Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కాశ్మీర్‌ను తలపించిన ‘కుమ్మెర’

$
0
0

హైదరాబాద్, జనవరి 30: వాతావరణ సమతుల్యాలతోపాటు నిత్యం పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించే కాశ్మీర్‌ను తలపించేలా రంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షం మంచుకుప్పలతో బుధవారం ‘కుమ్మెర’ గ్రామం నిండిపోయింది. బుధవారం ఉదయానే్న దట్టమైన పొంగమంచుతో కాశ్మీర్‌లో కురిసే మంచు దిమ్మెలను కురిపించిన ప్రకృతిని వీక్షించేందుకు పరిసర గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. చేవెళ్ల, మోమిన్‌పేట, శంకరపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి భారీగా ఈదురుగాలులతో ఉరుములు, మెరుపులు మెరుస్తూ కురిసిన వడగళ్లవర్షం స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. రాత్రంతా నిద్దుర లేకుండా గడిపిన కుమ్మెర, కమ్మెట, గొల్లపల్లి, మల్కాపూర్, రావులపల్లి, ముడిమేల, ఈర్లపల్లి గ్రామస్థులు ఉదయానే్న చూసిన దృశ్యాలకు ఆశ్చర్యపడిపోయారు. ఎన్నడూ లేనివిధంగా హఠాత్తుగా మంచు కురుస్తుండటం, ప్యాక్టరీల్లో తయారుచేసే ఐస్ దిమ్మెల్లా కురిసిన వడగళ్లకు కలవరపడిపోయిన స్థానికులు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా నష్టపోయిన పంటలు, కోళ్లు, గొర్రెల నష్టానికి పరిహారం చెల్లించేందుకు అంచనాల ప్రతిపాదనలను రూపొందించే చర్యలు చేపట్టాలని హోం మంత్రి సబితారెడ్డి ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం రాత్రి కురిసిన వడగళ్లవాన అలాగే కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
వడగళ్ల వాన బీభత్సం
మొయినాబాద్: వడగళ్ల వాన మండలంలో తీవ్ర బీభత్సం సృష్టించింది. మంగళవారం కురిసిన అకాల వడగళ్ల వర్షానికి పంటను నాశనమయ్యాయి. కేతిరెడ్డిపల్లి, మేడిపల్లి, తోల్‌కట్ట, ఎత్‌బార్‌పల్లి, సజ్జన్‌పల్లి ప్రాంతాల్లో 1200 ఎకరాల్లో కోట్లాది రూపాయల పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ జెడిఎ విజయ్‌కుమార్, ఏవో రాగమ్మ, ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలను సేకరించారు. గ్రామాల్లో ఇళ్లకు పైకప్పు రేకలు, కిటికీల అద్దాలు, వాహనాల అద్దాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

వాతావరణ సమతుల్యాలతోపాటు నిత్యం పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించే కాశ్మీర్‌ను
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>