ఉట్నూరు, జనవరి 28: తెలంగాణ న్యాయవాదుల జెఎసి పిలుపుమేరకు సోమవారం స్తానిక న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. ఇటువంటి మోసాలు ఎన్నోమార్లు చేసినప్పటికీ ప్రత్యేక తెలంగాణపై మమకారంతో ప్రజలు సహనం వహిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణపై స్పష్టమైన ధోరణితో రాష్ట్రం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జెఎసి ఉద్యమాల్లో పాల్గొంటూ మద్దతు తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమం న్యాయవాదులు అశోక్, జమీర్ఖాన్, ధీరజ్, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ న్యాయవాదుల జెఎసి పిలుపుమేరకు సోమవారం స్తానిక
english title:
advocates abstain from work
Date:
Tuesday, January 29, 2013