కడెం, జనవరి 28: కడెం మండలంలోని పాండ్వాపూర్ సింగిల్ విండో సొసైటీ పరిధిలో గల 13 ప్రాదేశిక నియోజకవర్గాలలో సోమవారం 57 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినట్లు కడెం మండల ఎన్నికల అధికారి ఎ నాగరాజు, సొసైటీ సిఇఓ వజ్రవేలు తెలిపారు. సొసైటీ పరిధిలో గల 1వ నియోజకవర్గం నుండి ముత్తన్న, సమ్మెట రాజమల్లు, సమ్మెట రాజన్న, బత్తుల నర్సయ్య, గట్ల నల్లగొండ, చెవుటి మల్లయ్య, భీమారపు చంద్రయ్య, ఇస్లావత్ గంగారాం, 2వ నియోజకవర్గం నుండి మెరుగు ఇంద్రసేనారెడ్డి, బోడకుంట చంద్రయ్య, జి గంగవ్వ, 3లో ముక్కిరాల ఎర్రయ్య, చుంచుభూమన్న, 4లో బోర్లకుంట అనసూయ, బత్తుల గంగరాజు, చంద్రకళలు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే 5వ నియోజకవర్గం నుండి కె లచ్చన్న, ఎం అయిలయ్య యాదవ్, 6లో మామిడి గంగారాం, అనంతయ్య, దుర్గం రాజలింగు, తలారి లక్ష్మణ్, కొంపెల్లి చంద్రయ్య, 7లో బుర్ర సత్యాగౌడ్, గోనె సత్తవ్వ, కలిమి శంకరయ్య, మంజ్యానాయక్, కనె్న నర్సయ్య, కనె్న శంకరయ్య, 8 నియోజకర్గం నుండి రత్నాల రాజు, కమల, 9లో బక్కయ్య, దుల్లె గంగయ్య, కె నర్సింగరావు, సాదు వెంకటేష్, లోక నరేందర్‌రెడ్డి, మందాడి నర్సారెడ్డి, అంకంపేట్ లింగం, 10లో పల్లె నర్సింహారెడ్డి, పల్లె వెంకన్న, జాగిరి శ్రీనివాస్, 11 నియోజకవర్గం నుండి కోల శ్రీనివాస్, కసుల రాజేశ్వర్, పోతు రాజు రమేష్, బత్తుల నందయ్య, కమ్మరి నర్సయ్య, మాదాసు సత్తన్న, కుమ్మరి భూమన్న, 12 నియోజకవర్గం నుండి బొంగు గంగాధర్‌గౌడ్, కొడిమెల బుచ్చి నర్సయ్య, తక్కల పల్లి గణేష్, కుమ్మరి నారాయణ, సందు రాజేశ్వర్, 13 నియోజకవర్గం నుండి దొడ్డెటి రమేష్, మెట్టు కవిత, కర్నాటకం రాజయ్యలు తమ తమ నామినేషన్లను దాఖలు చేయడం జరిగిందని, వీరి నామినేషన్లు మంగళవారం పరిశీలన చేయనున్నట్లు వారు తెలిపారు.
ఎస్సీ ఉద్యోగులకు అన్యాయం
ఉట్నూరు, జనవరి 28: ఎస్సీ, ఎస్టీ వైద్య ఆరోగ్యశాఖ సంఘం పేరుతో ఉద్యోగులందరికి న్యాయం చేయాల్సిన నేతలు ఒక వర్గానికి మద్దతు ఇస్తున్నారని, నిరసిస్తూ తాము ఆ సంఘం నుండి బయటకు వస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ఎస్సీ ఉద్యోగులు జ్యోతి, కృప, అనార్కలి, జయశీల తదితరులు సోమవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల పేరిట అందరికి న్యాయం చేయాల్సిన నేతలు తమ వర్గమైన ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. పిహెచ్‌సిలో ఎస్సీ వర్గానికి ఖాళీ పోస్టులు వున్నా వారికి చూపించకుండా ఎస్టీలతో భర్తీ చేస్తున్నారని అన్నారు. సంఘం నుండి వెళ్ళిపోతున్నామని, సంఘ నేతలు స్వార్థపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా
తెలంగాణవాదుల రాస్తారోకో
శ్రీరాంపూర్ రూరల్, జనవరి 28: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వానికి వైఖరికి నిరసనగా అఖిళ భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సోమవారం సిసిసి క్రాస్‌రోడ్ వద్ద ఎఐవైఎఫ్ నాయకులు రాస్తారోకో నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుకూరి నగేష్ మాట్లాడుతూ నెల రోజుల్లో తెలంగాణపై ప్రకటన చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి షిండే మాటామార్చుతూ మరింత సమయం కావాలని చెప్పడం తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజలను మోసంచేయడమే అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్న తరుణంలో అఖిళపక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడంలో నాన్చుడు ధోరణి అవలంభిస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేసి ఉద్యమంలో కలసిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ జిల్లా నాయకులు మొగిలి లక్ష్మణ్, సిరికొండ నరేష్, రాగిడి రాజు, వసీ, జగన్, సురేష్, జగన్, కిషోర్, రాములు, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శాంతిఖని గనిని సందర్శించిన సింగరేణి రక్షణ తనిఖీ బృందం
బెల్లంపల్లి, జనవరి 28: స్థానిక శాంతిఖని గనిలో సోమవారం ఉదయం సింగరేణి రక్షణ బృందం తనిఖీ చేసింది. తనిఖీ నిమీత్తం వచ్చిన అధికార్లను శాంతిఖని ఏజెంట్, ఎన్.సూర్యనారాయణ, గని మేనేజర్ రాధాకృష్ణ, అధికారులు, యూనియన్ ప్రతినిధులు మేళతాళాలతో స్వాగతం పలికారు. అనంతరం రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ ఎస్‌విఎస్‌ఎస్ రామలింగేశ్వరుడు రక్షణ పతాకాన్ని ఎగురవేశారు.ఈసందర్భంగా రక్షణ బొంకూరి రాంచందర్ బృందం ప్రదర్శించిన నృత్యరూపకం ఆందరిని ఆకట్టుకుంది. రక్షణ తనిఖీ బృందం ప్రథమచికిత్స, ఫైర్ ఫైటింగ్ ప్రదర్శనను తిలకించారు.ఈకార్యక్రమంలో రక్షణ బృంద సభ్యులు కె.సంతోష్, చిలుక శ్రీనివాస్, బాలాజి రావు, బి.కార్తికేయన్, వెంకటసుబ్బారావు, పి.కోటిలింగం, బి.రాజు, స్థానిక అధికారులు బుచ్చయ్య, రాధాకృష్ణ, సూర్యనారాయణ, ఫిట్‌కార్యదర్శి కొండపల్లి సత్తయ్య కార్మికులు పాల్గొన్నారు.