ముంబయి, ఫిబ్రవరి 3: హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయ సెంచరీ వృథా అయింది. మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం గ్రూప్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. చార్లొట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడి, 109 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ విజయం సులభమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఎడ్వర్డ్స్ 123 బంతులు ఎదుర్కొని, 16 ఫోర్లతో 109 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్‌కాగా, సారా టేలర్ (35), అరాన్ బ్రిండిల్ (నాటౌట్ 37) మెరుగైన స్కోర్లు సాధించడంతో ఇంగ్లండ్ మెరుగైన స్థితికి చేరింది. భారత బౌలర్లలో జూలన్ గోస్వామి, నిరంజన నాగరాజన్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 29 పరుగులకే మూడు వికెట్లను పూనమ్ రౌత్ (4), తిరుష్ కామిని (10), మిథాలీ రాజ్ (8) రూపంలో కోల్పోయింది. ఈదశలో హర్మన్‌ప్రీత్, కరూ జైన్ జట్టును ఆదుకునే బాధ్యతను స్వీకరించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 106 పరుగులు జోడించడంతో విజయంపై భారత్ ఆశలు చిగురించాయి. అయితే, 92 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లతో 56 పరుగులు చేసిన జైన్‌ను లారా మార్ష్ క్యాచ్ అందుకోగా, బ్రిండిల్ అవుట్ చేయడంతో కీలక భాగస్వామ్యానికి తెరపడింది. జూలన్ గోస్వామి (19), రీమా మల్హోత్రా (17) కొంత సేపు ఇంగ్లాండ్ బౌలింగ్‌ను ప్రతిఘటించి విఫలమయ్యారు. అమిత శర్మ, నిరంజన పరుగుల ఖాతాను తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఏక్తా బిస్త్ 7 పరుగులకే డానియేల్ వయాట్ బౌలింగ్‌లో సారా మార్ష్‌కు దొరికిపోయింది. 50 ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్లకు 240 పరుగులు చేయగా, అప్పటికి హర్మన్‌ప్రీత్ 107, గౌహెర్ సుల్తానా 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రంట్ 29 పరుగులకే నాలుగు వికెట్లు కూల్చి, భారత్ పతనాన్ని శాసించింది. వయాట్‌కు రెండు వికెట్లు లభించాయి. అద్భుత సెంచరీతో ఇంగ్లాండ్‌కు గౌరవ ప్రదమైన స్కోరును అందించిన ఎడ్వర్డ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్తంగా స్కోర్లు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 8 వికెట్లకు 272 (ఎడ్వర్డ్స్ 109, సారా టేలర్ 35, లిడియా గ్రీన్‌వే 29, బ్రిండిల్ నాటౌట్ 37, జూలన్ గోస్వామి 2/50, నిరంజన నాగరాజన్ 2/56).
భారత్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 (హర్మన్‌ప్రీత్ కౌర్ నాటౌట్ 107, కరూ జైన్ 56, జూలన్ గోస్వామి 19, బ్రంట్ 4/29, వయాట్ 2/52).
భారత్‌పై ఇంగ్లాండ్ విజయం శమహిళల ప్రపంచ కప్ క్రికెట్
english title:
h
Date:
Monday, February 4, 2013