కాసిపేట, జనవరి 29: కార్మికులు భూగర్బలో విధులు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా రక్షణ చర్యలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించగలుగుతామని రక్షణ బృందం కన్వీనర్ రాంమోహన్‌రావు అన్నారు. మంగళవారం రక్షణ వారోత్సవాల్లో భాగంగా మందమర్రి ఏరియాలోని కాసిపేట గనిని రక్షణ బృందం తనిఖీ చేసింది. ఈ సందర్బంగా రక్షణ బృందానికి గని అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రక్షణ జెండాను ఆవిష్కరించి శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్షణ బృందం కన్వీనర్ రాంమోహన్‌రావు మాట్లాడుతూ కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తిని చేపట్టాలని సూచించారు. రక్షణ చర్యలు చేపట్టకపోతే ప్రమాదాలు సంభవిస్తాయని, దాని మూలంగా ఎన్నో రకాల నష్టానికి దారి తీస్తుందని తెలియజేశారు. భూగర్బంలో యంత్రాల వద్ద పనులు చేసే సమయంలో తప్పనిసరిగా కార్మికులు రక్షణ చర్యలు పాటించాలని లేనట్లయితే ప్రమాదాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. చిన్నచిన్న మానవ తప్పిదాల వల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం లేకపోలేదని, అందుకోసం ప్రతి కార్మికుడు రక్షణ సూత్రాలను పాటిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని చేయాలని సూచించారు. దీనివల్ల కార్మికునికే కాక కంపెనీకి ఎలాంటి ప్రమాదాలు ఉండకుండా ఉంటాయని అన్నారు. రక్షణ వారోత్సవాల సందర్బంగా రెస్క్యూ సిబ్బంది నిర్వహించిన కార్యక్రమం కార్మికులను ఆకట్టుకుంది. భూగర్బంలో ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో రెస్క్యూ సిబ్బంది కార్మికులను ఏవిధంగా రక్షిస్తారనే విషయంపై నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి జి ఎం వెంకటరామయ్య, రక్షణ బృందం సభ్యులు శ్రీహరి, చంద్రశేఖర్‌రెడ్డి, రవీందర్‌రాజు, దయాకర్, వెంకటేశ్వర్లు, లక్ష్మన్‌మూర్తిలతో పాటు గని మేనేజర్ నాగేశ్వర్‌రావు, సంబంధిత అధికారులు, గుర్తింపు సంఘం నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
* రక్షణ బృందం కన్వీనర్ రాంమోహన్‌రావు
english title:
r
Date:
Wednesday, January 30, 2013