అనకాపల్లి టౌన్, జనవరి 30: మండలంలోని పిసినికాడ సమీపంలోని బుధవారం రాత్రి ట్రాఫిక్ ఎస్‌ఐ ఇంటిలో దొంగలు పడి ఏడు లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి నగలను దోచుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. పిసినికాడ గ్రామంలో నివసిస్తున్న విజయనగరానికి చెందిన ట్రాఫిక్ ఎస్‌ఐ ఐ. రామారావు ఇంటిలో మంగళవారం రాత్రి దొంగలు చొరబడి సుమారు 23 తులాల బంగారం, 32 తులాల వెండి, పదివేల నగదు, పలు విలువైన ఎటిఎం కార్డులు చోరీకి గురయ్యాయి. బుధవారం ఊరికెళ్లి తిరిగి వచ్చిన ఎస్‌ఐ భార్య సుమతి ఇంటికి వచ్చి చూడగా, ఇంటి తలుపులు ఇంటి వెనుకభాగంలో ఉన్న కిటికీలు తెరచి ఉండటంతో ఆమె లబోదిబోమంటూ ఇంటిలోకి వెళ్లి చూసుకున్నారు. బీరువాలో నుండి బట్టలన్నీ కిందకు పడేసి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి భర్త రామారావుకు విషయం తెలియజేసింది. ఈ విషయం తెలుసుకున్న రామారావు అనకాపల్లి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి రూరల్ ఎస్‌ఐ విజయ్‌కుమార్, విశాఖపట్నం నుండి వచ్చిన క్లూస్ సిబ్బంది చేరుకుని విచారణ ప్రారంభించారు. వీరు ఇంటిలో లేని సమయంలో గమనించి ఈ చోరీకి పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఇంత భారీమొత్తంలో చోరీ జరగడం పట్టణంలో సంచలనం రేకెత్తిస్తుంది. పోలీసులు దీనిని సవాల్‌గా తీసుకుని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్‌ఐ విజయ్‌కుమార్ పేర్కొన్నారు.
తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు..
బొండపల్లి, జనవరి 30 : బందువుల ఇంటికి వచ్చి బుదవారం ఉదయం తప్పిపోయిన బాలుడు తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరిన విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడ గ్రామానికి చెందిన పైల మనోహర్ (7) అనే బాలుడు తల్లిదండ్రులతో కలసి మంగళవారం సాయంత్రం గజపతినగరం మండలం పిడిశీల గ్రామంలో గల బందువుల ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం మనోహర్ కనిపించక పోవడంతో బందువులతో సహా తల్లిదండ్రులు గౌరి పైడిరాజులు, ఆందోళనకు గురయ్యారు. మనోహర్ గొల్లలపేట చెరువు వద్ద చేపలు పడుతుండగా సమీపంలో గల అదే గ్రామానికి చెందిన ముద్దాడ అప్పలనాయుడు, బొడ్డు అప్పలనాయుడు, పోలీస్ స్టేషన్‌కు అప్పలగించారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులకు ఎస్సై డిడి నాయుడు సమక్షంలో క్షేమంగా బాలుడిని అప్పగించారు.
గొర్రెల సహకార సంఘం
ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు
జామి, జనవరి 30 : గొర్రెల సహకార సంఘం ఎన్నికలను మండలంలోని ఆర్‌బిపురం గ్రామానికి చెందిన యాదవ కులస్తులు బహిష్కరించారు. ఈఎన్నికలకు సంబంధించిన ముందస్తు చర్యలను మండల పశువైద్యాధికారి జి. శ్రీనివాసు ఎక పక్షంగా నిర్వహించారని సంఘం సభ్యులకు ఎటువంటి సమాచారం లేకుండా చేసారని ఆరోపించారు. అంతే కాకుండా సంఘ సభ్యులు 91 మందికి గాను వీరిలో 10 లమంది సభ్యులు మరణిస్తే 81 మంది సభ్యుల్లో కేవలం 70 మంది సభ్యత్వాలను గొప్యంగా తీసుకొని గ్రామంలో ముందస్తు సమాచారం ఇవ్వంకుండా బుధవారం ఉదయ ఎన్నికల అధికారి వైద్యులు ఎల్ విష్ణు మండల పశువైద్య అధికారి ఇ. శ్రీనివాసు ఎన్నికలను నిర్వహించే ప్రయత్నం చేయడం దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో ఓక వర్గం సభ్యులు అంతా ఎన్నికలను జరగనీయకుండా అడ్డుపడటంతో సంఘం ఎన్నికలను నిలిపివేసి అధికారులు వేనుదిరిగి వెళ్ళిపోయారు.
సిటు నేతల తీరుపై కలెక్టర్ ఆగ్రహం
విజయనగరం (్ఫర్టు), జనవరి 30: కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గురించి రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్ బి.రామాంజనేయులు వివరిస్తున్న సమయంలో సిఐటియు నాయకులు హడావుడి చేశారు. జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బుధవారం సాయంత్రం జరిగిన అవగాహన సదస్సులో జిల్లాకలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, కార్మిక కమిషనర్ రామాంజనేయులతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణతోపాటు పురం అప్పారావు, బచ్చల సూర్యనారాయణ, నారాయణరావువాగ్వివాదానికి దిగారు. దీంతో అవగాహన సదస్సు గందరగోళంగా మారింది. జిల్లాలో కార్మికుల సంక్షేమం గురించి ఎవరూ పట్టించుకోవడంలేదని, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు వాదించారు. అయితే జిల్లా కలెక్టర్, కార్మికశాఖ కమిషనర్ సర్ధిచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వినిపించుకోలేదు. దీంతో జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, కమిషనర్ రామాంజనేయులు ఆసహనం వ్యక్తం చేశారు. 3 ఒక ఒక్కరి కోసం అందరిని ఇబ్బందులు పెట్టొద్దు అని కమిషన్ అనగా, సమస్యల గురించి విన్నవించుకోవాలంటే బయటకు వెళ్లాలని, సమావేశం జరిగిన తర్వాత ఎంతసేపైనా సమస్యలను వింటామని కలెక్టర్ చెప్పడంతో సిఐటియు నాయకులు వౌనం వహించారు. సిఐటియు నాయకుల తీరుపై మిగతా కార్మిక సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్మికులకు పుట్టినిల్లు విజయనగరం జిల్లా అని, ఈ జిల్లాకు చెందిన కార్మికులు నిబ్ధత, నిజాయితీ, గౌరవంతో జిల్లాకు మచ్చలేకుండా బాగా పనిచేస్తారని కితాబు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో కార్మిక సమస్యలపై అవగాహన పెంచుకునేందుకు అన్ని భాగస్వామ్యం చేస్తామన్నారు.
‘సహకార’ ఎన్నికలకు
ఏర్పాట్లు పూర్తి
విజయనగరం (్ఫర్టు), జనవరి 30: విజయనగరం డివిజన్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని సంఘాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విజయనగరం డివిజనల్‌లో మొత్తం 46 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 11 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 35 సంఘాలకు గురువారం ఎన్నిక నిర్వహిస్తారు. ఏకగ్రీవమైన వాటిలో జొన్నవలస, గాజులరేగ, సోమలింగాపురం, కె.ఎం.పురం, కుమిలి, వెంపడాం, సాతంవలస, మెరకముడిదాం, చినబంటుపల్లి, తాటిగూడ సంఘాలు ఉన్నాయి. మొత్తం 581 ప్రాదేశిక నియోజకవర్గాలకు 250 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 331 ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి 727 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా 95 ఎస్సీలకు, 84 మహిళ ఎస్సీ, 79 ఎస్టీ, 189 బిసి, 665 ఒసి, 95 ప్రాదేశిక నియోజకవర్గాలను ఒసి మహిళలకు కేటాయించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సిబ్బందిని ఆయా సంఘాలకు పంపారు. అనేక సంఘాల్లో 114 పోలీస్ నిషేదాజ్ఞలు విధించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా పటిష్టవంతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ముగ్గురు డిఎస్‌పిలు, 11మంది ఇన్‌స్పెక్టర్లు, 37మంది ఎస్‌ఐలు, 72మంది ఎఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, 256 మంది కానిస్టేబుళ్లు, 90మంది హోమ్‌గార్డులు, 39మంది మహిళా కానిస్టేబుళ్లను, 93మంది ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులను నియమించారు. అదేవిధంగా ఎస్‌ఐస్థాయి అధికారుల పర్యవేక్షణలో 10 మొబైల్ బృందాలను, ఇన్‌స్పెక్టర్‌స్థాయి అధికారుల పర్యవేక్షణలో 11 స్ట్రైకింగ్ ఫోర్స్‌ను, డిఎస్‌పి స్థాయి అధికారుల పర్యవేక్షణలో మరో మూడు ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ నియమించారు.
ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు వుడా ప్రతిపాదన
ఆంధ్రభూమి బ్యూఠో,
విజయనగరం, జనవరి 30: పరిధి పెరిగిన నేపథ్యంలో పట్టణంలో వుడా ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నట్లు వుడా వైస్ చైర్మన్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. ఈ మేరకు కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని ఎంపిక చేసేందుకు ఆయన బుధవారం ఇక్కడ పర్యటించారు. జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్యతో కలిసి ఆయన పర్యటించారు. వుడా అభివృద్ధి చేసిన ఆనందగజపతి ఆడిటోరియంలోనే కార్యాలయం ఏర్పాటు చేసే ప్రతిపాదన పట్ల వీసీ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లను చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వుడా పరిధిలోకి విజయనగరం, గంట్యాడ, ఎస్.కోట, వేపాడ, ఎల్.కోట, కొత్తవలస, జామి, నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లోని పలు గ్రామాలు చేరాయని వివరించారు. వివిధ పనుల నిమిత్తం విశాఖకు రాకుండా ప్రాంతీయ కార్యాలయం వద్ద సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇదే తరహాలో బుధవారం శ్రీకాకుళంలో కార్యాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. అంతకుముందు వుడా చేపట్టిన రింగ్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. రింగ్ రోడ్డు జంక్షన్ నుంచి దాసన్నపేట రైతు బజారు వరకూ ఉన్న 2.6 కిలోమీటర్ల రహదారిని 100 అడుగులకు విస్తరించే పనులను 9.7 కోట్లతో చేపట్టింది. ఈ పనులను ఆయన పరిశీలించారు. ఈ రహదారి విస్తరణలో ట్రాఫిక్ సమస్య తీరే అవకాశం ఉందని వుడా చీఫ్ ఇంజనీర్ విశ్వనాథరావు వివరించారు. ఇ.ఇ ప్రసాదమూర్తి, డిఇఇలు దేవి ప్రసాద్ పాత్రో, శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.
పర్వదినాలలో వేణుగోపాలునికి నగల అలంకరణ
బొబ్బిలి, జనవరి 30: పర్వదినాలలో వేణుగోపాలుని ఆభరణాలను అలంకరించి భక్తులకు కనువిందు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వేణుగోపాలస్వామి ఆలయ అనువంశిక ధర్మకర్త, ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణరంగారావు తెలిపారు. వేణుగోపాలస్వామికి సంబంధించిన ఆభరణాలను బుధవారం స్టేట్‌బ్యాంకు లాకర్ నుంచి తీసి వేణుగోపాలస్వామి ఆలయ ప్రవచన మండపం ఆవరణలో లెక్కించారు. సి.ఐ. రాజేశ్వరరావు పటిష్టమైన బందోబస్తు మధ్య స్టేట్ బ్యాంకు నుంచి ఈ ఆభరణాల పెట్టెను వ్యాన్ ద్వారా ఆలయానికి తీసుకువచ్చారు. దేవాదాయశాఖ జిల్లా అధికారి రమణమ్మ అధ్యక్షతన సీల్డ్ పెట్టెను ఓపెన్ చేసి పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణరంగారావు విలేఖర్లతో మాట్లాడుతూ చారిత్రాత్మకమైన వేణుగోపాలస్వామికి సంబంధించిన ఆభరణాలు, వజ్రవైడూర్యాలు, కెంపులు, తదితర విలువైన వస్తువులను పరిశీలించామన్నారు. రికార్డు ప్రకారం వీటి సంఖ్యను లెక్కించాల్సి ఉందన్నారు. వీటిని నిపుణులతోపాటు ఖరీదు, బరువులను వేయించాల్సి ఉందన్నారు. కమిటీ, దేవాదాయశాఖతో చర్చించి పర్వదినాలలో వేణుగోపాలస్వామికి ఏ నగలు అలంకరించాలో అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పూర్తిగా వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలకు నగలు, ఆభరణాలను ఆలకరించి పట్టణ ప్రజలకు, భక్తులకు కనువిందు చేసే సమయం ఆసన్నమైందన్నారు. ఇంతకాలం భద్రత లేని కారణంగా అలంకరించలేదని, ఇక నుంచి పటిష్టమైన బందోబస్తు మధ్య వీటిని అలంకరించేందుకు చర్యలు చేపడతామన్నారు. 1957లో ఈ ఆభరణాలను లాకర్‌లో ఉంచినట్లు రికార్డుల ఆధారంగా తెలిసిందన్నారు. 2002లో బ్యాంకులోనే దేవాదాయశాఖ, వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ సభ్యులు తిలకించినట్లు తెలుస్తోందన్నారు. అలాగే వేణుగోపాలునికి సంబంధించిన అన్యాక్రాంతంలో ఉన్న భూముల విషయంపై రైతులతో చర్చించి స్వాధీనం పర్చుకుంటామన్నారు. అలాగే వీటికి రావల్సిన సిస్తులను వసూళ్లు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులతో చర్చిస్తామన్నారు. ఈ భూములకు సంబంధించిన నీటి తీరువా సుమారు 5లక్షలు రూపాయలు చెల్లించాలని రెవెన్యూ అధికారుల ద్వారా నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జె.ఇ.ఓ. సుబ్రహ్మణ్యం, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ నాగభూషణం, ఇ.ఓ. అప్పారావు, సి.ఐ.రాజేశ్వరరావు, నాగార్జున, పుష్పనాధం, దేవాదాయశాఖ సభ్యులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ తీరుపై
మండి పడ్డ ఎమ్మెల్యే
కొత్తవలస, జనవరి 30 : ఎస్.కోట నియోజకవర్గంలో సహకార ఎన్నికల్లో అధికారి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న వైఖరిపై ఎమెల్యే కోల్ళలలిత కుమారి తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ఓటర్లను ప్రలోబానికి గురిచేయడమే కాకుండా ఇతర పార్టీల కార్యకర్తలను, ఓటర్లను భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇనే్నళ్ళు సహకార సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కలుగుజేసినకునేది కాదని ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమైందని చెప్పారు. అధికార పార్టీ నాయకుల్లో భయం రేగుతోందన్నారు. నియోజకవర్గంలో మొత్తం 7 సహకార సంఘాల్లో 6 సంఘాల్లో నువ్వానేనా అన్న పోటీ ఉందన్నారు. కృష్ణమహంతిపురం సంఘం ఏక గ్రీవం అయిందని చెప్పారు. 77 వార్డులలో 6 ఏకగ్రీవం కాగా మిగతా చోట్ల తీవ్రపోటీ ఉందన్నారు. కాంగ్రెస్‌పార్టీ జిల్లా నాయుకులు రాజకీయ ధనబలంతో ఓటర్లను బెదిరిస్తున్నారని చెప్పారు. ఎంతటి నీటమైన పనికైనా సిద్ధంగా ఉంటూ అధికారులను సైతం భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. జామి, వేపాడ, ఎస్‌కోట, కొత్తవలస, మండలాల్లో పార్టీ పటిష్టంగా పనిచేస్తోందని,ఎల్‌కోట మండలంలో గతం కంటే మెరుగ్గాఉందని అన్నారు.
‘కార్మికుల సంక్షేమానికి పెద్దపీట’
విజయనగరం (్ఫర్టు), జనవరి 30: రాష్ట్రప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ కమిషనర్ బి. రామాంజనేయులు తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బుధవారం సాయంత్రం భవన, ఇతర కార్మిక చట్ట అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ కార్మికులు పనిచేసే ప్రతిచోట అయిదుసూత్రాలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. శ్రమను గుర్తించడం, కనీసవేతనాలు చెల్లించడం, సక్రమంగా పనిచేయించుకోవడం, కనీస భద్రత కల్పించడం, వృతినైపుణ్యం పెంపొందించడం వంటి సూత్రాలను పాటించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ సెస్సు 1050 కోట్ల రూపాయలు ఉందని, ఇందులో 64కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు జరిగిందన్నారు. రానున్న రెండునెలల్లో మరో 500 కోట్ల రూపాయల సెస్సు వసూలు జరుగుతుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 25లక్షల మంది మాత్రమే కార్మిక సంక్షేమబోర్డులో జాయిన్ అయ్యారన్నారు. కార్మికుల సంక్షేమం కోసం జిల్లా కలెక్టర్లు చైర్మన్‌లుగా జిల్లా కార్మిక సంక్షేమబోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లాలో నాలుగున్నర లక్షల మంది కార్మికులు ఉన్నారని, వీరి సంక్షేమానికి ఇతరశాఖల భాగస్వామ్యంతో అనేక చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికశాఖ జాయింట్‌డైరెక్టర్ లక్ష్మణరావు, డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆనందరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌మేనేజర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
రూ. 2 లక్షల మద్యం, నగదు అపహరణ
బొండపల్లి, జనవరి 30 : మండలం పరిధిలోని గొట్లాం గ్రామం వద్ద గల సాయి మహలక్ష్మి మద్యంషాపులో బుధవారం తెల్లవారు జామున దొంగలు పడి మద్యం, నగదు అపహరించుకు పోయారు. జాతీయ రహదారికి పక్కనేఉన్న మద్యం దుకాణం షట్టర్ తాళాలు పగల గొట్టి చోరులు లోనికి ప్రవేశించారు. నగదు పెట్టెలోని సుమారు 20 వేల నగదు షాపులోని మద్యం నిల్వలు, అపహరించుకుపోతూ నగదు పెట్టెను వేరే గదిలో పడేసారు. చోరీ సొత్తు విలువ సుమారు 2 లక్షల వరకూ ఉంటుందని అంచనా. జిల్లా కేంద్రానికి చెందిన ప్రత్యేక క్లూస్ టీమ్ పోలీసులు సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై డిడి నాయుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పరిచయం ఉన్న వ్యక్తులే చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఆర్‌ఒబి పనులకు స్థల పరిశీలన
జామి, జనవరి 30 : మండలంలో భీమసింగి గేటు వద్ద ఆర్‌ఓబి పనులు నిర్వహించేందుకు కావలసిన స్థలాన్ని ఆర్‌డిఒ రాజకుమారి బుధవారం ఉదయం పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి కావలసిన స్థలాలకు సంబంధించి భూములు జిరాయితీ భూములు, ప్రభుత్వ స్థలాలు, రైతులు సాగుభూములు ఎంతెంత ఉన్నాయన్న విషయాలపై స్థల పరిశీలన చేసారు. ఇందులో కొంత మంది రైతులు భూములు బలరాంపురం గ్రామానికి ఇచెందిన స్మశాన వాటిక స్థలం ఆర్ అండ్ బి స్థలాలు గెడ్డ పోరం బోకు స్థలం కొద్ది కొద్దిగా ఉన్నట్లు గుర్తించామని ఆర్‌డిఓ తెలిపారు. తహశీల్ధార్ ఎంవిఎస్ మూర్తి, ఆర్‌ఐ గౌరీశంకర్, సర్వేయర్, శివాజి, విఆర్‌ఓలు గణేష్, సాయిరాంలు తదితరులు పాల్గొన్నారు.
మన్యంలో వైద్య సేవలకు 2 ఆంబులెన్సులు
పార్వతీపురం, జనవరి 30: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రజలకు మాతా,శిశుసంరక్షణ కోసం వైద్య సేవలందించడానికి రెండు అంబులెన్సులను కేంద్ర గిరిజన పంచాయతీరాజ్‌శాఖ, గిరిజన సంక్షేమశాఖామంత్రి మంజూరు చేసిన అంబులెన్సులు రెండింటిని వైద్య సేవల కోసం పార్వతీపురం ఐటిడిఎ నుండి కురుపాం, సాలూరు ప్రాంతాలకు పంపించే చర్యలు ఐటిడిఎ డిప్యూటీ డి ఎం హెచ్ ఒ డాక్టర్ ఎస్.్భస్కరరావు, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ జె.వసంతరావులు బుధవారం చేపట్టారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి ఆర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు అధికారులు ఈ రెండు అంబులెన్సులను ఆయా ప్రాంతాలకు తరలించారు. డిప్యూటీ డి ఎం హెచ్ ఒ డాక్టర్ భాస్కరరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని వైద్యసేవలు కోసం వీటిని వినియోగించడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
‘గాంధీ మార్గం
అనుసరణీయం’
విజయనగరం(టౌన్), జనవరి 30 : మహాత్మా గాంధీ చూపిన బాటలో యువత నడవాలని, గాంధీ మార్గం అందరికీ అనుసరణీయమని జిల్లా కలెక్టర్ ఎం. వీరబ్రహ్మయ్య తెలిపారు. మృత వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకుని బుధవారం కలెక్టర్ ఆడిటోరియంలో గాంధీజి చిత్రపటానికి కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ పిఎ శోభ తదితరులు పూల మాలవేసి 2 నిమిషాలు వౌనంపాటించారు. అనంతరం కలక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీజి విగ్రహాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతోందంటే గాంధీజీ కృషేనని అనివర్ణించారు. వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. గాంధీ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి శ్రీకాకుశం జిల్లా శ్రీకూర్మంనకు చెందిన దివిలి అప్పారావు మాట్లాడుతూ విజయనగరం కలెక్టరేట్‌కు శోభను తెచ్చిపెట్టిన గాంధీ విగ్రహాన్ని తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హేమసుందర వెంకట్రారావు,పార్వతీపురం ఆర్డీఓ వెంకటరావు, కలక్టరేట్ పాలనాధికారి చంద్రకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
‘అవధానం ఆంధ్రుల సొత్తు’
గజతపతినగరం, జనవరి 30 : ఆంధ్రుల సొత్తు అవధానమని ప్రధాన వక్త విశ్రాంత జిల్లా న్యాయమూర్తి ప్రాత వేణుగోపాలరావు అభిప్రాయపడ్డారు. స్థానిక లయన్స్ ట్రస్ట్భువనంలో బుధవారం చైతన్యభారతి 243వ సభగా అవధాన కర్త డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరంచే అభినవ ఆంధ్ర శతావధానం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రక్రియల్లో అవధాన ప్రక్రియ చాలా క్లిష్టమైనదని తెలుగువారి ధారణా శక్తి అవధానం అని అన్నారు. ముఖ్యఅతిధి బుద్దరాజు జానకిరామరాజు మాట్లాడుతూ కనుమరుగవుతున్న తెలుగుభాష గొప్పతనాన్ని, గౌరవాన్ని, ప్రాధాన్యతను అవధానం బతికించాలని అభిలషించారు. అభినవ ఆంధ్రా శతావధానం ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా అవలంభించిన ప్రక్రియగా అవధాన కర్త కట్టమూరి చెప్పారు. ఆర్‌విఎస్ సుబ్రహ్మణ్యం, భాగవతుల గోపాలరావులు సమస్యలు తెలియజేయగా అవధాని దానిని పద్యరూపంలో వివరించారు. భళ్ళమూడి శంకరరావు, భమిడిపాటి బాస్కరరావులు వర్ణనలు చేయమనగా అవధాని చక్కగా వివరించారు. తవ్వా అనంతరావు, పాయల మురళీకృష్ణలు దత్తపదులు ఇవ్వగా, గండ్రేటి అప్పలనాయుడు, పి రమణమూర్తిలు చమత్కారములు అడగగా పూరించారు. డిజిఎస్ శ్రీనివాస్‌నాటక ప్రక్రియలో అవధాని ద్వారా పద్యాలు చెప్పించారు. కార్యక్రమంలో డా.బిఎస్‌ఆర్ మూర్తి, డా.వి.కృష్ణారావు, విశ్రాంత జిల్లా న్యాయమూర్తి ఎం రాజభూషణం, జి లక్ష్మణరావు, ఎం రామ్మూర్తి పంతులు, బొంతల కోటి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
‘నీటి ప్యాకెట్ల అమ్మకానికి అనుమతివ్వాలి’
బొబ్బిలి, జనవరి 30: ప్రజల దాహార్తిని తీర్చేందుకు పట్టణంలో వాటర్ ప్యాకెట్ల విక్రయాలకు అనుమతించాలని పాన్‌షాప్స్ యూనియన్ అధ్యక్షులు లంక రమేష్ మున్సిపల్ కమిషనర్ చంద్రికను కోరారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం వాటర్ ప్యాకెట్లు విషయంపై కమిషనర్ చంద్రికకు వినతిపత్రాన్ని అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దాహార్తిని తీర్చేందుకు వీటిని విక్రయించేందుకు అనుమతివ్వాలన్నారు. వినియోగించిన ప్యాకెట్లును డస్ట్‌బిన్‌లో వేసే ఏర్పాటు చేయిస్తామన్నారు. వివిధ దూర ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చిన వారు తాగేందుకు మంచినీరు పలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రధానంగా వైద్యం నిమిత్తం ఆసుపత్రులకు వచ్చిన వారు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజా అవసరాల దృష్ట్యా వాటర్ ప్యాకెట్ల విక్రయానికి అనుమతివ్వాలని కోరారు. ఇందుకు ఆమె స్పందిస్తు పాలిథీన్‌ను వినియోగించడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని, ఈ మేరకు పట్టణంలో పాలిథీన్ కవర్లు, గ్లాసులతోపాటు వాటర్ ప్యాకెట్ల వినియోగాన్ని నిషేదించడం జరిగిందన్నారు. వీటిని వినియోగించి రోడ్లుపైన, కాలువల్లో పడవేస్తుండటంతో పలు ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఈ నేపథ్యంలో వీటిని నిషేదించామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పలు ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. వాటర్ ప్యాకెట్లును విక్రయించరాదని కోరారు. ఈ కార్యక్రమంలో పాన్‌షాప్స్ సంఘ సభ్యులు సి.హెచ్. అచ్యుతరావు, శ్రీనివాసరావు, శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.
‘రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలి’
పార్వతీపురం, జనవరి 30: గిరిజన విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు తగు చర్యలు తీసుకోవాలని పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి ఆర్ అంబేద్కర్ కోరారు. బుధవారం స్థానిక ఐటిడిఎ గిరిమిత్ర సమావేశంలో మాట్లాడుతూ రక్తహీనత పంపిణీ కార్యక్రమంపై నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పీవో అంబేద్కర్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో రక్తహీనత ఉందని ముఖ్యంగా బాలికల్లో రక్తహీనత ఎక్కువగా ఉందని పీవో అన్నారు. గిరిజన విద్యార్థుల్లో రక్తహీనత 66శాతం వరకు ఉన్నట్టు నిర్థారణ అయిందన్నారు. అందువల్ల రక్తహీనతకు సంబంధించిన ఐరన్ మాత్రలు సక్రమంగా అందించే బాధ్యత ఉపాధ్యాయులతో పాటు వైద్యసిబ్బంది తీసుకోవాలన్నారు. పదవతరగతి పరీక్షలు సమీపిస్తున్నందున ఇంకా రెండునెలల వరకు వారు పాఠశాలల్లో ఉంటారని అందువల్ల వారికి కూడా ఐరన్ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రతి గురువారం ఆయా పాఠశాలల్లోని విద్యార్థులకు ఐరన్ మాత్రలు పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాగిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ సి ఎ ఆనంద్ మణికుమార్ మాట్లాడుతూ జిల్లాలోని గిరిజన ఆశ్రమ, గిరిజన గురుకుల, కెజిబివి పాఠశాలల్లో 17651మంది విద్యార్థులకు, అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న 1284మంది విద్యార్థులకు ఐరన్ మాత్రమే పంపిణీ చేసే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రక్తహీనత నివారణ కార్యక్రమం 6నుండి 14 ఏళ్ల లోపు పిల్లలకు ఈ మాత్రలు అందిస్తున్నప్పటికీ భవిష్యత్తులో 19 ఏళ్లలోపు వారందరికీ అందించే చర్యలు తీసుకునే వీలుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ డిప్యూటీ డిఎం హెచ్ ఒ డాక్టర్ ఎస్.్భస్కరరావు మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చేపట్టే ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ ఆరోగ్యబాల రక్ష వైద్యాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ డి ఇ వో అప్పలరాజులు పాల్గొన్నారు.
‘ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బడ్డేపల్లిని గెలిపించాలి’
పార్వతీపురం, జనవరి 30: ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యుటి ఎఫ్ బలపరచిన ప్రొగ్రెసివ్ డెమక్రటివ్ ఫ్రంట్ అభ్యర్థి బొడ్డేపల్లి మోహనరావును గెలిపించాలని పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎంవి ఎస్ శర్మ కోరారు. బుధవారం ఆయన పార్వతీపురంలోని ఏర్పాటు చేసిన విలేఖరులతో మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై తమకు కూడా ఎంతో అనుభవం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యుటి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్.మురళీ మోహనరావుమాట్లాడుతూ తాము మద్దతు ఇస్తున్న అభ్యర్థి మోహనరావును గెలిపించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలోజిల్లా నాయకుడు కె.్భస్కరరావు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసుల నాయుడుకు మద్దతుగా పార్వతీపురంలో బుధవారం పి ఆర్ టియు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎన్నికల కార్యాలయాన్ని ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.తవిటినాయుడు ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పి ఆర్ టియు సంఘ రాష్ట్ర నాయకులు బలగ శంకరరావు, రోజారమణిలతో పాటు పి.శివప్రసాద్, చొక్కాపు జనార్థనరావు, సిహెచ్ నర్సింగరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
అదుపులోకి అతిసార
సీతానగరం, జనవరి 30: మండలంలో గల పది రోజులుగా విజృంభిస్తున్న డయేరియా వ్యాధి క్రమక్రమంగా అదుపులోనికి వస్తుంది. బుధవారం నాటికి వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 4 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ మేరకు ఆసుపత్రిలో వైద్యాధికారి మల్లిఖార్జునరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఆరోగులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. వ్యాధి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాల్సిన ఆవస్యకత ఉందని, వేడి నీటితోపాటు తాజా ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు శాఖల అతీతంగా అధికారులంతా అప్రమత్తంగా ఉండటం వలన వ్యాధి అదుపులోనికి వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
‘పేద విద్యార్థులను ఆదుకుంటాం’
బొబ్బిలి, జనవరి 30: నిరుపేద విద్యార్థులను ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కారుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జెసి రాజు తెలిపారు. వాడాడకు చెందిన నిరుపేద విద్యార్థి కె స్వాతి డిఇడి శిక్షణకు వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో బుధవారం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఆధారం లేక చదువుకోవాలన్న తపన ఉన్న పేద విద్యార్థులను ఆదుకుంటామన్నారు. వారి విద్యాభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ ఫౌండేషన్ అధ్యక్షుడు తెంటు సత్యంనాయుడు, సభ్యులు బెంజ్‌మెన్‌పాల్, తదితరులు పాల్గొన్నారు.
20 మద్యం సీసాలు స్వాధీనం
బొబ్బిలి(రూరల్), జనవరి 30:మండలం కోమటిపల్లి గ్రామంలో బుధవారం బెల్ట్‌షాపుపై దాడి చేసి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రాజేశ్వరరావు తెలిపారు. అందిన సమాచారం మేరకు బెల్ట్‌షాపును దాడి చేసి వీటిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఈ షాపును నిర్వహిస్తున్న ప్రసాద్‌ను అదుపులోనికి తీసుకుని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు ఈకేసును అప్పగించినట్లు తెలిపారు.
రైలు నుంచి జారిపడి ఒకరికి గాయాలు
బొబ్బిలి, జనవరి 30: వెళుతున్న రైలును ఎక్కబోయి గాయపడిన వ్యక్తి వైనం ఒకటి వెలుగుచూసింది. పార్వతీపురం చినబోరబందకు చెందిన జి.అప్పారావు బుధవారం సాలూరు వెళ్లేందుకు బొబ్బిలి రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. అప్పటికే వెళుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా జారిపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడటంతో 108వాహనంలో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు 39 సొసైటీలకు ఎన్నికలు
ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ - 3 గంటల నుండి కౌంటింగ్
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, జనవరి 30 : జిల్లాలో తొలిదశ ఎన్నికల నిర్వహణలో భాగంగా మొత్తం 39 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు గురువారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, సహకార శాఖ పూర్తి చేశాయి. జిల్లాలోని మూడు రెవిన్యూ డివిజన్ల పరిధిలోని 39 సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 118 సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా వీటిలో 75 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 43 సంఘాల్లో పెనుగొండ సొసైటీ ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంత పరిణామాల్లో కొవ్వూరు డివిజన్‌లోని పైడిపర్రు, ఏలూరు డివిజన్‌లోని భీమడోలు సొసైటీల ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. తాజాగా బుధవారం సాయంత్రం ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెం సొసైటీ ఎన్నికను నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడటంతో 39 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎన్నికలు జరిగే సంఘాలివే...
భీమవరం డివిజన్‌లోని ఉండి, కాళ్ల, ఎల్‌జి పాడు, పాలకోడేరు, ఏలూరు డివిజన్‌లోని గుణ్ణంపల్లి, పెదవేగి, జాలిపూడి, గోగుంట, విజయరాయి,జోగన్నపాలెం, సీతంపేట, ద్వారకాతిరుమల, ఏలూరు, పోతునూరు, గుండుగొలను, తాడేపల్లి, శనివారపుపేట, నల్లజర్ల, కొవ్వలి, నవాబుపాలెం, పోతవరం, తాడేపల్లిగూడెం, పెదకడిమి, తిరుమలంపాలెం, నారాయణపురం, ఆరుగొలను, జి కొత్తపల్లి, కొవ్వూరు డివిజన్‌లోని మాముడూరు, ఎస్ ఐ పర్రు, వెలగలేరు, మునమర్రు, సిద్ధాంతం, ఉనికిలి, వరిఘేడు, కానూరు, శ్రీపర్రు, మల్లేశ్వరం, కాల్దారి, మోర్త సహకార సంఘాల ఎన్నికలకు సహకార శాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు, పత్రాలను పోలీసు భద్రత మధ్య తరలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ బూత్‌ల వద్ద 144వ సెక్షన్ విధించారు. అలాగే తొమ్మిది సమస్యాత్మకప్రాంతాలను గుర్తించారు. పెదవేగి మండలంలోని విజయరాయి, పెదకడిమి, దెందులూరు మండలంలోని పోతునూరు, భీమడోలు మండలంలోని భీమడోలు, ద్వారకాతిరుమల మండలంలోని ద్వారకాతిరుమల, జి కొత్తపల్లి, తాడేపల్లిగూడెం మండలంలోని తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలంలోని నల్లజర్ల, ఉండి మండలంలోని ఉండి సహకార సంఘాలను సమస్యాత్మక సంఘాలుగా గుర్తించారు. ఈ పోలింగ్ బూత్‌ల వద్ద అదనంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఓటరు వారి వద్ద వున్న ఓటరు గుర్తింపు కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వుంటుంది. ఎన్నికల నిర్వహణకు గాను మొత్తం 150 మంది ఎన్నికల అధికారులను జిల్లా కలెక్టర్ నియమించారు. మొదటి విడత ఎన్నికలకు గాను 349 బూత్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 55 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే విధంగా 1416 మందిని ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌కు వినియోగిస్తున్నారు. సహకార ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లను చేసింది.
మరోవైపు బుధవారం ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో మద్యం, డబ్బు పంపిణీ మొదలైపోయింది. పోటీ తీవ్రస్థాయిలో వున్న సొసైటీల్లో ఓటుకు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొని వుండటంతో ఆ రెండు పార్టీలు సహకార ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
భారీ బందోబస్తు
సహకార ఎన్నికలపై ఎస్పీ రమేష్ వెల్లడి
ఏలూరు, జనవరి 30 : జిల్లాలో సహకార సంఘాలకు గురువారం జరగనున్న ఎన్నికలకు సంబంధించి భారీ బందో