కటక్, ఫిబ్రవరి 3: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి టైటిల్ కైవసం చేసుకునే దిశగా ముందంజ వేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మరో 26 బంతులు మిగిలి ఉండగానే, మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 188 పరుగులు సాధించింది. త్రిషా చెట్టి 59, మరిజానే కాప్ 61 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఇలిస్ పెర్రీ 35 పరుగులకు మూడు, మెగాన్ షట్ 42 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కుదిగిన ఆసీస్ 45.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. రాచెల్ హేన్స్ 83 పరుగులు సాధించి, ఆసీస్ విజయంలో ప్రధాన భూమిక పోషించింది. షబ్నిం ఇస్మాయిల్ 41 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టినప్పటికీ, ఆసీస్ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. సుసాన్ బెనాడేకు రెండు వికెట్లు లభించాయి. కాగా, ఆస్ట్రేలియాకు ఇది వరుసగా రెండో విజయం.
సంక్షిప్తంగా స్కోర్లు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 9 వికెట్లకు 188 (చెట్టీ 59, కాప్ 61, పెర్రీ 3/35, షట్ 2/42).
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 45.4 ఓవర్లలో 7 వికెట్లకు 190 (రాచెల్ హేన్స్ 83, స్టాలేకర్ 29, షబ్నిం ఇస్మాయిల్ 4/41, సుసాన్ బెనాడే 2/38).
మహిళల ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి టైటిల్ కైవసం చేసుకునే దిశగా
english title:
a
Date:
Monday, February 4, 2013