Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి చంపిన తల్లి

$
0
0

మోమిన్‌పేట, జనవరి 30: అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నారని భావించి ఎలాగైన అడ్డు తొలిగించుకోవాలని కసితో తనకున్న ఇద్దరు కూతుళ్లను బావిలో పడేసి హత్యచేసిన సంఘటన మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్జాల గ్రామానికి చెందిన నడిమదొడ్డి రవి, సుజాత భార్యభర్తలు. రవి ఎంఆర్‌ఎఫ్ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. సుజాత అదే గ్రామానికి చెందిన డప్పు బందయ్యతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నట్లు తెలిసింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న ఇద్దరు కూతుళ్లు సుచిరత(4), స్రవంతి(6)లను మంగళవారం రాత్రి గ్రామ సమీపంలోని వాటర్ సప్లయి బావిలో పడవేసి, తనకు ఏమీ తెలియదన్నట్లు తల్లిదండ్రులకు ఫోన్ చేసి భర్త తనను అక్రమ సంబంధం పెట్టుకున్నావని కొడుతున్నాడని, ఇద్దరు పిల్లలను బావిలో పడవేసి తన కోసం వెతుకుతున్నాడని తెలిపింది. ఇదిలా ఉండగా, తన భార్య సుజాత పిల్లలను తీసుకొని ఎక్కడికో వెళ్లిందో అని వెతుకుతూ భర్త రవి మోమిన్‌పేట్‌కు చేరుకున్నాడు. అంతలోనే సుజాత అతనికి ఫోన్ చేసి ఇద్దరు పిల్లలను బావిలో పడేసానని చెప్పి ఫోన్ కట్ చేసింది. దీంతో రవి పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ విజయలాల్, ఎస్‌ఐ రాజయ్య కేసు నమోదు చేసుకొని, విచారణ నిమిత్తం భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు.

* అక్రమ సంబంధమే కారణం?
english title: 
i

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>