జమ్మికుంట, జనవరి 28: పత్తి కొనుగోళ్లలో సిసిఐ అడ్డగోలు కొర్రీలు పెడుతోంది. నాణ్యత ప్రమాణాల పేరిట మొక్కుబడి పత్తి బస్తాలను ఎంపిక చేసి అధిక మొత్తం పత్తిని నిరాకరించింది. నాణ్యత పరిశీలన పే రుతో కాలయాపన చేసి రైతుల సహనాన్ని పరీక్షించిం ది. పొద్దస్తమానం పత్తిని అమ్ముకునేందుకు ఎదురు చూ సిన రైతులకు సి.సి.ఐ మొండి చేయి చూపడంతో రైతు ల్లో ఆగ్రహ జ్వాల పెల్లుబికింది. తమ పత్తిని కొనకుంటే ఊరుకునేది లేదంటూ మార్కెట్ గేట్లను మూసేసి ఆందోళనకు దిగారు. రైతుల్లో ఆక్రోశం కట్టలు తెంచుకోవడం తో వారిని కట్టడి చేయడం ఎవరి తరం కాలేదు. పోలీసులు రంగ ప్రవేశం చేసినా ఫలితం లేకుండా పోయిం ది. ఒక దశలో పోలీసులపైనే విమర్శనస్త్రాలు సంధించారు. తమను అదుపు చేయడం కాదు మార్కెట్‌ను అదుపు చేయండి, తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, వ్యాపారులను నిలదీయండంటూ నిప్పు లు చెరిగారు. దీంతో పోలీసులు బిత్తర పోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. వివరాలిలా వున్నాయి. మూడు రోజుల మా ర్కెట్ సెలవుల అనంతరం సోమవారం మార్కెట్లో పత్తి క్ర య విక్రయాలు ప్రారంభంకాగ రైతు లు సుమారు 10 వేల పత్తి బస్తాలను విక్రయానికి తెచ్చారు. వాహనాల్లో వచ్చిన విడి పత్తిని మొదట కొనుగోలు చేసిన సి.సి. ఐ అధికారులు మార్కెట్లోని పత్తి బస్తాల విషయంలో కొత్త నిబంధనలు తెర మీదకి తెచ్చారు. చైర్మన్ సమ్మిరెడ్డి నిబంధనలను కొంత మేర సడలించాలని యార్డు సందర్శనకు వచ్చిన జె.డి.యం సుధాకర్, సి.సి.ఐ వరంగల్ బ్రాంచి మేనేజర్ అమర్‌నాధ్‌రెడ్డిని కోరారు. అయినప్పటికి యార్డులోని పత్తి బస్తాలను విడిగా పరీక్షించి తేమ శాతం అధికంగా వుందంటూ నామమాత్రంగా 3వేల బస్తాలను ఎంపిక చేసుకున్నారు. తేమ 12 శాతంకు మించి వుందంటూ ధరను ఐదు రకాలుగా ఖరారు చేశారు. కనీస మద్దతుధర రూ.39వందలు మొదలు కొని రూ.3744 వరకు ధర చెల్లించారు. ఈతతంగం పూర్తయ్యే సరికి సాయంత్రమైంది. మిగితా పత్తిని కొంటారని కళ్లల్లో వత్తులేసుకుని చూసిన రైతులకు నిరాశే మిగిలింది. అధిక శాతం తేమ వున్న పత్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనేది లేదని తేల్చి చెప్పడంతో రైతులు కోపోద్రిదక్తులయ్యారు. ఉదయం నుండి రాత్రి వరకు మార్కెట్లో వున్న తమను పట్టించుకునే దిక్కేదని ఆగ్రహంతో ఊగిపోతూ మార్కెట్ గేట్లను మూసి వేశారు. తమ సరుకులకు ఇప్పటికిప్పడు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా మార్కెట్లో యుద్ధ వాతావరణం నెలకొంది. రైతుల ఉక్రోశంతో యార్డు భయానకంగా మారింది. తీవ్ర ఉద్రిక్తలతో అట్టుడికింది. సమాచారం అందుకున్న ఎస్సై శివప్రసాద్ తన సిబ్బందితో మార్కెట్‌కు రాగ రైతుల నుండి ప్రతికూలత ఎదురైంది. రైతులను శాంతింప చేసేందుకు పోలీసులు పడరాని పాట్లు పడ్డారు. రైతులకు నచ్చజెప్పినా వినక పోవడంతో ఎస్సై మార్కెట్ అధికారులు, చైర్మన్ సమ్మిరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని వివవరించారు. అయితే ప్రైవేట్ వ్యాపారులతో కొనుగోలు జరిపించడానికి మార్కెట్ పాలక వర్గం యత్నించినా వ్యాపారులు అందుబాటు లేక పోవడంతో యార్డులో అనిశ్చితి నెలకొంది. దీంతో రైతుల పత్తిని కొనే దిక్కు లేకుండా పోయి మరుసటి రోజు వరకు వేచి వుండే పరిస్థితి దాపురించింది. ఇదిలావుంటే మార్కెట్ గుమస్తా రాజవౌళి మృతికి సంతాప సూచకంగా మంగళవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించిన దరిమిలా రైతులకు రెండు రోజుల నిరీక్షణ తప్పేట్టు లేదు.
పదివేల బస్తాల్లో ఏడు వేల బస్తాల నిరాకరణ ఆందోళన బాట పట్టిన రైతులు
english title:
cotton purchase
Date:
Tuesday, January 29, 2013