గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ- వచ్చిపోయే వారికి వడ్డించే బొమ్మా!’’-అన్నట్లు పది అడుగుల పొడవున్న కొండచిలువ ఒకటి- ‘క్వాంటా ఎయిర్‌వాజ్’ వారి విమానం రెక్క మీదికెక్కి- దానికి ఎంచక్కా ముడుచుకుని- నిద్దరోలేదు- ఏమనుకుందో- ఎండలో మిలమిలా మెరిసే రెక్క అంచును- మింగాలని తంటాలు పడుతూ వుండగా- గగనతలంలో- ఝామ్మని ఎగురుతూ పోతూన్న ఆ విమానంలోని- ప్రయాణీకుడు- రాబర్టస్ వెబర్ అనే ఉత్సాహవంతుడు- దానికి తాపీగా వీడియో తీశాడు.
పాపం! ఆ పాము విమానం రెక్క కొసకి ప్రాణాలను ఉగ్గబెట్టుకుని- చుట్టుకున్న స్థితిలోనే పాకుతోంది, వెనక్కి జారుతోంది. ఈ విమానం ఆస్ట్రేలియాలోని కైర్న్‌స్ నుంచి పాపువా (న్యూగినీ)కి అపారవేగంతో ఎగిరింది. ఈ విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగేదాకా ఈ కొండ చిలువ పట్టువదల్లేదు. ఎయిరో ప్లేన్ ఆగినాక చూస్తే- అది చచ్చిపడి- అలాగే చుట్టుకుని వుండిపోయినట్లు సిబ్బంది గమనించారు. 2006లో హాలీవుడ్‌లో ‘స్నేక్ ఆన్ ది ప్లేన్’ అనే సినిమా వచ్చింది. అలాంటి వింతే ఇది మరి! కొండ చిలువకి అడవి కావాలి కదా? ఆ అడవి ఎయిర్‌పోర్ట్‌లో వుండదు కదా?
పెళ్లికీ, హనీమూన్‌కీ బీమా!
‘పెళ్లిచేసి చూడు, ఇల్లు కట్టిచూడు’ అన్నారు. ఇల్లు కట్టినాక దాన్ని కళ్లనిండా చూసుకుని మూలగవచ్చును. పెళ్లిచేసేకా చూడ్డానికేముం ది? అంతా ‘‘్ఫనిష్!’’. అందులోనూ ‘‘మైగాడ్! ఇండియన్ వెడ్డింగ్స్!’’అంటూ ఇతర దేశస్తులు గుండెలు బాదుకుంటారు కూడాను. ‘వినాయకుడి పెళ్లికే దిక్కులేదు- అన్నీ ఆటంకాలే’ అంటారు పెద్దలు. కానీ కొత్తలోకం యిది. పెళ్లిలో ఏ నష్టం, ఏ అవాంతరం వచ్చినా- మంగళ సూత్రాల నుంచీ పెళ్లివిందులు, బ సలూ, ఆఖరికి హనీమూన్ ఏర్పాట్లకి బీమా సదుపాయం వుంది. ముంబై నగర సంపన్నులు హాయిగా పెళ్లికి కాంట్రాక్టు యిచ్చేస్తారు. పెళ్లి సందడిలో నగలు చోరీ అయినా ‘‘వర్రీ’’ అవరు. ఇన్స్యూరెన్స్ ప్రీమియం జాస్తిగానే వుంటుందండోయ్! ధన ఘన వంతుల వివాహ వైభవం చూడ్డానికి ‘‘రెండుకళ్లు చాలవు’’- అన్నట్లు-ఝామ్మని పెళ్లిపెద్ద దిమ్మతిరిగేలా అయిపోతాయ్! ‘‘ఇంతకీ- పెళ్లంటే నూరేళ్ల పంటా? పెంటా?’’ అనడిగాడో జోకింగ్ జెంటిల్మాన్. అది ‘కర్మ’ని బట్టి ఉంటుంది అన్నాడు. సూటూ, బూటూ ధరించిన ఓ శాస్త్రుల్ల’’వారు!
అవీ-ఇలీ-అన్నీ
english title:
b
Date:
Thursday, January 24, 2013