హైదరాబాద్, జనవరి 30: రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించిన స్ర్తిశక్తి, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలను ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని రాష్ట్ర హోంశాఖమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లాలో పలుచోట్ల కురిసిన వడగండ్లవర్షానికి దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించాలని మంత్రి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని చెల్లిస్తామని, దానికి సంబంధించిన సమగ్ర వివరాలను ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. బుధవారం జిల్లా పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా విభాగం పనితీరుపై మంత్రి తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని మెటల్ రోడ్‌లు అన్నింటినీ బిటి రోడ్లుగా నిర్మించనున్నారని మంత్రి తెలిపారు. రోడ్ల నిర్మాణంలేని తాండాలకు రోడ్లు వేయించేందుకు జిల్లా పరిషత్ నిధులను వెచ్చించాలని మంత్రి జిల్లా పరిషత్ సిఇవోను ఆదేశించారు. జిల్లాలో అంగన్‌వాడీ భవనాలు లేని గ్రామాల్లో వెంటనే నిర్మించాలని ఆదేశించారు. స్ర్తి శక్తి భవన నిర్మాణాలకోసం మరిన్ని నిధులు అవసరమైతే మండల, జిల్లా పరిషత్ నిధులనుండి వెచ్చించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. రానున్న వేసవి కాలంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చెడిపోయిన బోరు బావులను మరమ్మత్తులు చేపట్టేందుకు వీలుగా ముందస్తునిధులను అందజేస్తామని మంత్రి తెలిపారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ, మండల నిధులను వెచ్చించనున్నట్లు వివరించారు. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసేందుకు స్థలాలను సేకరించాలని మంత్రి సూచించారు. జిల్లాలోని కుల్కచర్ల, బంట్వారం, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, శంషాబాద్, కోకట్‌లలో విశ్రాంతి భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రభుత్వ స్థలాలు అందుబాటలోవున్న మిగతా మండలాల్లోకూడా వీటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లల్లో మరుగుదొడ్ల నిర్వహణకోసం ప్రత్యేకంగా నియామకాలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వాణీప్రసాద్, జిల్లా పరిషత్ సిఇవో రవీందర్‌రెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు
మంత్రి సబితారెడ్డి
english title:
f
Date:
Thursday, January 31, 2013