తార్నాక, జనవరి 30: తాళం వేసి ఉన్న ఇళ్లలో వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న నిందితున్ని ఉస్మానియా పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి 25తులాల బంగారం, ఒక ల్యాప్‌టాప్, బజాజ్‌పల్సర్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాచిగూడ ఎసిపి వివరాల ప్రకారం- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం, తూర్పుకోడిపల్లికి చెందిన తిమ్మసముద్రం శివ అలియాస్ నందు (24- తండ్రి పోతన్న) హైదరాబాద్ వచ్చి పార్కులలో కాలం వెల్లదీస్తున్న తరుణంలో స్వచ్ఛంద సంస్థ చేరదీసి బోయిగూడలోని డాన్‌బాస్కోస్కూల్ కమ్ హాస్టల్‌లో చేర్పించారు. అక్కడ అతను పదవతరగతిని మధ్యలోనే వదిలివేసి హాస్టల్ నుంచి బయటికి వచ్చి అదే ప్రాంతంలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. స్కూల్‌పాథర్ సహకారంతో వాచ్‌మెన్, డ్రైవర్‌గా ఉద్యోగం చేసే ప్రయత్నం చేశాడు. ఉద్యోగం చేయడం చేతగాక చిన్నచిన్న దొంగతనాలు ప్రారంభించాడు. మొదట్లో ఇనుపచువ్వలు, మ్యాన్‌హోల్స్ కవర్‌లు దొంగిలించి అమ్మాడు. చెడు అలవాట్లకు బానిసవడంతో పెద్దపెద్ద దొంగతనాలు మొదలుపెట్టాడు. ఇతనిపై పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, నాంపల్లి, చిలకలగూడ, లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో 24 కేసులు నమోదై ఉన్నాయి. 2012 జూన్‌లో అరెస్టయి అక్టోబర్ 2012లో బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత పలుప్రాంతాల్లో దొంగతనాలు చేశాడు. ఇతను దొంగిలించిన సొత్తును సికింద్రాబాద్‌లో అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్‌జోన్ డిసిపి ఆర్.జయలక్ష్మీ ఆధ్వర్యంలో ఓయు క్రైంటీమ్ నిందితున్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. సమావేశంలో కాచిగూడ ఎసిపి రతన్‌రంజన్‌కుమార్, సిఐలు అశోక్, మధుసూదన్ పాల్గొన్నారు.
తాళం వేసి ఉన్న ఇళ్లలో వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న నిందితున్ని
english title:
k
Date:
Thursday, January 31, 2013