విశాఖపట్నం, జనవరి 30: జిల్లాలో సహకార ఎన్నికల్లోని ప్రధానమైన పోలింగ్ ఘట్టం గురువారం జరగనుంది. జిల్లాలో రెండు విడతలుగా జరగనున్న ఈ ఎన్నికల్లో తొలివిడ పోలింగ్ గురువారం జరుగుతోంది. తొలివిడత 41 సొసైటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 12 సొసైటీల ఎన్నికలు వాయిదాపడ్డాయి. దీంతో 29 సొసైటీలకు మాత్రమే పోలింగ్ జరుగుతోంది. వీటిలోఆనందపురం, వేములవలస, పాండ్రంగి, పద్మనాభం, రెడ్డిపల్లి, బాందేవుపురం, గంధవరం, తగరపువలస, చూచుకొండ, మునగపాక, నాగులాపల్లి, సిహెచ్‌ఎన్ అగ్రహారం, కశింకోట, నర్శింగిబిల్లి, జుత్తాడ, లక్ష్మీపురం, జన్నవరం, గవరవరం, చోడవరం, భోగాపురం, గోవాడ, చౌడవాడ, చీడికాడ, దేవరాపల్లి, కలిగొట్ల, ఎం అలమండ, ములకలాపల్లి, అనంతగిరి, గుంటసీమ సొసైటీలకు పోలింగ్ జరుగుతోంది.
ఈ పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ జరుగుతుంది. 287 సెగ్మెంట్లలో జరిగే పోలింగ్‌కు 33 పోలింగ్ కేంద్రాలను, 287 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌లో 41,386 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 29 పిఎసిఎస్‌ల పరిధిలో 700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మర్రిపాలెంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోను, అనకాపల్లిలోని జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలోను, చోడవరం గవర్నమెంట్ జూనియర్ కళాశాలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, పోలింగ్ మెటీరియల్‌ను ఆయా పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లేందుకు 16 బస్సులను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం 1112 మంది సిబ్బందిని నియమించారు. ఐదు తీవ్ర సమస్యాత్మక సొసైటీలను అధికారులు గుర్తించారు. వీటిలో చూచుకొండ, కశింకోట, నర్శింగిబిల్లి, నాగులాపల్లి, మునగపాక ఉన్నాయి. సమస్యాత్మ సొసైటీలుగా అనంతగిరి, గుంటసీమ, బాందేవ్‌పురం, గంధవరం, పాండ్రంకి, రెడ్డిపల్లి, చీడికాడలను గురించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం పోలింగ్ జరగనుంది. పోలింగ్ పూర్తి కాగానే, ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రాత్రికి ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
కాగా, ఆయా సొసైటీల్లో మెజార్టీ డైరక్టర్లను గెలిపించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలూ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సొసైటీల పరిధిలో డైరక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులపై ఆయా రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ పార్టీలకు ప్రతిష్ఠాత్మకం కావడంతో గురువారం జరగనున్న పోలింగ్ రసవత్తరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా గురువారం మరికొన్ని సొసైటీల ఎన్నికలను వాయిదా వేశారు. వీటిలో కొత్తపాలెం, అరకు, చోద్యం ఉన్నాయి. వడ్డాది ఎన్నిక కూడా వాయిదా పడుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక ఇండియన్ నేవీ సివిల్ ఎంప్లారుూస్ కో-ఆపరేటికవ్ సొసైటీ ఎన్నికలు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన జరనున్నాయి. వీటికి ఫిబ్రవరి ఒకటో తేదీన నామినేన్లు దాఖలు చేయాల్సి ఉంది. రెండో తేదీన నామినేషన్ల పరిశీలన, మూడో తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇందులో 15 మంది డైరక్టర్లను 7,444 మంది సభ్యులు ఎంపిక చేసుకోవలసి ఉంది. ఎనిమిదో తేదీ ఉదయం ఈ సొసైటీకి పోలింగ్ జరుగుతుంది.
భీమిలి లైట్ హౌస్‌కు మహర్దశ
* కేంద్రానికి అప్పగించిన రాష్ట్రం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 30: పూర్తిగా శిథిలావస్థకు చేరిన అతి పురాతనమైన భీమిలి లైట్‌కు మహర్దశపట్టింది. దీన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం లాంఛనప్రాయంగా దీన్ని అప్పగించాల్సి ఉంది. కొద్ది రోజుల కిందటే కేంద్ర బృందం ఈ లైట్ హౌస్‌ను పరిశీలించి వెళ్లింది. భీమిలి ఓడ రేవుగా ఉన్నప్పుడు డచ్‌వారు నౌకల రాకపోకలకు వీలుగా 1868లో ఈ లైట్ హౌస్‌ను నిర్మించారు. గడచిన 20 ఏళ్ళుగా దీని ఆలనాపాలనా చూసే వారే కరువయ్యారు. ఇది పూర్తిగా శిథిలమైపోయింది. కొద్దిపాటి నిధులతో దీనికి పూర్వవైభవం తీసుకురావడానికి అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించలేదు. ప్రస్తుతం రాష్ట్ర ఓడరేవుల శాఖ అధీనంలో ఉంది. బుధవారం ఈ లైట్ హౌస్‌ను కేంద్రానికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కేంద్రం నిధులను కేటాయించి, లైట్ హౌస్‌కు మరమ్మతులు చేపట్టనుంది.
అన్ని గృహాలకూ కుళాయి కనెక్షన్లు
* రైవాడ పైపులైన్ అభివృద్ధికి రూ.300 కోట్లతో ప్రతిపాదన
* రూ.98 కోట్ల పన్నులు వసూలు
విశాఖపట్నం (జగదాంబ), జనవరి 30: నగరంలోని ఇక అన్ని గృహాలకూ కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. నగరంలో కుళాయి కనెక్షన్లు లేని 1,80,000 అసెస్‌మెంట్లను జివిఎంసి అధికారులు గుర్తించారు. తొలి విడతగా 50 వేల కనెక్షన్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ కనెక్షన్లను వీలైనంత త్వరగా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. పన్ను బకాయిలు చెల్లించని అసెస్‌మెంట్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ విధానంలోగోదావరి పైపులైన్‌ను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తం పనులకు 1500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని డిపిఆర్‌ను తయారు చేశారు. ఇందులో భాగంగా రైవాడ కాలువ అభివృద్ధికి 300 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
ఇదిలా ఉండగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో 128 కోట్ల రూపాయల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 95 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు కమిషనర్ సత్యనారాయణ తెలియచేశారు. మిగిలిన 75 కోట్ల రూపాయలను వచ్చే రెండు నెలల్లో వసూలు చేయాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించినట్టు కమిషనర్ తెలియచేశారు. కాగా, దీర్ఘకాలిక బకాయిలు 110 కోట్ల రూపాయలు. ఇందులో స్టీల్ ప్లాంట్ చెల్లించాల్సిందే 52 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
జివిఎంసిలో అడ్డగోలుగా నామినేషన్ పనులు
* ఇష్టానుసారంగా రూ.7 కోట్లు మంజూరు
* అవుట్ సోర్సింగ్ సిబ్బంది హవా
* కమిషనర్‌ను నిలదీసిన కాంట్రాక్టర్లు
విశాఖపట్నం (జగదాంబ), జనవరి 30: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)లో నామినేషన్ పనులు అడ్డగోలుగా జరుగుతున్నాయి. అక్కడ పనిచేసే సిబ్బంది కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి కోట్ల రూపాయల పనులను ఇష్టానుసారంగా చేపడుతున్నారు. వివరాల్లోకి వెళితే...జివిఎంసి నీటిసరఫరా విభాగంలో పనిచేస్తున్న కొంతమంది అవుట్‌సోర్సింగ్ సిబ్బందే సంబంధిత అధికారులతో చేతులు కలిపి కనీసం చీఫ్ ఇంజనీర్, కమిషనర్‌లకు సైతం తెలియకుండానే లక్షరూపాయలలోపు పనులు నామినేషన్లపై చేపట్టడంతో వాస్తవాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. విశేషం ఏమిటంటే గత జూలై 5వ తేదీన జివిఎంసి నీటిసరఫరా విభాగంలో కోట్లాది రూపాయల నిధులు పక్కదారిపడుతున్నట్లు పూర్తి వివరాలతో కమిషనర్ ఎంవి.సత్యనారాయణకి కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేయడంతో దీనిపై స్పందించిన కమిషనర్ నీటి సరఫరా విభాగానికి సంబంధించిన అధికారులను, ఎడిసిలను విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాని నేటికీ ఆ సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవటం గమనార్హం. ఇలాఉంటే బుధవారం పాత కౌన్సిల్ హాల్‌లో జరిగిన కాంట్రాక్టర్ల సమావేశంలో ఇదే విషయమై పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడుతూ నేటికీ చర్యలు తీసుకోకపోవడంతో కమిషనర్‌ను నిలదీసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
అమలు కాని రోస్టర్ విధానం
జివిఎంసి నీటిసరఫరా విభాగంలో చేపడుతున్న నామినేషన్ల పనులకు సంబంధించి రోస్టర్ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. జివిఎంసి 72వ వార్డులో సుమారు 74 మంది వరకూ పదివేల రూపాయల డిపాజిట్లు చేసి రోస్టర్ విధానంలో తమ పేర్లను నమోదు చేయించుకున్న వారు ఉన్నారు. అయితే వీరిలో అధికారులతో సన్నిహితంగా ఉన్న వారికి, కిమీషన్లు చెల్లించే వారికి నామినేషన్ల పనులు ఇష్టానుసారంగా ఇవ్వడంతో తీవ్రమైన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జోన్ 1, 2, 3 వీటిలో సుమారు ఏడు కోట్ల రూపాయల వరకూ ముగ్గురు కాంట్రాక్టర్లకే అధికంగా బినామీ నామినేషన్లను ఇవ్వడం గమనార్హం. బుధవారం జరిగిన సమావేశంలో కాంట్రాక్టర్ల యూనియన్ నాయకులు రొంగళి జగన్నాధం, ఆర్గనైజింగ్ సెక్రటరీ సనపల వరప్రసాద్‌లు పూర్తి వివరాలు కమిషనర్‌కు చూపించడంతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి వాస్తవాలు బయల్పడితే సిబ్బందిపై కఠినచర్యలు తీసుకోవాలంటూ ప్రధాన ఇంజనీర