ముంబయి, ఫిబ్రవరి 3: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం వెస్టిండీస్‌ను ఢీకొన్న శ్రీలంక 209 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. స్ట్ఫోనీ టేలర్ వీరవిహారంతో, తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 368 పరుగుల తిరుగులేని స్కోరును సాధించగలిగింది. దీనికి సమాధానంగా వెస్టిండీస్ 40 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. విండీస్ తరఫున ఏకంగా తొమ్మిది మంది బౌలింగ్ చేయడం విశేషం. వీరిలో షక్వానా క్విన్‌టైన్‌కు మూడు, షానెల్ డాలీకి రెండు వికెట్లు లభించాయి. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు కిసియా నైట్, స్ట్ఫోనీ టేలర్ గొప్ప ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరూ మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. ఈదశలో కెప్టెన్ శశికళ సిరివర్దనే బౌలింగ్‌లో వికెట్‌కీపర్ దీపికా సురాంగిక స్టెంప్ చేయడంతో కిసియా నైట్ అవుటైంది. ఆమె 29 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 30 పరుగులు సాధించింది. షెమైన్ క్యాంప్‌బెల్ ఆరు పరుగులకే పెవిలియన్ చేరగా, కిషోనా నైట్ (44), దియేంద్ర డోటిన్ (50) సహకారంతో స్ట్ఫినీ విండీస్ స్కోరును 300 పరుగుల మైలురాయిని దాటించింది. ఆమె 194 నిమిషాలు క్రీజ్‌లో నిలిచి, 137 బంతులు ఎదుర్కొని, 18 ఫోర్లు, రెండు సిక్సర్లతో 171 పరుగులు సాధించి చామని సెనెవిరత్నే బౌలింగ్‌లో జయాంగని క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరింది. జూలియానా నెరో (2), షానెల్ డాలీ (0) త్వరత్వరగా అవుట్‌కాగా, చివరిలో కెప్టెన్ మెరిసా అక్వెలెరా అజేయంగా 47 పరుగులు సాధించింది. షాక్వానా క్వింటైన్ 5 పరుగులకు అవుటైతే, అనిసా మహమ్మద్ మూడు పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. లంక బౌలర్లలో సెనెవిరత్నే, సిరివర్దనే, షెరినా రవికుమార్ తలా మూడేసి వికెట్లు పడగొట్టారు.
విండీస్ నిర్దేశించిన 369 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని చేరేందుకు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక ఏ దశలోనూ భారీ స్కోరు చేసే దిశగా అడుగులు వేయలేకపోయింది. 21 పరుగుల వద్ద జయాంగనీ (7) అవుట్‌కావడంతో ప్రారంభమైన వికెట్ల పతనం చివరి వరకూ కొనసాగింది. రసాంగిక 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిందంటే, మిగతా బ్యాట్స్‌విమెన్ ఏ విధంగా విఫలమయ్యారో ఊహించుకోవచ్చు. ఆమె తర్వాత రెండో అత్యధికంగా 26 పరుగులు ఎక్‌స్ట్రాస్ రూపంలో లభించాయి. విండీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయిన లంక 159 పరుగులకు కుప్పకూలింది. అత్యంత హోరాహోరీగా సాగిన మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్‌ను ఒక వికెట్ తేడాతో ఓడించిన శ్రీలంక రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించిన స్ట్ఫెనీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. విండీస్‌ను ఒంటి చేత్తో గెలిపించిన ఘనతను ఆమె సొంతం చేసుకుంది.
మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం వెస్టిండీస్‌ను ఢీకొన్న శ్రీలంక 209 పరుగుల భారీ
english title:
v
Date:
Monday, February 4, 2013