శ్రీరాంపూర్ రూరల్, జనవరి 29: సింగరేణిలో మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ ఎ.మనోహర్‌రావు పేర్కొన్నారు. రక్షణ వారోత్సవాల సందర్భంగా రక్షణ బృందం మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా వర్క్‌షాప్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ మాట్లాడుతూ ప్రమాదాలు ముఖ్యంగా మానవ తప్పిదం, యంత్రాలు, మెటీరియల్ ద్వార జరుగుతాయని, ఏ ప్రమాదానికైనా మానవ తప్పిదమే ప్రధాన కారణమన్నారు. రక్షణతో పనిచేయడం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. అనంతరం వర్క్‌షాప్‌లో రక్షణ పతాకాన్ని ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. కమ్యూనికేషన్ సెల్ కళాకారులు ప్రదర్శించిన నాటిక, పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రక్షణ తనిఖీ బృదం సభ్యులు హెచ్.నీలకఠేశ్వరరావు(డివైజిఎం ఇఅండ్‌ఎం), కె.బ్రహ్మచారి (్ఫర్‌మెన్), లక్ష్మినారాయణ (్ఫర్‌మెన్)లు, ఏరియా ఎజిఎం ఇఅండ్‌ఎం ఎం.పిచ్చయ్య, వర్క్‌షాప్ డివైజిఎం సూర్యనారాయణ, డివైజిఎం సాయిలు, గుర్తింపుసంఘం నాయకులు బంటు సారయ్య, కె.సురెందర్‌రెడ్డి, ఫిట్ కార్యదర్శి సామ శ్రీనివాస్, కమ్యూనికేషన్ సెల్ కళాకారులు దమ్మాల శ్రీనివాస్, గజెల్లి రాజలింగు, ఎస్.ప్రభాకర్, కమతం సతీష్, బషీరుద్దీన్, మల్లేష్, గడ్డం రమేష్, ఐ.రాములు, వెంకటేష్, మోహన్‌రావు, పవన్, పిఆర్‌ఎ సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
* రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ మనోహర్‌రావు
english title:
m
Date:
Wednesday, January 30, 2013