పెద్దపల్లి, జనవరి 28: పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌లో సర్వేయర్ విభాగంలో డిప్యూటి ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న గోపాలకృష్ణను ఎసిబి అధికారులు సోమవారం వలపన్ని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఎసిబి డిఎస్‌పి సుదర్శన్ గౌడ్ వెల్లడించిన వివరాలిలావున్నాయ. భూమికి కొలతలు వేసి హద్దులు చూపించేందుకు గాను ఒక రైతు నుండి సర్వేయర్ గోపాలకృష్ణ ఎనిమిది వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబట్టట్లు ఆయన తెలిపారు. సుల్తానాబాద్ మండలం గట్టెపల్లికి చెందిన టి.కె.శ్రీనివాస్ అనే రైతుకు సంబంధించిన సర్వే నం.530లో ఎకరా 30 గుంటలు, 535లో పది గుంటల భూమి ఉందని చెప్పారు. దీంతో కొలతల్లో తేడాలు ఉండడంతో మండల సర్వేయర్ ద్వారా శ్రీనివాస్ కొలిపించాడు. అయితే తేడాలు ఉండడంతో డివిజన్ ఇన్‌స్పెక్టర్ అయిన గోపాలకృష్ణను ఆశ్రయించాడు. ఇందుకు గాను పది వేల రూపాయలు ఇవ్వాలని బాధితుడు తెలుపడంతో అందుకు సమ్మతించిన శ్రీనివాస్ తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఎసిబిని ఆశ్రయించాడు. పది వేలు ఇస్తే తప్పా నీ పని కాదంటూ తేల్చి చెప్పడంతో బాధితుడైన శ్రీనివాస్ తమను ఆశ్రయించాడని సుదర్శన్ గౌడ్ తెలిపారు. ఇందుకు వలపన్నిన ఎసిబి అధికారులు సోమవారం సాయంత్రం పెద్దపల్లి ఆర్‌డిఓ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ దాడుల్లో డిఎస్పీ బృందం తదితరులు ఉన్నారు.
పెద్దపల్లి రెవెన్యూ డివిజన్‌లో సర్వేయర్ విభాగంలో డిప్యూటి ఇన్‌స్పెక్టర్‌గా పని
english title:
deputy surveyor
Date:
Tuesday, January 29, 2013