అందరి దృష్టి పడింది. ఈ సొసైటీ నుంచే అధ్యక్షుడిగా ఎన్నికైన పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంచలంచెలుగా రాష్టస్థ్రాయి నాయకుడిగా ఎదిగారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌గా వ్యవహరించిన బొత్స సత్యనారాయణ ఈ సొసైటీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. దీంతో జిల్లా నేతల దృష్టి ఈ సొసైటీపై పడింది. సొసైటీ అధ్యక్షపదవి కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన నడిపిల్లి ఆదినారాయణ, సత్తరవుశంకరరావు, రాంబార్కి బుజ్జి, తెలుగుదేశంపార్టీ తరుపున ఆ గ్రామ మాజీ వైస్ ప్రెసిడెంట్ కర్రోతు సత్యనారాయణ (సత్యం), వైఎస్సార్ తరుపున నడిపిల్లి గురునాథం పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. అయితే ఈ సొసైటీ ఎన్నికను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకరంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, వైఎస్సార్ పార్టీలు కూడా ప్రత్యేకంగా దృష్టిని సారించాయి. రాజకీయంగా ప్రాథాన్యతను సంతరించుకున్న ఈ సోసైటీని కైవసం చేసుకునేందుకు మూడుపార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటికే దీనిపై పార్టీ కార్యకర్తలు, అనుచరులతో ఆయాపార్టీలకు చెందిన నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది.
చెరకు మద్దతు ధర కల్పనలో
మాట తప్పిన ఎన్‌సిఎస్ సుగర్స్
సీతానగరం, జనవరి 21: లచ్చయ్యపేట ఎన్‌సిఎస్ సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకిచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆర్డీవో సమక్షంలో నిర్వహించిన సమావేశంలో అమలు చేస్తామన్న హామీలను గాలికొదిలేశారని ఆయన ఆరోపించారు. చెరకు రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఫ్యాక్టరీ గేటు వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్ధతు ధర విషయంలో ఫ్యాక్టరీ ఎండితో సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పి ఇంతవరకు దానిని అమలు చేయకపోవడమేమిటని ప్రశ్నించారు. రైతుల పేరిట తీసుకున్న బినామీ రుణాలు గత సీజన్‌కు సంబంధించి బకాయి ఉన్న రాయితీలు, 15రోజుల పేమెంట్, తదితర డిమాండ్లుగా పేర్కొన్నారు. రైతు సమస్యలపై యాజమాన్యం నిర్లక్ష్యధోరణితో వ్యహరిస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా రైతులంతా ఎన్‌సిఎస్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను మోసం చేస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఇఒ ఆంజనేయులతో నిర్వహించిన సమావేశంలో సమస్యలపై అధికారులను రైతులు నిలదీశారు. మద్దతు ధరపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో ఫ్యాక్టరీ ఎండితో రైతులకు సమావేశాన్ని ఏర్పాటు చేసి మద్దతు ధరను ప్రకటించడంతోపాటు మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని సిఇఒ హామీ ఇచ్చారు. 10 రోజులల్లోగా సమస్యలపై స్పందించకుంటే రిలే నిరాహార దీక్షలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి, ఆర్ వేణు, జి సత్యనారాయణ, లక్ష్మునాయుడు, రమణమూర్తి, తదితరులతోపాటు రైతులు పాల్గొన్నారు.
‘భవన నిర్మాణాల్లో
నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి’
బొబ్బిలి, జనవరి 21: భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సర్వశిక్ష అభియాన్ బృందం నేత సత్యనారాయణ కోరారు. స్థానిక ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం సమీపంలో ఉన్న ఎస్‌ఎస్‌ఎ భవనంలో పరిశీలన- నాణ్యతపై సర్వశిక్షణా అభియాన్ సైట్ ఇంజనీర్లు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు.