Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నేడు సహకార పోరు!

$
0
0

శ్రీకాకుళం, జనవరి 30:తొలి విడత సహకార ఎన్నికలు శ్రీకాకుళం డివిజన్‌లో గురువారం జరగనున్నాయి. డివిజన్ పరిధిలో 30 ప్రాథమిక పరపతి సంఘాలకుగాను ఇప్పటికే పాలకొండ మండలంలో తంపటాపల్లి, అర్థలి పి.ఎ.సి.ఎస్.లు ఏకగ్రీవమయ్యాయి.. ఈ రెండింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ జెడ్పీ చైర్మన్ పాలవలస రాజశేఖరం అనుచరులు దక్కించుకున్నారు. కోటబొమ్మాళి పి.ఎ.సి.ఎస్. ఎన్నికను శాంతిభద్రతల సమస్య కారణంతో ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన 27 పి.ఎ.సి.ఎస్.ల్లో 626 మంది ప్రాదేశిక సభ్యులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో లక్షా 5 వేల మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 27 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఈ ఎన్నికల విధినిర్వాహణకు సుమారు ఐదు వేల మంది సిబ్బందిని నియమించారు. 1050 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులకు హాజరుకానున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆయా పి.ఎ.సి.ఎస్. కేంద్రాల పరిధిలోని ఎన్నికలు జరుగుతాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫలితాలు సాయంత్రం సరికి వెల్లడించనున్నారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్, ఎస్పీ కె.వి.వి.గోపాలరావు, డిసివో శ్రీహరిరావు నేతృత్వంలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎచ్చెర్ల, నరసన్నపేట, పాలకొండ పరిధిలో ఎన్నికల సామగ్రిని డి.సి.వో. బలివాడ శ్రీహరి పర్యవేక్షణలో శ్రీకాకుళం, పాలకొండ ఆర్డీవోలు జి.గణేష్‌కుమార్, బలివాడ దయానిధిలు ఎన్నికల ఏర్పాట్లు చేసారు. మొత్తం 317 డైరెక్టర్ల స్థానాల్లో 1,05,707 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేసారు.
ఇదిలా వుండగా, చాలా కాలం నుంచి ఎన్నికలు లేక నిశ్శబ్ధ రాజకీయాలతో ఉన్న నేతలకు ఈ సహకార ఎన్నికల్లో పదవులను దక్కించుకునేందుకు తమ వ్యూహాలకు పదునుపెట్టడంతో గ్రామీణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. వ్యవధి తక్కువైనా ఓటర్లు అంతంతమాత్రంగా ఉన్నా ఈ ఎన్నికల్లో కూడా నేతలకు ఉత్కంఠ తప్పలేదు. అలాగే, ఖర్చులు కూడా భారీగానే వెచ్చించాల్సి వచ్చింది. సభ్యత్వ నమోదు నుంచి పోలింగ్ వరకూ ఓటరును బ్యాలెట్ వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నంలో కూడా రాజకీయ పార్టీ వారివారి శక్తి మేరకు నజరానాలు చెల్లించాల్సివచ్చింది. సహకార సంఘాల ఎన్నికల్లో ఓటు విలువ సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల ఓటు విలువ కంటే ఎంతగానో పెరిగిపోయింది. తొలివిడత పోలింగ్ జరుగుతున్న అన్నీ స్థానాల్లోనూ అధికార పార్టీ ఆయా గ్రామాల్లో ఉండే పరిస్థితిని బట్టి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకూ ఓటు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే, విపక్షపార్టీల ధర 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నట్టు సమాచారం. ఎన్నికలు జరిగేందుకు కొద్ది సమయమే ఉండటం, గ్రామాల్లో కేవలం కొద్దిమంది రైతులకు మాత్రమే ఓట్లు ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటు-రేటు మధ్య బేరసారాలు జరుపుతున్నారు.

సీల్డ్ కవరే!
* డిసీసీబి పీఠంపై కాంగ్రెస్ ఫార్ములా
* మంత్రుల మంత్రాంగం
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
కాంగ్రెస్‌లో డిసిసిబి పీఠం అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతల్లో ఇప్పటి వరకు ఏకాభిప్రాయానికి రాలేదు. సహకార ఎన్నికల్లో అత్యధిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు చేజిక్కించుంటే డిసీసీబి చైర్మన్ కుర్చీలో ఎవరిని కూర్చోబెడతారో నన్న ప్రశ్న పార్టీ శ్రేణులతో పాటు నాయకుల్లోను ఉత్ఫన్నవౌతున్నది. డిసిసిబి చైర్మన్ అభ్యర్థి ఎంపికపై జిల్లాకు చెందిన కేంద్రమంత్రితో పాటు ముగ్గురు రాష్ట్ర మంత్రులంతా వౌనం వహించడంతో కాంగ్రెస్ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో డిసిసిబి చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ‘సీల్డ్‌కవర్’ ఫార్ములాను ఆచరించనున్నట్లు తెలిసింది.
ఇప్పటి వరకు డిసీసీబి చైర్మన్‌గా బాధ్యతలు వహించిన డోల సీతారాములనాయుడు నుంచి ఎస్.వి.రమణ వరకూ జిల్లా పార్టీ పెద్దలు చెప్పినట్లే నియామకం జరిగేది. అయితే ప్రస్తుత పరిణామాల మధ్య ఈ సారి డిసిసిబి చైర్మన్ అభ్యర్థిత్వానికి ఏకాభిప్రాయం కన్పించకపోవచ్చునన్న భయంతోనే హైకమాండ్‌ను హైఅలర్ట్ చేసి సీల్డ్‌కవర్ స్టోరీ నడిపించేందుకు మంత్రులు మంత్రాంగం నడుపుతున్నట్లు బోగట్టా. ఇదే జరిగితే ఆశావాహులు ఎవరికివారే డిసీసీబీ కుర్చీ కోసం పడుతున్న ఆరాటానికి అడ్డదార్లు లేకుండా పోతాయి. ఎవరి ఎంపికైనా ఫలానా మంత్రి మార్కు డిసీసీబి పీఠంపై ఉందన్న ఆరోపణలు కూడా ఈ ఫార్ములాతో పటాపంఛల్ కానున్నాయి. పార్టీలో పదవులు పారదర్శకంగా హైకమాండ్ అందిస్తుందన్న సంకేతాన్ని కేడర్‌కు అందించి స్థానిక ఎన్నికల్లో మరింత చురుకుగా పనిచేసేందుకు సీల్డ్‌కవర్ సిస్టమ్ ఎంతగానో దోహదపడే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఏకగ్రీవమైన నర్తు నరేంద్రయాదవ్ మొదటి వరుసలో ఈ పీఠం కోసం సిద్ధమైపోగా, డోల జగన్, ఎస్.వి.రమణ, అంబటి శ్రీనివాస్‌లు రెండుమూడు వరుసల్లో ఉన్నారు.
ఇదిలా ఉండగా, రాజకీయ పార్టీలు ఉనికి చాటుకునేలా సహకార ఎన్నికల్లో వ్యూహాలకు పదునుపెట్టి కేడర్‌ను ముందుకు నడిపించినా తెరవెనుక రాయభేరాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిన అంశం అన్నిచోట్ల బయటపడింది. పలుచోట్ల వైకాపా స్పీడ్‌కు అధికార పార్టీ బ్రేకులు వేసింది. అయినప్పటికీ పాలకొండ డివిజన్‌లో అర్థలి, తంపటాపల్లి ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏకగ్రీవంగా ఆ పార్టీ దక్కించుకుంది. మరికొన్ని చోట్ల తెలుగుతమ్ముళ్లతో మ్యాచ్‌ఫిక్సింగ్‌కు సామాజిక అస్త్రాన్ని సంధించి ఇచ్చాపురం సహకార సంఘాన్ని కాంగ్రెస్ దక్కించుకోగా, అందుకు నజరానాగా బుడితి పి.ఎ.సి.ఎస్.ను టిడిపి అభ్యర్థికి కట్టబెట్టింది. ఇకపోతే ధర్మాన కోటలో అరసవిల్లి, అంపోలు, తూలుగులలో ఇదే తరహా ఒప్పందాలు జోరుగా సాగడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రాదేశిక సభ్యులుగా ఏకగ్రీవమయ్యారు. ఇటువంటి పరిస్థితులు మంత్రి కోండ్రు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజాం నియోజకవర్గం, శత్రుచర్ల నియోజకవర్గమైన పాతపట్నంలో కన్పించలేదు. అందువల్ల సహకార పోరు వీరిరువరికీ మరింత సవాల్‌గా మారింది. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి కుడి-ఎడమ పి.ఎ.సి.ఎస్.లు కోటబొమ్మాళి, పలాస ఎన్నికలను అధికార పార్టీ ఎదుర్కోలేక శాంతిభద్రతల నెపంతో వాయిదా వేయించిందన్న ఆరోపణ ఈ ఎన్నికలు సర్కార్‌కు తెచ్చిపెట్టాయి. కోటబొమ్మాళి కింజరాపు కోట కావడం, అధికార పార్టీకి ప్రతికూల అంశాలు ఉండడంతో ఎన్నికలు వాయిదా వేయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పలాస నియోజకవర్గంలో గల సహకార సంఘానికి వైకాపా ఝలక్ ఉందన్న భయంతోనే వాయిదా రాజకీయాన్ని అధికార పార్టీ నేతలు నెరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి సహకార ఎన్నికలు అనుకూలంగా ఉంటాయని సీనియర్లు తలంచినప్పటికీ, ఇటీవల ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు ప్రజల్లో వ్యతిరేకత ఉందని, తద్వారా ఫలితాలను తారుమారవుతుందనే భయం కూడా నేతలను వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ముందుగానే సెంట్రల్‌బ్యాంకు కుర్చీ అభ్యర్థిని ఖరారు చేసిన అధిష్టానం ఈ పర్యాయం మాత్రం గుంబనంగా ఫలితాలు అనంతరం చైర్మన్ ఎంపిక స్టీల్డ్ కవర్‌లో ప్రకటించాలన్న ప్రత్యేక పరిస్థితుల ఫార్ములా మంత్రులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండడంతో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందన్న వాదన లేకపోలేదు. దీనికితోడు పవర్‌సెంటర్లు కూడా పెరిగిపోవడంతో అభ్యర్థితత్వాన్ని ఖరారు చేస్తే ఆటంకాలు ఎదురవుతాయన్న ముందుచూపుతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కొంత మంది సీనియర్లు చెబుతున్నారు.

సమైక్యాంధ్రకే
కట్టుబడిన కాంగ్రెస్
జాతీయస్థాయి నేతలను విమర్శించే స్థాయి కెసిఆర్‌కు లేదు: మంత్రి కోండ్రు
పాలకొండ(టౌన్)/ పలాస,జనవరి 30: సమైకాంధ్రకే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ వంటి గొప్పనేతలను విమర్శించే స్థాయి టిఎస్‌ఆర్ అధినేత కెసిఆర్‌కు మంత్రి కోండ్రు మురళీమోహన్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన పాలకొండ మండలంలోని బెజ్జి గ్రామంలో విలేఖర్లతోను, పలాసలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణావాదులు అర్థరహితమైన ఆరోపణలు చేసి ఆంధ్రాను విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉంటుందని, దీనిలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేసారు.
దేశ ప్రయోజనాల కోసం జీవితాలను త్యాగం చేసిన మహానాయకులపై కెసి ఆర్ చేసిన విమర్శలను ప్రజలు హర్షించరని అన్నారు. సమరదీక్ష కార్యక్రమంలో కెసి ఆర్ ఆవేశపూరిత ప్రసంగాలు చేయడం సముచితం కాదని హితవుపలికారు. కేవలం స్వప్రయోజనాలకోసం తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేశారు తప్పా అక్కడి ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడంలేదని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రజలంతా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
రాష్ట్ర వ్యాప్తంగా ల నిర్వహిస్తున్న సహకార సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. 22వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ఉచిత విద్యుత్ అందించేందుకు 4వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. 108 పటిష్టత కోసం నూతనంగా 70వాహనాలను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. గర్భిణీలకు ప్రత్యేక భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. త్వరలో అందరికీ ఆరోగ్య శ్రీ అందించే దిశగా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు, ఎ ఎంసి చైర్మన్ సామంతుల దామోదరరావు, బలగ బుజ్జి తదితరులున్నారు.
వుడా ప్రాంతీయ
కార్యాలయం ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 30: విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా) ప్రాంతీయ కార్యాలయం సేవలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం పట్టణంలోని పాలకొండ రోడ్డులోని బలగ ఆంధ్రాబ్యాంకు సమీపంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని వుడా ఉపాధ్యక్షుడు డా.ఎన్.యువరాజ్ లాంఛనంగా ప్రారంభించారు. శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక సంఘాలు, రాజాం నగర పంచాయతీతోపాటు 11 మండలాల్లోని 417 గ్రామాలకు ఈ కార్యాలయం ద్వారా సేవలందనున్నాయి. జిల్లాలో అధిక విస్తీర్ణం వుడా పరిధిలో ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో లే అవుట్లు అభివృద్ధి చేసేందుకు విధిగా వుడా అనుమతులు పొందాలి. శ్రీకాకుళం, ఆమదాలవలస పురపాలక సంఘాల పరిధిలోను, గ్రామ పంచాయతీ, గ్రామకంఠం, అనుమతులు పొందిన లేఅవుట్లలో గ్రౌండ్ ప్లస్-2 స్థాయి భవనాలకు పురపాలక సంఘాలు, పంచాయతీలు అనుమతులు మంజూరు చేసే అవకాశం ఉంది. అంతకుమించిన (మిగతా 2వ పేజీలో)

భవన నిర్మాణాలకు వుడా నుండి విధిగా అనుమతులు పొందాల్సి ఉంటుంది. అదే విధంగా భూ వినియోగం మార్పిడి అనుమతులు, వాణిజ్య, పారిశ్రామిక, విద్యాసంస్థల నిర్మాణాలకు వుడా అనుమతులు తప్పనిసరిగా పొందాలి.
సిబ్బంది నియామకం:
ప్రాంతీయ కార్యాలయంలో సేవలందించేందుకు సిబ్బందిని నియమించారు. జిల్లా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి బి.సురేష్‌కుమార్ కార్యాలయ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. ఒక డిప్యూటీ కార్యనిర్వహణ ఇంజనీరును, మరికొంతమంది సిబ్బందిని నియమించారు.
జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ వుడా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు పట్ల అభినందించారు. జిల్లా కలెక్టర్, వుడా ఉపాధ్యక్షులు యువరాజ్ కార్యాలయ విభాగాలను పరిశీలించారు. ఆయా విభాగాల ద్వారా అందించే సేవలను ఉపాధ్యక్షులు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు యువరాజ్ మాట్లాడుతూ ఆన్‌లైన్ విధానంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రధాన కార్యాలయంతో అనుసంధానిస్తామన్నారు. జిల్లాలో 25 కోట్ల రూపాయల విలువ గల పనులు వుడా చేస్తుందని చెప్పారు. 2011 సంవత్సరంలో అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి 18 దరఖాస్తులు రాగా 13 దరఖాస్తులు పరిష్కరించామని, 2012లో 29 దరఖాస్తులు రాగా వాటిలో తొమ్మిది పరిష్కరించామని చెప్పారు. 2012లో లేఅవుట్లకు మూడు దరఖాస్తులు అందాయన్నారు. వీటన్నింటికీ మొత్తం 1.50 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వుడా ముఖ్య ప్రణాళికాధికారి ఆర్.జె.విద్యుల్లత, ముఖ్య ఇంజనీరు విశ్వనాధరావు, కార్యనిర్వహక ఇంజనీరు డి.వి.వర్మ, ప్రణాళిక అధికారులు ఎల్.సుబ్రమణ్యం, కె.డి.బ్రియానార్డ్, ఉప కార్యనిర్వహక ఇంజనీరు జి.శ్యామ్‌సుందర్, పాత్రో, పురపాలక సంఘ కమీషనర్ రామలింగేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ, సెట్‌శ్రీ సిఇఒ వి.వి.ఆర్.ఎస్.మూర్తి, పురపాలక సంఘం డి.ఇ. కె.సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు.

......
పై ఐటమ్‌కు రెండు కలర్‌ఫోటోలు పంపనున్నాం

31 ఎస్‌ఎస్ 11: వుడా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న యువరాజ్

31 ఎస్‌ఎస్ 12: కలెక్టర్‌తో మాట్లాడుతున్న యువరాజ్

విద్యారంగంలో వెనుకబడిన రాష్ట్రం
* ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ప్రైవేటు స్కూళ్లకే లబ్ధి
*శాసన మండలి పి.డి.ఎఫ్ ఫ్లోర్ లీడర్ బాలసుబ్రహ్మణ్యం
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 30: దేశంలో విద్యారంగం విషయంలో ఏ రాష్ట్రంతో పోల్చినా మన రాష్ట్రం వెనుకబడే ఉందని శాసనమండలిలో పి.డి.ఎఫ్ ఫ్లోర్ లీడర్, దక్షిణ కోస్తా జిల్లాల ఉపాధ్యాయ ఎం.ఎల్.సి వి.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిమిత్తం జిల్లాకు చేరుకున్న ఆయన బుధవారం ఇక్కడ యుటిఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. దేశంలోకెల్లా అత్యధికంగా 42 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్‌కు వెళ్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందన్నారు. కళాశాల చదువులకు కనీసం 25 శాతం మంది కూడా వెల్లడం లేదని, రాష్ట్రంలో పిల్లల చదువు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒకటవ తరగతిలో సంవత్సరానికి 15 లక్షల మంది పాఠశాలల్లో చేరుతుంటే, కళాశాల విద్య ఇంటర్మీడియట్‌కు వచ్చేసరికి 4 లక్షల మంది కూడా ఉండటం లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యను మెరుగుపర్చాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు వత్తాసు పలుకుతూ విద్యను ప్రైవేట్ పరం చేస్తోందని ఆరోపించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ పేరు చెప్పి ప్రైవేట్‌కు ప్రోత్సాహం ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను దివాళా తీసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. విద్యారంగం ద్వారా అభివృద్ధిబాటలో ఉన్న మొదటి రెండు స్థానాల్లో ఉన్న కేరళ, తమిళనాడు రాష్ట్రాలను చూసైనా గుణపాఠం నేర్చుకోవడం లేదని ఎద్దేవా చేశారు.
మోహనరావుకు మద్దతుగా ప్రచారం
శ్రీకాకుళం (టౌన్)/ ఎచ్చెర్ల, జనవరి 30: విద్యారంగ ప్రమాణాల మెరుగుకు పిడిఎఫ్ తరపున పోటీచేస్తున్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి మోహనరావును గెలిపించాల్సిందిగా ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం కోరారు. బుధవారం ఎచ్చెర్లలోని అంబేద్కర్ యూనివర్శిటీలో ప్రచారం నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలో యుటిఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి నిత్యం మోహనరావు లాంటి వ్యక్తులను ఎన్నుకున్నట్లయితే విద్యార్ధి, ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య, డీన్ సి.డి.సి. జి.తులసీరావు, యుటిఎఫ్ జిల్లా నాయకులు చౌదరి రవీంద్ర, సిటు సీనియర్ నాయకులు వి.జి.కె.మూర్తి, ఎమ్మెల్సీ అభ్యర్థి బొడ్డేపల్లి మోహనరావులు తదితరులు పాల్గొన్నారు.

రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయం
కేంద్ర మంత్రి కృపారాణి
పలాస, జనవరి 30: రైతుల అభ్యున్నతికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పేర్కొన్నారు. పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రభుత్వం రైతులకు వడ్డీ లేని రుణాలు అందించిందని, 12 వేల కోట్లు రైతుల రుణాలు మాఫీ చేసిందని తెలిపారు. ఉచిత విద్యుత్తు భారాన్ని ప్రతి ఏటా ప్రభుత్వం భరిస్తుందన్నారు. అప్పట్లో ఉచిత విద్యుత్ ఇస్తామంటే కరెంటు తీగలపై బట్టలు అరవేసుకోవచ్చని చెప్పిన చంద్రబాబు నేడు రైతులకు ఉచిత విద్యుత్తు అందిస్తామని హామీ ఇస్తే రైతులు నమ్మే స్థితిలో లేరన్నారు. జిల్లాలోని రైతాంగం అభివృద్ధి కోసం మెట్ట ప్రాంతాన్ని 27 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. రాహుల్‌గాంధీ యువతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని, అందులో భాగంగానే పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు యువకుడైన పాలిన శ్రీనివాసరావుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఎంపిక చేసారని చెప్పారు.అంతకు ముందు కమిటీ అధ్యక్షుడుగా పాలిన శ్రీనివాసరావుతోపాటు ఇతర డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్, కాంగ్రెస్ నాయకులు హనుమంతు వెంకటరావు, మెట్ట కుమారస్వామి, గురయ్యనాయుడు, దువ్వాడ మధుకేశ్వరరావు, తాళాసు రామారావు, దువ్వాడ ప్రకాశ్, బోర కృష్ణారావు, సరస్వతి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కార్మికులకు చట్టాలపై అవగాహన అవసరం
* ప్రతీ జిల్లాలో కార్మిక భవనం * లేబర్ కమిషనర్ రామాంజనేయులు
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 30: కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర లేబర్ కమిషనర్ బి.రామాంజనేయులు స్పష్టంచేశారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో జరిగిన భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మిక చట్టాలపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 38 రకాల కార్మికులు ఉన్నారని, ప్రతీ రంగానికి చెందిన కార్మికుడు ఈ చట్టం పరిధిలోకి వస్తాడన్నారు. వివిధ శాఖలలో పనిచేసిన కార్మికులు బోర్డు సభ్యులుగా చేరడం వల్ల ప్రభుత్వం కల్పించిన అన్ని సంక్షేమ పథకాలను పొందలగలన్నారు. రాష్ట్రంలో 40 వేల పరిశ్రమలు, 2.25 లక్షల ఎస్టాబ్లేష్‌మెంట్ షాపులున్నట్టు తెలిపారు. 50 లక్షల మంది సభ్యులుగా ఉండాల్సిన బోర్డులో 25 లక్షల మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. 18 సంవత్సరాలు పైబడి 65 సంవత్సరాల లోపు వయసు కలిగి గత సంవత్సరంలో ఏ రంగంలోనైనా 90 రోజులు కార్మికులుగా పనిచేసిన వారు సభ్యులుగా అర్హులని చెప్పారు. అర్హులైన వారు సభ్యత్వం రిజిస్ట్రేషన్ కోసం లైఫ్‌టైమ్‌కు 50 రూపాయలు, సభ్యత్వం రెన్యువల్ కోసం నెలకు ఒక రూపాయి చొప్పున ఐదు సంవత్సరాలకు 60 రూపాయలను కలుపుకొని మొత్తం 110 రూపాయలు చెల్లిస్తే కార్మికునికి ఒక కార్డు ఇవ్వనున్నామన్నారు. దీనివల్ల ఏడు రకాల ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. కార్మికులకు మూడు నెలల పాటు వారు కోరిన రంగంలో శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బాల కార్మికులను నిరోధించాలని, పిల్లలకు పనికి పంపించడం తల్లిదండ్రులు మానుకోవాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న ఎన్‌సిఎల్‌పి స్కూల్స్‌లో ప్రభుత్వ స్కూల్‌లో చదువుతున్న పిల్లల్ని చూపిస్తున్నారని, తనిఖీల్లో ఇవి రుజువైతే మొత్తం సొమ్మును రికవరీ చేస్తామని హెచ్చరించారు. ప్రతీ జిల్లాలో కార్మిక భవనం నిర్మాణానికి ముఖ్యమంత్రి అంగీకరించారని, దీరి కోసం స్థలం గుర్తించాలని కలెక్టర్‌ను కోరారు. జర్నలిస్టులకు కార్మిక చట్టాలు వర్తింపు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చెప్పారు. జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ జిల్లాలో 70 వేల ఉపాధి హామీ కార్మికులు 1.08 లక్షల ఇతర కార్మికులు గుర్తించామన్నారు. ఈ సమావేశంలో లేబర్ డిపార్టుమెంట్ జాయింట్ కమిషనర్ లక్ష్మీనారాయణ, జెడ్పీ సిఇఒ కైలాసగిరీశ్వర్, సీనియర్ సివిల్‌జడ్జి సువర్ణరాజు, డిప్యూటీ కమీషనర్ బి.రామారావు, అసిస్టెంట్ కమీషనర్ పట్నాయిక్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

రామచిలుకల అక్రమ రవాణా
ఎల్‌ఎన్ పేట, జనవరి 30: ఎల్‌ఎన్ పేట మండలంలో బుధవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో రామచిలుకల అక్రమ రవాణా వ్యవహారం బయట పడింది. లక్ష్మీనర్సుపేట జంక్షన్ వద్ద సరుబుజ్జిలి ఎస్‌ఐ బి నాగేశ్వరరావు, ఇన్‌చార్జి ఎస్‌ఐ గోవిందరావు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారులో గోపాల్, దుర్గ అనే వ్యక్తులతో పాటు మరో ఇద్దరు మహిళలు సుమారు 500 చిలుకలను అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. జిల్లాలోని హిరమండలం నుండి ప్రైవేటు వాహనంలో విశాఖపట్నం చేరువలో ఉన్న తగరపువలసకు వీటిని తరలిస్తున్నట్టు నిందితులు తెలిపారు. హిరమండలం ప్రాం తంలోని సంచార జాతులకు చెందిన కొన్ని కుటుంబాలు వారి జీవనోపాధికోసం చిలుకలను సేకరిస్తున్నారని, జ్యోతిష్యం చెప్పేవారికి విక్రయించేందుకు వీటిని తీసుకువెళుతున్నట్టు వారు తెలిపారని పోలీసులు వెల్లడించారు. వీటిని ప్లాస్టిక్ సంచులు, కోళ్ళబుట్టల్లో భద్రపరచి తరలిస్తున్నారన్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు పోలీసులు సమాచారం అందించి వాటిని అప్పగించారు. సరుబుజ్జిలి అటవీసెక్షన్ అధికారి డి.గౌరీసు, రాఘవయ్యలు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై అటవీచట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
తుపాను షెల్టర్ల నిర్మాణానికి చర్యలు

గార, జనవరి 30: తీరగ్రామాల్లో ప్రకృతి వైపరీత్యాలు సమయంలో ప్రాణహాని, ఆస్తినష్టం వాటిళ్లకుండా జాగ్రత్త చర్యలకు గాను ప్రభుత్వం తుఫాన్ షెల్టర్లు నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే బుధవారం కళింగపట్నం, బందరువానిపేటల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించారు. విపత్తుల నివారణ సెక్టార్ అధికారి కె. రవీంద్ర, కమ్యూనికేషన్ నిపుణుడు వి. శ్రీనివాస్‌లతో కూడిన అధికారుల బృందం గ్రామాల్లో పర్యటించి సభలు నిర్వహించాయి. కళింగపట్నం, బందరువానిపేటలతో పాటు కొమరవానిపేట, పేర్లవానిపేట, కొర్లాంలలో కూడా ఈ భవనాలు నిర్మింపజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. తీర గ్రామాల్లో నిర్మింపజేసే ఈ భవనాలు బహుళ ప్రయోజనకారిగా ఉండాలన్నారు. ఈ భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు, పాఠశాలలు నిర్వహణ, వివాహాది శుభకార్యాలు వంటివి నిర్వహించుకొనే విధంగా ఉపయోగపడాలన్నారు. ఈ భవనాల్లో విపత్తుల సమయాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి సుమారు 32 రకాల సాంకేతిక వస్తు సామాగ్రి అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారిణి ఆర్. స్వరూపారాణి, తహశీల్దార్ బి. శాంతి, పొట్నూరు కృష్ణమూర్తి, దీర్ఘాశి భీమారావు తదితరులు ఉన్నారు.

పోలింగ్‌కు సర్వం సిద్ధం
* ఈ రాత్రికి ఫలితాలు వెల్లడి
* తొలివిడతలో 12 సొసైటీల ఎన్నికలు వాయిదా
* 29 సొసైటీలకే పోలింగ్ నేడు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 30: జిల్లాలో సహకార ఎన్నికల్లోని ప్రధానమైన పోలింగ్ ఘట్టం గురువారం జరగనుంది. జిల్లాలో రెండు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో తొలివిడ పోలింగ్ గురువారం జరుగుతోంది. తొలివిడత 41 సొసైటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 12 సొసైటీల ఎన్నికలు వాయిదాపడ్డాయి. దీంతో 29 సొసైటీలకు మాత్రమే పోలింగ్ జరుగుతోంది. వీటిలోఆనందపురం, వేములవలస, పాండ్రంగి, పద్మనాభం, రెడ్డిపల్లి, బాందేవుపురం, గంధవరం, తగరపువలస, చూచుకొండ, మునగపాక, నాగులాపల్లి, సిహెచ్‌ఎన్ అగ్రహారం, కశింకోట, నర్శింగిబిల్లి, జుత్తాడ, లక్ష్మీపురం, జన్నవరం, గవరవరం, చోడవరం, భోగాపురం, గోవాడ, చౌడవాడ, చీడికాడ, దేవరాపల్లి, కలిగొట్ల, ఎం అలమండ, ములకలాపల్లి, అనంతగిరి, గుంటసీమ సొసైటీలకు పోలింగ్ జరుగుతోంది.
ఈ పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ జరుగుతుంది. 287 సెగ్మెంట్లలో జరిగే పోలింగ్‌కు 33 పోలింగ్ కేంద్రాలను, 287 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌లో 41,386 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 29 పిఎసిఎస్‌ల పరిధిలో 700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మర్రిపాలెంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోను, అనకాపల్లిలోని జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలోను, చోడవరం గవర్నమెంట్ జూనియర్ కళాశాలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, పోలింగ్ మెటీరియల్‌ను ఆయా పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లేందుకు 16 బస్సులను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం 1112 మంది సిబ్బందిని నియమించారు. ఐదు తీవ్ర సమస్యాత్మక సొసైటీలను అధికారులు గుర్తించారు. వీటిలో చూచుకొండ, కశింకోట, నర్శింగిబిల్లి, నాగులాపల్లి, మునగపాక ఉన్నాయి. సమస్యాత్మ సొసైటీలుగా అనంతగిరి, గుంటసీమ, బాందేవ్‌పురం, గంధవరం, పాండ్రంకి, రెడ్డిపల్లి, చీడికాడలను గురించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తి కాగానే, ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాత్రికి ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
కాగా, ఆయా సొసైటీల్లో మెజార్టీ డైరక్టర్లను గెలిపించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సొసైటీల పరిధిలో డైరక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులపై ఆయా రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ పార్టీలకు ప్రతిష్ఠాత్మకం కావడంతో గురువారం జరగనున్న పోలింగ్ రసవత్తరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా గురువారం మరికొన్ని సొసైటీల ఎన్నికలను వాయిదా వేశారు. వీటిలో కొత్తపాలెం, అరకు, చోద్యం ఉన్నాయి. వడ్డాది ఎన్నిక కూడా వాయిదా పడుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక ఇండియన్ నేవీ సివిల్ ఎంప్లారుూస్ కో-ఆపరేటికవ్ సొసైటీ ఎన్నికలు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జరనున్నాయి. వీటికి ఫిబ్రవరి ఒకటో తేదీన నామినేన్లు దాఖలు చేయాల్సి ఉంది. రెండో తేదీన నామినేషన్ల పరిశీలన, మూడో తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇందులో 15 మంది డైరక్టర్లను 7,444 మంది సభ్యులు ఎంపిక చేసుకోవలసి ఉంది. ఎనిమిదో తేదీ ఉదయం ఈ సొసైటీకి పోలింగ్ జరుగుతుంది.

భీమిలి లైట్ హౌస్‌కు మహర్దశ
* కేంద్రానికి అప్పగించిన రాష్ట్రం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 30: పూర్తిగా శిథిలావస్థకు చేరిన అతి పురాతనమైన భీమిలి లైట్‌కు మహర్దశపట్టింది. దీన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం లాంఛనప్రాయంగా దీన్ని అప్పగించాల్సి ఉంది. కొద్ది రోజుల కిందటే కేంద్ర బృందం ఈ లైట్ హౌస్‌ను పరిశీలించి వెళ్లింది. భీమిలి ఓడ రేవుగా ఉన్నప్పుడు డచ్‌వారు నౌకల రాకపోకలకు వీలుగా 1868లో ఈ లైట్ హౌస్‌ను నిర్మించారు. గడచిన 20 ఏళ్ళుగా దీని ఆలనాపాలనా చూసే వారే కరువయ్యారు. ఇది పూర్తిగా శిథిలమైపోయింది. కొద్దిపాటి నిధులతో దీనికి పూర్వవైభవం తీసుకురావడానికి అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించలేదు. ప్రస్తుతం రాష్ట్ర ఓడరేవుల శాఖ అధీనంలో ఉంది. బుధవారం ఈ లైట్ హౌస్‌ను కేంద్రానికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కేంద్రం నిధులను కేటాయించి, లైట్ హౌస్‌కు మరమ్మతులు చేపట్టనుంది.

అన్ని గృహాలకూ కుళాయి కనెక్షన్లు
* రైవాడ పైపులైన్ అభివృద్ధికి రూ.300 కోట్లతో ప్రతిపాదన
* రూ.98 కోట్ల పన్నులు వసూలు
విశాఖపట్నం (జగదాంబ), జనవరి 30: నగరంలోని ఇక అన్ని గృహాలకూ కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. నగరంలో కుళాయి కనెక్షన్లు లేని 1,80,000 అసెస్‌మెంట్లను జివిఎంసి అధికారులు గుర్తించారు. తొలి విడతగా 50 వేల కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ కనెక్షన్లను వీలైనంత త్వరగా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. పన్ను బకాయిలు చెల్లించని అసెస్‌మెంట్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ విధానంలోగోదావరి పైపులైన్‌ను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం పనులకు 1500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని డిపిఆర్‌ను తయారు చేశారు. ఇందులో భాగంగా రైవాడ కాలువ అభివృద్ధికి 300 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
ఇదిలా ఉండగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో 128 కోట్ల రూపాయల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 95 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు కమిషనర్ సత్యనారాయణ తెలియచేశారు. మిగిలిన 75 కోట్ల రూపాయలను వచ్చే రెండు నెలల్లో వసూలు చేయాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించినట్టు కమిషనర్ తెలియచేశారు. కాగా, దీర్ఘకాలిక బకాయిలు 110 కోట్ల రూపాయలు. ఇందులో స్టీల్ ప్లాంట్ చెల్లించాల్సిందే 52 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

జివిఎంసిలో అడ్డగోలుగా నామినేషన్ పనులు
* ఇష్టానుసారంగా రూ.7 కోట్లు మంజూరు
* అవుట్ సోర్సింగ్ సిబ్బంది హవా
* కమిషనర్‌ను నిలదీసిన కాంట్రాక్టర్లు

విశాఖపట్నం (జగదాంబ), జనవరి 30: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)లో నామినేషన్ పనులు అడ్డగోలుగా జరుగుతున్నాయి. అక్కడ పనిచేసే సిబ్బంది కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి కోట్ల రూపాయల పనులను ఇష్టానుసారంగా చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే...జివిఎంసి నీటిసరఫరా విభాగంలో పనిచేస్తున్న కొంతమంది అవుట్‌సోర్సింగ్ సిబ్బందే సంబంధిత అధికారులతో చేతులు కలిపి కనీసం చీఫ్ ఇంజనీర్, కమిషనర్‌లకు సైతం తెలియకుండానే లక్షరూపాయలలోపు పనులు నామినేషన్లపై చేపట్టడంతో వాస్తవాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. విశేషం ఏమిటంటే గత జూలై 5వ తేదీన జివిఎంసి నీటిసరఫరా విభాగంలో కోట్లాది రూపాయల నిధులు పక్కదారిపడుతున్నట్లు పూర్తి వివరాలతో కమిషనర్ ఎంవి.సత్యనారాయణకి కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేయడంతో దీనిపై స్పందించిన కమిషనర్ నీటి సరఫరా విభాగానికి సంబంధించిన అధికారులను, ఎడిసిలను విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాని నేటికీ ఆ సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవటం గమనార్హం. ఇలాఉంటే బుధవారం పాత కౌన్సిల్ హాల్‌లో జరిగిన కాంట్రాక్టర్ల సమావేశంలో ఇదే విషయమై పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడుతూ నేటికీ చర్యలు తీసుకోకపోవడంతో కమిషనర్‌ను నిలదీసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
అమలు కాని రోస్టర్ విధానం
జివిఎంసి నీటిసరఫరా విభాగంలో చేపడుతున్న నామినేషన్ల పనులకు సంబంధించి రోస్టర్ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. జివిఎంసి 72వ వార్డులో సుమారు 74 మంది వరకూ పదివేల రూపాయల డిపాజిట్లు చేసి రోస్టర్ విధానంలో తమ పేర్లను నమోదు చేయించుకున్న వారు ఉన్నారు. అయితే వీరిలో అధికారులతో సన్నిహితంగా ఉన్న వారికి, కిమీషన్లు చెల్లించే వారికి నామినేషన్ల పనులు ఇష్టానుసారంగా ఇవ్వడంతో తీవ్రమైన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జోన్ 1, 2, 3 వీటిలో సుమారు ఏడు కోట్ల రూపాయల వరకూ ముగ్గురు కాంట్రాక్టర్లకే అధికంగా బినామీ నామినేషన్లను ఇవ్వడం గమనార్హం. బుధవారం జరిగిన సమావేశంలో కాంట్రాక్టర్ల యూనియన్ నాయకులు రొంగళి జగన్నాధం, ఆర్గనైజింగ్ సెక్రటరీ సనపల వరప్రసాద్‌లు పూర్తి వివరాలు కమిషనర్‌కు చూపించడంతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి వాస్తవాలు బయల్పడితే సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ ప్రధాన ఇంజనీర

* తొలివిడతగా 27 పిఎసిఎస్‌లకు ఎన్నికలు * ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు * భారీగా పోలీసు బందోబస్తు * ఓటర్ల ప్రసన్నానికి పార్టీల తెరవెనుక ఎత్తులు
english title: 
n

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>