* మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూ రాసుకుంటే కొద్ది రోజులకు మచ్చలు తొలగిపోతాయి.
* కీర దోసకాయను గుండ్రటి ముక్కలుగా కట్ చేసి కనురెప్పలపై పది నిముషాల సేపు ఉంచుకోవాలి. రోజూ ఇలా చేస్తే కళ్లకు అలసట తీరడమే గాక, కనుల కింద నల్లటి వలయాలు క్రమంగా అంతరించిపోతాయి.
* రోజ్ వాటర్‌లో ముంచిన దూదితో కను రెప్పలపైన, కింద తుడుచుకోవాలి. ఇలా రెండు, మూడు వారాలు చేస్తే కళ్ల కింద నల్లటి చారలు తొలగిపోతాయి.
* కాల్చిన అల్లం ముక్కలపై ఉప్పు లేదా దానిమ్మ రసం వేసుకుని తింటే నోరు పరిశుభ్రమవడమే గాక, అరుచి లక్షణాలు పోతాయి.
* ఆహారంలో కరివేపాకును విరివిగా వాడితే తల నెరసి పోవడం సమస్య నుంచి బయట పడవచ్చు.
* నాలుగైదు మిరియం గింజలను నోట్లో వేసుకుని ఆ రసం మింగితే గొంతు సమస్యలకు మంచి ఫలితం ఉంటుంది.
* ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉంటూ ఎక్కువగా కాఫీ, టీలు తాగడం మంచిది కాదు.
* పనిమీద బయటకు వెళ్లేవారు ఆకలి వేస్తే ఎక్కడ పడితే అక్కడ చిరుతిళ్లు తినకుండా వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగాలి.
మెత్తగా
english title:
b
Date:
Thursday, January 24, 2013