శ్రీ కంఠుం బరమేశు నవ్యయు నిజ శ్రీ పాద దివ్య ప్రభా
నీకోత్సారిత దేవతా నిటల దుర్నీత్యక్షర ధ్వాంతుజి
త్ప్రాకామ్యాంగు నపాంగ మాత్ర రచిత బ్రహ్మాండ సంఘాతుజం
ద్రాకల్పుం బ్రణుతింతు నిన్ను మది నాహ్లాదింతు సర్వేశ్వరా!
భావం: సర్వేశ్వరా విషాన్ని కంఠంలో కల్గిన నిన్ను నాశంలేని నిన్ను నీ పాదములు దివ్య కాంతి పుంజము చేత దేవతా సమూహాల దుష్టమైన నీతి అనే అంధకారాన్ని నిన్నుచిత్ శక్తి అనే అష్టైశ్వర్యాలలో ఒకదాన్ని శరీరంగా కల నిన్ను కడకంటి చూపు మాత్రం చేతనే బ్రహ్మాండ సమూహాన్ని సృష్టించిన నిన్ను చంద్రుణ్ణి శిరస్సున దాల్చిన నిన్ను నమస్కరిస్తాను. మనస్సులో ఆనందిస్తాను. ఈ కావ్యారంభం శ్రీ కారంతో మొదలై పాఠకులకు, కవికి కూడా మంగళం కలగాలనే సంప్రదాయాన్ని సూచిస్తోంది. పరమేశుడు అన్న శబ్దం సర్వేశ్వర శబ్దార్థంతో తుల్యత కలిగుంది. అవ్యయుడన్న శబ్దమూ కూడా ఈశ్వరునికే చెల్లే శబ్దం. సర్వేశ్వరుడు సచ్చిదనందుడు స్థాణువూ, చైతన్యమూర్తి, ఆనందమూర్తి ఆయన.
సర్వేశ్వర శతకములోని పద్యమిది నిర్వహణ: శ్రీపావని సేవా సమితి, హైదరాబాద్