సురలన్ మర్త్య సమూహిగా మనుజులన్ శోభిల్లు బృందారకో
త్కరముంగా ఘను నల్పు నల్పుని ఘనుంగా బుణ్య పాపాళిచే
దిరుగన్ వైచుచు నీ మహా మహిమ ప్రీతి బద్మ జాండంబులం
దరయన్ జీవుల నింద్ర జాలములుగా నాడించు సర్వేశ్వరా!
భావం: సర్వేశ్వరా! మీ మహామహిమ దేవతల్ని మనుష్యులుగాను, మనుష్యుల్ని దేవతలుగాను, గొప్పవాణ్ణి అల్పునిగాను, అల్పుని గొప్పవాణ్ణిగాను పుణ్య పాపాలచేత అటుఇటు కిందికి పైకి తిరుగవేస్తూ బ్రహ్మాండాలలోజీవులందర్నీ ఇంద్రజాలంలో లాగా ఆడిస్తుంటుంది. జీవులకుఉత్తమ అధోగతులు వారి వారి పాపపుణ్యాల చేత కల్గడం అన్నది ఈశ్వర శాసనం. దాని ప్రకారమే ఓడలు బండ్లుగాను, బండ్లు ఓడలుగాను మారుతుంటాయ.
సర్వేశ్వర శతకములోని పద్యమిది నిర్వహణ: శ్రీపావని సేవా సమితి, హైదరాబాద్
సురలన్ మర్త్య సమూహిగా మనుజులన్ శోభిల్లు బృందారకో
english title:
nerchukundam
Date:
Wednesday, February 6, 2013